Breaking News

ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేయడం ప్రమాదమా...?

Published on Sun, 06/22/2025 - 11:18

నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. ఫర్టిలిటీకి సంబంధించి పెళ్లిని ఇంకెంత కాలం వాయిదా వేసుకోవచ్చో చెప్పండి?
– శ్రీలేఖ, హైదరాబాద్‌. 

ప్రస్తుతం మీరు ముప్పై ఐదేళ్ల వయస్సులో ఉన్నందున గర్భధారణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం. వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో ఎగ్స్‌ కౌంట్, వాటి నాణ్యత రెండూ తగ్గిపోతాయి. ముప్పై ఏళ్ల తర్వాత గర్భధారణలో సమస్యలు ఎక్కువ అవుతాయి. గర్భస్రావం, బీపీ, సుగర్, శిశువుకు జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 

మహిళల ఫర్టిలిటీ గరిష్ఠ స్థాయిలో ఉండే వయస్సు ఇరవై నుంచి ముప్పై మధ్య. ఇరవై ఏళ్లలోపు గర్భం ధరించే అవకాశం ఎనభై ఐదు శాతం ఉంటే, ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య అది అరవై శాతానికి పడిపోతుంది. ముప్పై ఐదు నుంచి నలభై మధ్య నలభై శాతానికి పడిపోతుంది. వయస్సు పెరిగే కొద్దీ గర్భం ధరించే అవకాశం తగ్గుతుంది. అప్పుడు సహజ గర్భధారణ కష్టమై, ఐయూఐ లేదా ఐవీఎఫ్‌ వంటి వైద్యపద్ధతులపై ఆధారపడాల్సి వస్తుంది. మీ వయస్సును బట్టి, ఇప్పటి నుంచే ప్లాన్‌  చేసుకోవడం చాలా అవసరం. 

నెలసరి చక్రాలు క్రమంగా ఉన్నాయా? పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్‌ వంటి సమస్యలున్నాయా అన్నది పరిశీలించాలి. అధిక బరువు, పొగతాగే అలవాటు, రక్తపోటు, సెక్స్‌ మూలంగా వచ్చే వ్యాధులు వంటి అంశాలు కూడా గర్భధారణను ప్రభావితం చేస్తాయి. 

కనీసం ఒక సంవత్సరం పాటు సహజంగా గర్భం ధరించే ప్రయత్నం చేయాలి. ఫలితం రాకపోతే, వైద్య నిపుణుడిని కలవాలి. వయస్సు, జన్యు చరిత్ర ఆధారంగా తగిన మందులు, అవసరమైతే ఐయూఐ లేదా ఐవీఎఫ్‌ వంటి వైద్య విధానాలను సూచిస్తారు. అందుకే ఆలస్యం చేయకుండా మంచి నిర్ణయం తీసుకోండి.  

నా వయస్సు అరవై సంవత్సరాలు. ఇరవై సంవత్సరాల క్రితం బ్లీడింగ్‌ అవుతోందని గర్భాశయం తీసేశారు. ఇప్పుడు దగ్గినా, తుమ్మినా యోని భాగంలో గడ్డలాగా కనిపిస్తోంది. కానీ నొప్పి లేదు. డాక్టర్‌ను కలవాలా?
– శారద, విశాఖపట్నం. 

మీరు చెప్పిన వివరాల ప్రకారం, మీ వయస్సులో యోని భాగంలో గడ్డలాగా కనిపించడం నిర్లక్ష్యం చేయదగ్గ విషయం కాదు. గర్భాశయం తొలగించిన తర్వాత ఆ ప్రాంతం బలహీనపడడం వలన కొన్ని సంవత్సరాల తర్వాత యోని భాగం కిందకు జారిపోతుంది. ఇది సాధారణంగా నొప్పిని కలిగించదు. కాని, ఏదో బరువుగా, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఈ పరిస్థితిని వజైనల్‌ వాల్‌ ప్రోలాప్స్‌గా పరిగణిస్తారు. 

ఇది నరాలపై ఒత్తిడి కలిగించి అసహజమైన ఫీలింగ్‌ను కలిగిస్తుంది. అలాగే, యోని భాగంలో పుండ్లు, మంటలు, వాపులు ఏర్పడిన సందర్భాల్లో కూడా గడ్డలాగా అనిపించవచ్చు. మూత్రనాళ సమస్యల కారణంగా కూడా ఇలాంటి సమస్యే వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో వజైనల్‌ వాల్‌తో పాటు మూత్ర సంచి లేదా మోషన్‌ పేగు కూడా బలహీనపడిపోయి కిందకు జారిపోవచ్చు. అప్పుడు మూత్రం పూర్తిగా వెలువడకపోవడం, మూత్ర సంచి తడిపోవడం, మలవిసర్జన నియంత్రణ కోల్పోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇవన్నీ పెల్విక్‌ భాగం బలహీనతకు సంకేతాలు. 

ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి. వారు పెల్విక్‌ వ్యాయామాలు సూచిస్తారు. అవసరమైతే మల్టీ విటమిన్‌ మాత్రలు ఇస్తారు. మూత్రపరీక్ష, రక్తపరీక్ష, కల్చర్‌ పరీక్షలు చేసి, ఇన్‌ఫెక్షన్స్‌ ఏవైనా ఉన్నాయా? లేదా? అని చెక్‌ చేస్తారు. శరీరానికి అవసరమైన పోషకాహారం గురించి కూడా సలహా ఇస్తారు. మీ వయస్సును బట్టి, ముందు వ్యాయామం చేయటం ప్రారంభించాలి. 

ఇన్‌ఫెక్షన్‌  లేకపోతే, యోనిలో పెట్టుకునే వజైనల్‌ పెస్సరీ వాడాలని సూచిస్తారు. ఇది సాఫ్ట్‌ పదార్థాలతో తయారైన దై, డాక్టర్‌ సూచించిన పరిమాణంలో మాత్రమే వాడాలి. ఉపయోగించడం, తొలగించడం నేర్చుకున్న తర్వాత కూడా ప్రతి రెండు నెలలకోసారి వైద్యుని పునర్విమర్శ అవసరం. ఇది ఉపశమనం కలిగిస్తే కొనసాగించవచ్చు. లేకపోతే శస్త్రచికిత్సను సూచిస్తారు.    
డాక్టర్‌ భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 

(చదవండి: నెలలు నిండాక వచ్చే నొప్పులు పురిటినొప్పులేనా..?)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)