కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు
Breaking News
ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్ చూసేవాళ్లు! ఇవి ట్రై చేస్తే..
Published on Sat, 08/27/2022 - 12:38
Tips To Relax Eyes- Stress Relief: ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్ లేదా మొబైల్ స్క్రీన్ చూడడం వల్ల కళ్లు ఒత్తిడికి గురై అలసిపోతుంటాయి. ఇలాంటి కళ్ల ఒత్తిడిని తగ్గించి ఉపశాంతిని కలిగించే మాస్క్‌లను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం...
రోజ్‌వాటర్‌తో..
►రోజ్‌వాటర్‌లో కాటన్ ముక్కను కాసేపు నానబెట్టాలి. తరువాత కాటన్‌ను రెండుకళ్లపై మొత్తం కప్పి ఉంచి, పదిహేను నిమిషాలు తరువాత తీసేయాలి. ఒకసారి ఇలా చేసిన తరువాత కాటన్‌ను రిఫ్రిజిరేటర్‌లో పెట్టి మరోసారి కూడా వాడుకోవచ్చు.
నల్లని వలయాలు సైతం తగ్గుముఖం
►టీ బ్యాగ్‌లను చల్లటి నీటిలో నానబెట్టాలి. తరువాత టీ బ్యాగ్‌లను నీటి నుంచి బయటకు తీసి, టీబ్యాగ్‌లో అధికంగా ఉన్న నీటిని పిండి కళ్లమీద పెట్టుకుని పదినిమిషాలు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు ఒత్తిడి తగ్గడంతోపాటు, కంటిచుట్టూ ఏర్పడిన నల్లని వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
బంగాళదుంప, పుదీనా పుదీనాతో..
►బంగాళదుంప, పుదీనా ముఖాన్ని అందంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
►అదేవిధంగా కళ్ల ఒత్తిడిని తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి.
►పుదీనా రసం, బంగాళ దుంప రసాన్ని సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి పదినిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.
►మిశ్రమం చల్లబడిన తరువాత .. కాటన్ బాల్‌ను ముంచి కళ్లమీద పెట్టుకుని ఐదు నిమిషాలు ఉంచుకోవాలి.
►కళ్ల ఒత్తిడి తగ్గడంతోపాటు, కళ్లచుట్టూ ఏర్పడిన ముడతలు తగ్గుముఖం పడతాయి.
►వీటిలో ఏ ఒక్కటి పాటించినా కళ్లకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
చదవండి: Tips To Increase Platelet Count: ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే..
Mental Health: ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? ఆ మూడింటిపై నియంత్రణ లేకపోతే! అంతే ఇక..
Tags : 1