Breaking News

చినుకుల్లో హాయి..! జాగ్రత్తలు అవసరమోయి..

Published on Thu, 06/26/2025 - 10:29

చిరుజల్లులలో ఏదైనా వేడి వేడి ఫుడ్‌ ఉంటే.. దానికి తోడు కమ్మటి వాసనతో హాట్‌ కాఫీ సిప్‌ చేస్తుంటే.. ఆ హాయి మరోలా ఉంటుంది. ఇలాంటి అనుభూతులు నగరవాసులకు ఎన్నెన్నో.. సిటీలో చినుకులు పడుతుంటే చాలు జనం ట్యాంక్‌బండ్, నెక్లెస్‌ రోడ్‌లపై సందడి చేస్తుంటారు. చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఈ మాన్‌సూన్‌ సీజన్‌లో ఆరోగ్యం, హైజీన్, డిజిటల్‌ టూల్స్‌ వంటి అంశాలను సైతం సమానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు నగరవాసులు. ఎందుకంటే ఈ కాలంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, నీటి కాలుష్యం, వాతావరణ మార్పులతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వర్షాకాలాన్ని సురక్షితంగా, అందంగా అనుభవించడానికి కొన్ని లైఫ్‌స్టైల్‌ హ్యాక్స్, గాడ్జెట్స్, యాప్స్‌ సైతం అందుబాటులో ఉన్నాయి. 

వర్షాకాలం అనేది సహజంగా ఆనందాన్ని కలిగించేది. కానీ అదే సమయంలో కొంత జాగ్రత్త అవసరం. 
ఆరోగ్యాన్ని, గాడ్జెట్‌లను, ఇంటిని, ఫ్యాషన్‌ను సమానంగా వాడుకుంటే ఈ సీజన్‌ను ఎంతో ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు. మోడ్రన్‌ లైఫ్‌స్టైల్‌లో టెక్నాలజీ సహకారంతో వర్షాకాలాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరం. ఈ వానల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు మీరు పొందే ఆనందానికి బలం అవుతాయి.

వర్షాకాలం హెల్త్‌కేర్‌ టిప్స్‌.. 
వానల సమయంలో నీటి కాలుష్యం, ఆహారంలోని బ్యాక్టీరియా వల్ల జ్వరాలు, డైజెస్టివ్‌ సమస్యలు, స్కిన్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ సీజన్‌లో ఇంట్లోనే వంట చేసుకోవడం, వేడి నీళ్లు తాగడం, తులసి టీ, అల్లం–పెప్పర్‌ సూప్‌ వంటి బూస్టింగ్‌ ఫుడ్స్‌ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఫ్యాషన్‌తో పాటు ఫంక్షనాలిటీ.. 
వర్షాకాలం అంటే మడమ తొక్కినట్లుగా బురద, తడిగా మారే దుస్తులు.. కానీ ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాటర్‌ రిపెలెంట్‌ ఫ్యాబ్రిక్స్, సిలికాన్‌ షూ కవర్స్, ఫోల్డబుల్‌ రైనిక్స్‌ లాంటి ఉత్పత్తులతో స్టైలిష్‌గా ఉండటమే కాకుండా తడిసిపోకుండా ఉండొచ్చు. 

ట్రెండీ అంబ్రెల్లాస్‌: యాక్టివ్‌ కలర్స్, ఓపెన్‌–క్లోజ్‌ మెకానిజంతో అందంగా ఉండే మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

వాటర్‌ప్రూఫ్‌ బ్యాక్‌ప్యాక్స్‌: టెక్‌ లవర్స్‌ కోసం వర్షంలో కూడా ల్యాప్‌టాప్, గ్యాడ్జెట్లు భద్రంగా తీసుకెళ్లేందుకు ఉపయోగకరం. 

వాటర్‌ప్రూఫ్‌ ఫోన్‌ కవర్లు: ముఖ్యంగా రోడ్ల మీద లేదా బైక్‌ ప్రయాణాల్లో తప్పనిసరి. 

హెల్త్‌ మానిటరింగ్‌ యాప్‌లు, గాడ్జెట్స్‌.. 

ఫిట్‌ బిట్, ఎమ్‌ఐ బ్యాండ్‌ వంటి వేరబుల్స్‌ ద్వారా వాకింగ్‌ ట్రాక్‌ చేయవచ్చు. 
హెల్తీ ఫై మీ వంటి డైట్‌ యాప్‌లు మంచి 
ఆహార నియమాలు పాటించేందుకు దోహదపడుతున్నాయి. 
ప్రాక్టో, టాటా 1 ఎంజీ వంటి యాప్‌ల ద్వారా ఇంట్లో నుంచే డాక్టర్‌ కన్సల్టేషన్‌ పొందవచ్చు.
టెక్నాలజీతో వర్షాన్ని అనుభవించండి..  
వర్షాలు ఎప్పుడు వస్తాయో, ఎక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఉంటుందో ముందే తెలిసిపోతే బాగుంటుందనే మాట వాస్తవమే. ఈ విషయంలో కొన్ని యాప్స్‌తో పాటు ప్రయాణించవచ్చు. 
ఆక్యూ వెదర్, స్కైమెట్‌ వెదర్, లైవ్‌ రడార్‌తో వర్ష సూచన. 
గూగుల్‌ మ్యాప్స్, మై గేట్‌ల టెక్నాలజీతో ట్రాఫిక్‌ అప్డేట్స్, లోకేషన్‌ ఆధారిత అలర్ట్స్‌. 
స్పాటీ ఫై, పాకెట్‌ ఎఫ్‌ఎఫ్‌: వానలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు, లేదా ఇంట్లో కూర్చుని విండో వెనుకగా జల్లులు చూస్తున్నప్పుడు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌. 

వర్షంలో ఇంటిని కాపాడండి 

డోర్‌ మ్యాట్స్, షూ స్టాండ్స్‌: వర్షపు నీళ్లు ఇంట్లోకి రాకుండా అడ్డుకునేందుకు.. 

డీహ్యూమిడిఫైయర్స్‌: గదుల్లో తడిగా మారే వాతావరణం, మబ్బును నివారించేందుకు ఉపయోగపడతాయి. 

ఆరోమా డిఫ్యూజర్లు: తడి వాసనను తొలగించి ఫ్రెష్‌నెస్‌ కలిగించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.

విందుగా మార్చే చిట్కాలు 
వీకెండ్‌ విత్‌ రైన్‌ థీమ్‌: ఇంట్లో ఫ్రెండ్స్‌తో టీవీకి దగ్గరగా బీన్స్‌ బ్యాగ్స్, మసాలా టీ, బజ్జీలు.. ఇదే అసలైన హ్యాపీనెస్‌. 

రెయిన్‌ ఫ్రేమ్స్‌ ఫొటోగ్రఫీ: వర్షపు నీటి బిందువులు, బల్కనీ పూల మధ్య సెల్ఫీలు.. సోషల్‌ మీడియాకు మరిచిపోలేని అనుభూతులు. 

రెయిన్‌ ఫ్రెండ్లీ రైడ్స్‌: వర్షంలో బైక్‌ రైడ్స్, సైక్లింగ్‌ ట్రిప్స్‌ వంటి గ్రూప్‌ యాక్టివిటీస్‌ ద్వారా వర్షాన్ని మరింత ఆస్వాదించవచ్చు.  

(చదవండి: 22వేల కోట్ల బ్యాంక్‌ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్‌.. ఐనా ఆమె స్టిల్‌ బ్యాచిలర్‌..!)

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)