Breaking News

కాబోయే అమ్మకు కడుపులో వికారం

Published on Sun, 06/14/2026 - 11:58

గర్భధారణ తర్వాత చాలామంది మహిళల్లో వాంతులు అవుతుండటం చాలా సాధారణం. వాంతులు కావడం అనే లక్షణాన్ని బట్టి ఒక మహిళ గర్భవతి అయ్యిందనే సూచన మన చాలా సినిమాల్లో కనిపించడం సాధారణమే. గర్భవతులైన అందరిలోనూ ఇదే లక్షణం కనిపించకపోయినప్పటికీ కొందరిలో ఇలా వాంతులు కావడం చాలా సాధారణం. 

అలాగే గర్భధారణ జరిగిన చాలామంది మహిళల్లో వికారం (నాసియా) అనే లక్షణమూ కనిపిస్తుంది. గర్భవతుల్లో ఇలా ఎందుకు జరుగుతుందో, వికారంగా ఉండటం లేదా వాంతులు ఎక్కువగా అవుతున్న మహిళల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

గర్భవతుల్లో కనిపించే వాంతులు ఎక్కువగా కావడం, వికారంగా ఉండటాన్ని డాక్టర్లు సాధారణ పరిభాషలో ‘మార్నింగ్‌ సిక్‌నెస్‌’గా డాక్టర్లు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపించడానికి దేహంలో స్రవించే ఒక హార్మోన్‌ కారణమవుతుంది. మార్నింగ్‌ సిక్‌నెస్‌తో బాధపడుతున్న మహిళలు 

తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... 
మార్నింగ్‌ సిక్‌నెస్‌ కారణంగా వాంతులు అవుతున్న గర్భవతులు రోజూ కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తింటుండాలి. కొవ్వులు, మసాలాలూ ఎక్కువగా ఉండే హెవీ ఫుడ్‌ కాకుండా... ఆహారం చాలా తేలిగ్గా ఉండి, సులువుగా జీర్ణమయ్యేలాంటి బ్లాండ్‌ డైట్‌ తీసుకుంటూ ఉండటం మేలు.  ద్రవాహారాలు... అంటే... కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్‌ ద్రవాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పండ్లు కూడా ఎక్కువగానే తింటూ ఉండటం మంచిది. పచ్చళ్లు, నూనెవస్తువులు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. వాంతులు అవుతున్నా దాన్ని విస్మరించి, ఏదో ఒకటి తింటూ ఉండండి. 

ఎందుకంటే... వాంతులవుతున్నందున అసలే తినకపోతే ఎసిడిటీ వల్ల కడుపులో యాసిడ్‌ పేరుకొని పసరువాంతులు, రక్తపువాంతులు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటివారు అవసరమైనప్పుడు డాక్టర్‌ పర్యవేక్షణలో మాత్రమే కొన్ని రకాల యాంటాసిడ్‌ మందులు, వాంతులను, వికారాన్ని తగ్గించే మందులైన యాంటీఎమెటిక్‌ మందులను వాడవచ్చు. అయితే వీటిని కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. చాలామందిలో మార్నింగ్‌ సిక్‌నెస్‌ చాలా సహజం. దాని గురించి ఆందోళన అక్కర్లేదు. అయితే అది చాలాకాలం కొనసాగుతుంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. 

వాంతుల కారణంగా బిడ్డకు పోషకాలు అందవా?
కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళలకు తమకు చాలా ఎక్కువగా 
వాంతులు అవుతున్నాయనీ, దాంతో కడుపులోని బిడ్డకు అందాల్సిన  పోషకాలు అందవేమోనని ఆందోళన పడుతుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. వాంతులు అవుతున్నా బిడ్డకు అందాల్సిన పోషకాలు అందుతూనే ఉంటాయి.

ఇటీవలి అధ్యయనాల్లో తేలిన విషయం ఏమిటంటే...
ఇటీవల ఓ తాజా అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... గర్భవతుల్లో వాంతులకు ప్రధానంగా గ్రోత్‌ డిఫరెన్సియేషన్‌ ఫ్యాక్టర్‌ –15 (జీడీఎఫ్‌–15) అనే అంశం కూడా ఒక ప్రధాన కారణమని తేలింది. ఈ ఫ్యాక్టర్‌ వల్ల కొత్తగా గర్భధారణ జరిగిన మహిళల్లో... ఆకలి లేకపోవడం, ఏ ఆహారమూ రుచిగా అనిపించక΄ోవడం / రుచి తెలియక΄ోవడం, వికారం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయనే విషయం తాజాగా వెల్లడయ్యింది.  

గర్భధారణ తర్వాత మహిళల్లో వాంతులు ఎందుకంటే...
ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల్లో ‘హ్యూమన్‌ కోరియానిక్‌ గొనాడోట్రాపిన్‌’ (హెచ్‌సీజీ) అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. మహిళ దేహానికి ఈ హర్మోన్‌ ఒక సందేశం పంపిస్తుంది. అదేమిటంటే... ‘ఈ దేహంలో గర్భధారణ ప్రక్రియ మొదలైంది. కాబట్టి నెలనెలా వచ్చే పీరియడ్స్‌ ప్రక్రియను ఆపేసి, ఇక గర్భధారణ ప్రక్రియ కోసం అవసరమైన ప్రొజెస్టెరాన్‌ను స్రవించమనీ, తద్వారా... అండం ఆశ్రయం తీసుకోవాల్సిన ‘ఎండోమెట్రియమ్‌–యుటెరైన్‌’ పొరలను మరింత మందంగా చేయడం, తద్వారా గర్భం నిలబడేలా చేయాలం’టూ ఈ హెచ్‌సీజీ హార్మోన్‌ ద్వారా దేహానికి సందేశం అందుతుంది. 

అయితే కొందరిలో ఈ ‘హ్యూమన్‌ కోరియానిక్‌ గొనాడో ట్రాపిన్‌ (హెచ్‌సీజీ) చాలా తక్కువ మోతాదులో, మరికొందరిలో చాలా ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది.  ఆ హార్మోన్‌ కారణంగా గర్భవతుల్లో కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఓ మోస్తరుగా, మరికొంతమందిలో చాలా ఎక్కువగా వాంతులు అవుతుంటాయి.  మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. 
డాక్టర్‌ పి. స్వప్న, సీనియర్‌ కన్సల్టెంట్‌ అబ్‌స్టెట్రిక్స్‌ – గైనకాలజీ 
నిర్వహణ: యాసీన్‌

(చదవండి: ఫైట్‌ అండ్‌ ప్లైట్‌లో గ్రాండ్‌ మాస్టర్‌)

#

Tags : 1

Videos

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు