Breaking News

దేవుడంటే భక్తి.. అయినా ఎందుకిలా..?

Published on Thu, 01/08/2026 - 18:13

నాకు మొదటినుంచి దేవుడంటే విపరీతమైన భయభక్తులు. తరచు గుళ్లకు వెళుతుంటాను. రోజూ పూజ చేస్తుంటాను. అయితే గత రెండేళ్లుగా దేవుళ్లపైన విపరీతమైన చెడు ఆలోచనలు వస్తున్నాయి. దేవుడిని బూతుమాటలు తిట్టినట్లు, దేవుడి పటాలను అగౌరవపరచినట్టు... ఇలా రాయడానికి వీలులేని చెడ్డ తలంపులు వస్తున్నాయి. దాంతోటే ‘ఇది చాలా తప్పు, నాలాంటి భక్తుడికి ఇలాంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి...’ అని మాన సికంగా చాలా మధన పడుతున్నాను. ఈ ఆలోచనల మూలాన దేవుడు నన్ను శపిస్తాడేమోననే భయంతో సరైన తిండి, నిద్రలతోపాటు మనశ్శాంతికి కూడా దూరం అయియాను. ఏ పనిమీదా ధ్యాస పెట్టలేకపోతున్నాను. నాకీ బాధనుంచి విముక్తి కలిగే మార్గం చెప్పగలరు. 
– రఘురామ్, నల్గొండ

ఎంత వద్దనుకున్నా మనసులో ఇలా మాటిమాటికీ చెడు తలంపులు వచ్చి, మనసును బాధించే ఇలాంటి ఆలోచనలను అబ్‌సెషన్స్‌ అంటారు. ఆ చెడు తలంపులనుంచి బయటపడేందుకు మాటిమాటికీ లెంపలేసుకోవడం, దండాలు పెడుతూ ఉండటాన్ని కంపల్షన్స్‌ అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన మానసిక రుగ్మత. దీనిని ఓసీడీ అంటారు. మన మెదడులోని సెరటోనిన్‌ అనే ఒక ప్రత్యేకమైన రసాయన పదార్థం సమతుల్యతలో తేడాలొచ్చినప్పుడు కొందరిలో ఇలాంటి విపరీతమైన ఆలోచనలు, ధోరణులు కలుగుతాయి. 

ఇవి రాకూడదని ప్రయత్నించినకొద్దీ మరింత ఎక్కువగా మనసులోకి చొచ్చుకొచ్చి విపరీతమైన మానసిక సంఘర్షణకు గురిచేస్తాయి. ఈ ఆలోచనలకు మూలకారణమైన మీ మెదడులోని రసాయన చర్యను సరిచేయడం ద్వారా ఈ అబ్‌సెషన్స్‌ను పూర్తిగా అదుపు చేయవచ్చు. ఆధునిక మానసిక వైద్యశాస్త్రంలో ఈ ఓసీడీ జబ్బును పూర్తిగా తగ్గించేందుకు మంచి మందులు, కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ అనే మానసిక చికిత్స అద్భుతంగా పని చేస్తాయి. 

మందులతోపాటు థాట్‌ స్టాపింగ్, ఎక్స్‌పోజర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అనే మానసిక చికిత్స ద్వారా దేవుడిపైన మీకు కలిగే చెడు ఆలోచనలనుంచి విముక్తి కలిగించవచ్చు. ఓసీడీ జబ్బును తగ్గించేందుకు వీటికితోడు ఇటీవలే వచ్చిన ఆర్‌.టి.ఎం.ఎస్‌. అనే అత్యాధునిక పరికరాన్ని వాడుతున్నాము. మీరు వెంటనే మీకు అందుబాటులో ఉన్న సైకియాట్రిస్టును కలిసి చికిత్స తీసుకోండి. ఆల్‌ ది బెస్ట్‌!

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.co)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)