Breaking News

సమయాన్ని గౌరవిస్తే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టే..

Published on Sat, 03/14/2026 - 07:10

సమయం అంటే కేవలం గడియారంలోని ముల్లులు కాదు, అది మీ జీవితం. మీరు ఒకరికి సమయాన్ని ఇచ్చినప్పుడు, ఆ సమయం తిరిగి రాదు. అంటే, మీరు వారికి మీ 'జీవితం' లోని కొంత భాగాన్ని ఇస్తున్నారు. కాబట్టి, సమయాన్ని వృథా చేయడం అంటే, మీ జీవితాన్ని మీరు వృథా చేసుకోవడమే.

చాలామంది టైమ్ మేనేజ్‌మెంట్‌ని ఒక Technique అనుకుంటారు, కానీ సైకాలజీ ప్రకారం "సమయాన్ని గౌరవించడం అంటే, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడమే". ఇది మీ వ్యక్తిత్వ వికాసానికి వజ్రాయుధం లాంటింది.  

1. The Psychology of Procrastination
చాలామంది "నాకు సమయం సరిపోవడం లేదు" అంటారు. ఇది అబద్ధం! అందరికీ 24 గంటలే ఉంటాయి. అసలు సమస్య 'సమయం' కాదు, 'ప్రాధాన్యత' (Priority).

మీరు వాయిదా వేస్తున్నారంటే (Procrastination), అది బద్ధకం కాదు. అది ఆ పని పట్ల మీకు ఉన్న 'భయం' లేదా 'అభద్రత'. మీరు ఆ భయాన్ని దాటలేనప్పుడు, సమయాన్ని వృథా చేస్తూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు.

2. మీ సమయం.. మీ ఆత్మగౌరవం

Self-Respect: మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకున్నప్పుడు, మీ పట్ల మీకే గౌరవం పెరుగుతుంది.

Self-Disrespect: మీరు "ఈ పని చేస్తాను" అని చెప్పి, వాయిదా వేస్తే.. "నేను నా మాటను నిలబెట్టుకోలేను" అనే నెగటివ్ సిగ్నల్ మీ సబ్-కాన్షియస్ మైండ్‌కి వెళ్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని లోపల నుండి తినేస్తుంది.

3. నిజమైన టైమ్ మేనేజ్మెంట్

ట్రైనర్స్ "ఒక రోజులో 100 పనులు చేసేయ్, యంత్రంలా పని చెయ్" అని చెప్తారు. ఇది మీకు స్ట్రెస్ ఇస్తుంది. మీరు 10 పనులు చేయడం కాదు, మీ జీవితానికి ముఖ్యమైన 1 పని చేయడం ముఖ్యమని సైకాలజీ చెప్తుంది. 'Busy'గా ఉండటం వేరు, 'Productive'గా ఉండటం వేరు.

4. మీ సమయాన్ని మీరు ఎలా ఓన్ చేసుకోవాలి?

Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ సమయాన్ని మీరు గౌరవించడానికి మూడు స్టెప్స్.  

Step 1: వాయిదా అలవాటును బ్రేక్ చేయండి

వాయిదా వేయడానికి గల కారణాన్ని వెతకండి. అది భయమా? పర్ఫెక్షనిజమా? ఆ భయాన్ని 'Break' చేయండి. "పని పర్ఫెక్ట్‌గా ఉండక్కర్లేదు, కానీ పూర్తవ్వాలి" అని మీ మైండ్‌ని ప్రోగ్రామ్ చేయండి.

Step 2: The Priority Box

మీ పనులను ఇలా విభజించండి.

ముఖ్యమైనవి & అత్యవసరమైనవి: ఇవి వెంటనే పూర్తి చేయాలి.

ముఖ్యమైనవి కానీ అత్యవసరం కానివి: వీటికి మీరు సమయాన్ని 'Build' చేయాలి. ఇవే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మిగతా వాటిని తగ్గించండి.

Step 3: Presence
సమయాన్ని గౌరవించడం అంటే, పని చేస్తున్నప్పుడు ఆ పనిలోనే లీనమైపోవడం. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. మీ సమయం మీ చేతుల్లో ఉన్నప్పుడు, మీరు ప్రపంచాన్ని శాసించగలరు. ఇదే 'Beyond' స్టేజ్.

5. మీ సమయం ఎక్కడికి వెళ్తోంది?

ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.

నిన్నటి రోజున మీరు వృథా చేసిన రెండు గంటలు ఎక్కడ వెచ్చించారు?

ఆ రెండు గంటల్లో మీరు మీ లక్ష్యం కోసం ఏమైనా చేసి ఉంటే ఏమయ్యేది?

మీరు మీ సమయానికి మీరే యజమాని అని ఈ రోజు అంగీకరిస్తున్నారా?

సమయమే మీ నిజమైన ఆస్తి!
బ్రో, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే ఆయుష్షు తగ్గుతుంది. మీ సమయాన్ని ఎవరికీ, దేనికీ చౌకగా అమ్మకండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, అప్పుడు ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది.

"Time is the most valuable thing a man can spend."

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: సహానుభూతి పవర్‌..! ఎలా బిల్డ్ చేయాలంటే..)

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)