Health Tips: కాల్షియం లోపిస్తే..? ఎదురయ్యే సమస్యలు ఇవే!

Published on Thu, 04/28/2022 - 11:29

Calcium Deficiency- Symptoms- Problems -Solutions: కాల్షియం అనేది మన శరీరంలో ఓ కీలక పోషకపదార్థం. నరాల ద్వారా మెదడుకు సందేశాలు పంపేటువంటి కీలక శరీర విధులకు కాల్షియం చాలా అవసరం. ఇంకా హార్మోన్ల స్రావం, కండరాలు, నరాల సంకోచ, వ్యాకోచాలకు కాల్షియం అవసరం చాలా ఉంటుంది. ముఖ్యంగా, అస్థిపంజర పనితీరుకు కాల్షియం నిదర్శనం. అయితే కొందరిలో కొన్ని కారణాల వల్ల కాల్షియం లోపిస్తుంటుంది.

ఇలా కాల్షియం లోపించడాన్నే వైద్యపరిభాషలో ‘హైపోకాల్సీమియా’అని అంటారు. హైపోకాల్సీమియాకు చికిత్స తీసుకోకపోతే ‘ఆస్టియో పేనియా’ అనే ఎముకలు సన్నబడిపోయే వ్యాధి, పిల్లల్లో బలహీనమైన ఎముకలు (రికెట్స్, ఎముక సాంద్రత కోల్పోయే వ్యాధి (బోలు ఎముకల వ్యాధి) వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అయితే ఆహార అలవాట్లను మార్చుకోవడం వల్ల కాల్షియం లోపాన్ని నివారించుకోవచ్చు. 

కాల్షియం లోపిస్తే కనిపించే లక్షణాలు
వేళ్లు, పాదాలు, కాళ్లలో తిమ్మిరి, ఒకవిధమైన జలదరింపు
కండరాలలో తిమ్మిరి లేదా కండరాలు పట్టేయడం
బద్ధకం, తీవ్రమైన అలసట
బలహీనమైన, పెళుసుగా ఉండే గోర్లు
దంత సమస్యలు, దంతాలు రావడంలో ఆలస్యం
తికమకగా అనిపించడం
ఆకలి లేకపోవడం.

దీర్ఘకాలిక కాల్షియం లోపం అనేక ఇతర శరీర భాగాలను బాధించవచ్చు. అందువల్ల మనకు పైన చెప్పుకున్న లక్షణాలు కనిపిస్తే, వెంటనే పరీక్ష చేయించుకుని, లోపం ఉందని నిర్ధారణ అయితే తగిన మందులు వాడటం ఉత్తమం. లేదంటే ఆహారపు అలవాట్లలో తగిన మార్పులు చేసుకోవడం అవసరం. 

కాల్షియం లోప నివారణకు తీసుకోవలసిన ఆహార పదార్థాలు
పాలు, పాల ఉత్పత్తులు: జున్ను, రసమలై, పెరుగు, పాలు పులియబెట్టి చేసిన పెరుగువంటి యోగర్ట్‌ అనే పదార్థం, పనీర్‌
కూరగాయలు, బచ్చలికూర, పాలకూర, బ్రోకలీ, పప్పుధాన్యాలు, బీన్స్, బఠానీలు, తృణధాన్యాలు
కాల్షియం అధికంగా ఉండే మినరల్‌ వాటర్‌
సముద్రం నుంచి లభించే ఆహారపదార్థాలు (సీఫుడ్‌), కొవ్వు లేని మాంసాలు, గుడ్లు
ఖర్జూర పండ్లు: కాల్షియం, ఐరన్‌ లోపాలతో బాధపడేవారు ఖర్జూర పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి, అనిమీయా వ్యాధిని కూడా తగ్గిస్తాయి. 
కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు పుష్ఠిగా వుంటాయి. దృఢమైన ఎముకల వలన శరీరం నిటారుగా నిలుస్తుంది. చక్కని రూపం వస్తుంది. దంతాలు, గుండె కండరాలు ఆరోగ్యంగా వుంటాయి కాబట్టి కాల్షియం లోపం లేకుండా చూసుకోవడం అత్యవసరం.
 

చదవండి👉🏾Palmyra Palm: వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా?

Videos

ట్రైలర్ చూసి రామ్ చరణ్ రియాక్షన్ ఏంటంటే..

లౌడ్ పార్టీకి అడ్డొచ్చాడని.. ఇంజనీరింగ్ విద్యార్థిపై దాడి!

ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ

అమెరికాలో తెలంగాణ అమ్మాయి దారుణ హత్య

ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చిన ఏకైక మగాడు

నెక్స్ట్ నువ్వే.. జాగ్రత్త! కొలంబియాకు ట్రంప్ మాస్ వార్నింగ్

పోలీసుల ఎదుటే.. వేట కొడవళ్లతో..!

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

Photos

+5

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మూవీ HD స్టిల్స్‌

+5

బ్లూ కలర్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)