భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..
Breaking News
నో స్ట్రెస్..! రోగాల బారినడకుండా..
Published on Sun, 03/29/2026 - 17:30
ప్రతి ఒక్కరి జీవితకాలంలో ఎంతో కొంత ఒత్తిడి (స్ట్రెస్)ఉంటుంది. అయితే కొందరిలో ఇది చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి అన్నది మెదడు, మానసిక ఆరోగ్యంపై మాత్రమే కాదు... దేహం తాలూకు భౌతిక సమస్యల రూపంలోనూ వ్యక్తమవుతుంటాయి. ఒత్తిడికి కారణాలు, దీని దుష్ప్రభావాలు, వీటిని అధిగమించడం ఎలా అనే పలు అంశాలను వివరించేందుకే ఈ కథనం.
ఒత్తిడి పెరగడానికి పలు అంశాలు కారణమవుతాయి. ఉదాహరణకు పేదరికం, ప్రేమించేవారికి దూరం కావడం సామాజికంగా ఒంటరికావడం, ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోవడం, కుటుంబంలో ఎవరినైనా కోల్పోవడం... ఇలా ఎన్నో కారణాలు ఒత్తిడి పెరగడానికి కారణమవుతాయి.
ఒత్తిడి (స్ట్రెస్)లో రకాలు : ఈ స్ట్రెస్‌ను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి...
మేలు చేసే ఒత్తిడి : దీన్ని ఇంగ్లిష్‌లో ‘గుడ్ స్ట్రెస్’ అని చెప్పవచ్చు. అయితే ఒత్తిడిలోనూ మంచి ఒత్తిడి ఉంటుందా అనే సందేహం రావచ్చు. కొన్ని సందర్భాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పుడు ఆ పని త్వరగా లేదా అనుకున్న విధంగా విజయవంతంగా ముగుస్తుంది.
ఉదాహరణకు ఏదైనా ఒక పనిని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు అది ఆ టైమ్‌లోపు ముగుస్తుందా లేదా అన్న ఒత్తిడిలో పని చేయడం వల్ల నిర్ణీత గడువులో పని బాగా పూర్తయ్యే అవకాశముంటుంది. ఇలాంటి మేలు చేసే ఒత్తిడిని ‘మంచి ఒత్తిడి’ లేదా ఇంగ్లిష్‌లో ‘యూస్ట్రెస్’ అంటారు.
భరించగలిగేంత ఒత్తిడి : దీనితో సమస్య అవుతుంది గానీ... కొంత ప్రయత్నంతో దీన్ని భరించవచ్చు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలతో దీన్ని అధిగమించవచ్చు. అందుకే దీన్ని భరించగలిగే ఒత్తిడి (టాలరబుల్ స్ట్రెస్)గా పేర్కొంటారు.
హానికరంగా పరిణమించే ఒత్తిడి : ఇది తీవ్రమైన ఒత్తిడి చాలాకాలం పాటు కొనసాగుతుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యంపైనా, దేహంపైనా దుష్ప్రభావాలు కనిపిస్తాయి. అందుకే దీన్ని హానికరమైన ఒత్తిడి లేదా ‘టాక్సిక్ స్ట్రెస్’గా చెబుతారు.
ఏదైనా ఒత్తిడి కలిగినప్పుడు అది కొద్ది సేపటికోసమే అయితే దేహం దాన్ని ఎలాగోలా తట్టుకుని తన జీవక్రియల వ్యవస్థలను (బయలాజికల్ సిస్టమ్స్‌ను) మళ్లీ మామూలు స్థితికి తెచ్చుకోగలుగుతుంది. ఉదాహరణకు మనం ఒక పామును చూశామనుకోండి. ఒళ్లు ఝల్లుమంటుంది. తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. స్నేక్ రెస్క్వువర్స్ వచ్చి దాన్ని పట్టుకుని వెళ్లిన తర్వాత ఝల్లుమన్న ఒళ్లు, ఒత్తిడి మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తాయి.
