Breaking News

ఐస్‌ బాత్‌ థెరపీ ట్రెండ్‌..! నిపుణులు ఏమంటున్నారంటే..

Published on Fri, 06/06/2025 - 09:22

నగరవాసం అంటేనే కొత్త కొత్త అనుభూతులు, అనుభవాలతో సహవాసం.. విశ్వవ్యాప్తంగా రాకపోకలు సాగించే మహానగరాల్లో కొత్త విశేషాలకు కొరత ఎప్పుడూ ఉండదు. అంతేకాదు కొత్త విషయాలకు నగరవాసులు ఎప్పుడూ ఆకర్షితులే.. వాటిలోని వింత అనుభవాలను చవిచూడాల ఎప్పుడూ ఉవి్వళ్లూరుతూ ఉంటారు. ఇలాంటి నయా ట్రెండ్స్‌కు తామేమీ తక్కువ కాదన్నట్లు భావిస్తుంటారు. అందుకే ఏ విషయంలోనైనా భాగ్యనగరవాసులు ముందుంటారు.. అలాంటి మరో కొత్త విశేషమే నగరానికి పరిచయమైంది. అదే ఐస్‌ బాత్‌. ఈ పేరిట ఇటీవలే ఓ ట్రెండ్‌ పరిచయమైంది.                                       
ఐస్‌ బాత్‌ థెరపీ నగరంలోని ఆరోగ్య, ఫిట్‌నెస్‌ ప్రియులకు నూతన ట్రెండ్‌గా మారింది. ఈ థెరపీ ద్వారా శరీరానికి మాత్రమే కాదు.. మానసికంగానూ అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని దీన్ని అందిస్తున్న నిపుణులు చెబుతున్నారు. సమంత, విరాట్‌ కోహ్లీ, విజయ్‌ దేవరకొండ, అనమ్‌ మీర్జా, విష్ణు మంచు వంటి ప్రముఖులు ఐస్‌ బాత్‌ తో వారి అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఇది అనేకమందిలో ఈ థెరపీ పట్ల ఆసక్తిని పెంచుతోంది. మరి కొందరు సైతం ఐస్‌బాత్‌ను ఒక ఈవెంట్‌లా నగరంలోని కేఫ్స్, క్లబ్స్‌.. వంటి విభిన్న ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు.  

స్నాన విశేషాలివీ.. 
ఐస్‌ బాత్‌ అనేది చల్లటి నీటిలో, సాధారణంగా 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో, 10 నుండి 15 నిమిషాల పాటు శరీరాన్ని ముంచడం. దీనినే క్రయోథెరపీ లేదా కోల్డ్‌–వాటర్‌ ఇమ్మర్షన్‌ టెక్నిక్‌/కోల్డ్‌ ప్లంజ్‌ థెరపీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రక్రియ శరీరంలోని రక్తనాళాలను సంకోచింపజేస్తుంది. తద్వారా వాపు, నొప్పి తగ్గుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి శరీరం త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. ఈ చికిత్స విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ప్రతిఫలదాయకంగా ఉంటుంది. ప్రారంభ షాక్‌ తర్వాత, శరీరం అలవాటుపడుతుంది. 

ఆరోగ్య ప్రయోజనాలివీ.. 
ఈ ఐస్‌బాత్‌ సేవలు అందిస్తున్నవారు చెబుతున్న వివరాల ప్రకారం.. దీని ద్వారా కండరాల నొప్పి, వాపు తగ్గుతుంది. చల్లటి నీటిలో శరీరం ఉన్నప్పుడు రక్తప్రసరణ మెరుగై, ఎండార్ఫిన్లు విడుదలై, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. క్రమం తప్పని ఐస్‌ బాత్‌తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

చల్లటి నీటి ప్రమేయంతో నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుంది. ఇది డోపమైన్‌ స్థాయిలను పెంచుతుంది. అత్యంత చల్లటి నీటిలో ఒక మునక డోపమైన్‌ ఉత్పత్తిని 250% వరకూ పెంచుతుంది. తద్వారా సహజమైన మానసిక ఆరోగ్యాన్ని  ఇస్తుంది.. ఇబ్బంది కలిగించే చలిని ఎదుర్కోవడం మెదడుని అసౌకర్యాన్ని స్వీకరించడానికి, స్థితిస్థాపన క్రమశిక్షణను పెంపొందించడానికి సహాయపడుతుంది.  

వ్యక్తిగతంగా మెచ్చి.. స్వదేశానికి తెచ్చి.. 
‘మారథాన్‌ రన్నర్స్, క్రీడాకారులకు కఠినమైన శిక్షణ తర్వాత అలసట దూరం కావడానికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు విభిన్న వర్గాల వారు ఆరోగ్యం కోసం దీన్ని ఎంచుకుంటున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌పై ఆసక్తితో థాయిలాండ్‌లోని ఎలైట్‌ ఫైట్‌ క్లబ్‌లో సభ్యులుగా శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ఐస్‌ బాత్‌ థెరపీ గురించి తెలిసింది. 

నగరంలో దీనిని ప్రవేశపెట్టాలని నార్సింగిలో ఓ సెంటర్‌తో పాటు మొబైల్‌ ఐస్‌ బాత్‌ థెరపీ అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రారంభకులకు 90 సెకన్ల నుంచి అత్యధికంగా 3 నిమిషాలు మాత్రమే సూచిస్తాం. ఆ తర్వాత వారి వారి ఇష్టం, సామర్థ్యాలను బట్టి వ్యవధి పెంచుకోవచ్చు. వ్యక్తిగతంగా 18 నిమిషాల వరకూ ఐస్‌ బాత్‌ చేయగలను.  

జాగ్రత్తలు తప్పనిసరి.. 

ఐస్‌బాత్‌ ఈవెంట్‌లో పాల్గొనాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ముందస్తు వైద్య సలహా తీసుకోవాలి. 

అధిక లేదా తక్కువ రక్తపోటు, గుండె సంబంధిత రుగ్మతలు, నాడీ సంబంధిత పరిస్థితులు, మధుమేహం లేదా వాసు్కలర్, ఏవైనా ఇతర సమస్యలు ఉన్నవారికి ఇది నప్పదు. 

ఐస్‌ బాత్‌ వ్యవధి ఒక నిమిషం నుంచి 2 నిమిషాలు వరకూ సరిపోతుందని, అయితే కొన్ని సెషన్ల తర్వాత వ్యక్తులు వారి వారి శరీర తత్వాన్ని బట్టి వ్యవధిని పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

ప్రారంభకులకు, సంవత్సరానికి 3–4 సెషన్‌లు సరిపోతాయి.  శరీరం ప్రతిస్పందనను బట్టి ఆరోగ్య లక్ష్యాల ఆధారంగా ఫ్రీక్వెన్సీని పెంచవచ్చు. 

ప్రస్తుతం సెషన్‌ సెటప్‌ ఫెసిలిటేటర్‌ నైపుణ్యాన్ని బట్టి రూ.2,000 నుంచి రూ.8,000 వరకూ ఉంది.   

(చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్‌గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్‌లో సెంచరీ కొట్టాలంటే..)

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)