కానీ ఏదైనా ఒత్తిడి అదే పనిగా చాలా సుదీర్ఘకాలం΄ాటు అదే స్థితిలో కొనసాగుతూ ఉంటే ఆ ఒత్తిడి తాలూకు దుష్ప్రభావాలు అనేక రకాలుగా బయటపడతాయి. ఉదాహరణకు కుంగుబాటు (డిప్రెషన్), ఉద్విగ్నత (యాంగై్జటీ), గుండెజబ్బులు (కార్డియోవాస్కులార్ డిసీజెస్), డయాబెటిస్, హైబీపీ లాంటి దేహ జీవక్రియలకు సంబంధించిన (మెటబాలిక్ డిజార్డర్స్) వంటి రూపంలో బయటపడవచ్చు.
మెదడుపై ఒత్తిడి ప్రభావం
మెదడుపై పలురకాలుగా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు...
హిప్పోక్యాంపస్పై : ఇది మెదడులో మూడ్స్‌ను, జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే భాగాలు. స్ట్రెస్ తాలూకు ప్రతికూల ప్రభావాలు హి΄్పోక్యాంపస్పై పడితే అది మూడ్స్నూ, మన జ్ఞాపకశక్తిని ప్రభావితం చేయవచ్చు.
అమిగ్దలా : ఇది మెదడులో ఉద్విగ్నతను (యాంగై్జటీని) కలగజేసే ప్రాంతం. కాబట్టి అదేపనిగా యాంగై్జటీ కొనసాగే ప్రమాదం ఉంటుంది.
ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ : మెదడులోని ఈ భాగం మనం నిర్ణయాలు తీసుకునే ప్రాంతం. అంతేకాదు... ఇది భావోద్వేగాలను నియంత్రించే భాగం కూడా కావడంతో ఆ మేరకు దుష్ప్రభావాలు కనిపిస్తాయి.
ఇవే కాకుండా ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే మెదడులో ఆలోచనలూ, అన్ని రకాల కార్యకలాపాలకు కేంద్రాలైన మెదడు కణాల (న్యూరాన్ల) ఆకృతి మారడం, వాటి పనితీరుపై దుష్ప్రభావలు పడటంతోపాటు రకరకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.
ఒత్తిడి... న్యూరో కెమికల్స్ భూమిక(రోల్ ఆఫ్ న్యూరోకెమికల్స్)
ఒత్తిడి సమయంలో కొన్ని రకాల న్యూరోకెమికల్స్ విడుదల అవుతాయి. వీటినే స్ట్రెస్ కెమికల్స్ అంటారు. ఉదాహరణకు కార్టిసాల్ లాంటి గ్లూకోకార్టికాయిడ్స్, గ్లుటామేట్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లు వంటివి. దీర్ఘకాలం ఒత్తిడి కొనసాగితే ఇవి మెదడులో అనేక మార్పులు తెస్తాయి. అంతేకాదు దీర్ఘకాలంపాటు ఒత్తిడి కొనసాగితే అది దేహం తాలూకు జీవక్రియల మీదా ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి.
ఒత్తిడి నివారణ పద్ధతులు /చికిత్స
కొన్ని జీవనశైలిని మెరుగుచేసుకునే ప్రక్రియల ద్వారా ఒత్తిడిని చాలావరకు అధిగమించవచ్చు. ఉదాహరణకు...
మంచి పోషకాహారం, కంటి నిండా నిద్ర
కుటుంబం, స్నేహితులను సన్నిహిత సంబంధాలు (మంచి సోషల్ స΄ోర్ట్ సిస్టమ్)
ఆహ్లాదకరమైన సంగీతం వినడం లేద ఇష్టమైన హాబీలను పెంపొందించుకోవడం ∙రోజూ తేలికపాటి వ్యాయామం, ధ్యానం వంటి ప్రక్రియలతో చాలావరకు ఒత్తిడిని అధిగమించవచ్చు. అయితే దీర్ఘకాలిక ఒత్తిడిని అధిగమించడానికి సైకియాట్రిస్ట్‌లను సంప్రదించి కొన్ని మందులు, ఒత్తిడికి కారణమైన అంశాలను బట్టి కౌన్సెలింగ్ అవసరమవుతాయి.
డాక్టర్ ప్రవీణ్ ఎస్ గోపన్, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
నిర్వహణ: యాసీన్
(చదవండి: కాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి..క్షణాల్లో ప్రాణాంతకంగా మారి..)
Tags : 1