Breaking News

Health: వైట్‌.. రైటే! మేలు చేసే తెల్లటి ఆహారాలివి..

Published on Tue, 09/10/2024 - 13:42

తెలుపు రంగులో ఉండే ఆహారాలు ఎప్పుడూ ప్రమాదం తెచ్చిపెడుతుంటాయని పలువురు అభి్రపాయపడుతుంటారు. అందుకే ఆహారంలో తెల్లగా కనిపించే వాటిని పక్కన పెట్టాలంటూ కొందరు నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే తెల్లనివన్నీ కీడు చేసేవి కాదు. తెలుపు రంగులో ఉండే ఆహార పదార్థాల్లో బాగా పాలిష్‌ చేసిన బియ్యం (అయితే దంపుడు బియ్యం (బ్రౌన్‌ రైస్‌) దీనికి మినహాయింపు), చక్కెర, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం... ఈ మూడూ ఆరోగ్యానికి కొంత చేటు చేసేవే. అవి మినహాయిస్తే తెల్లటి రంగులో ఉండే అనేక ఆహార పదార్థాలైన ఉల్లి, వెల్లుల్లి, కాలీఫ్లవర్, వైట్‌ క్యాబేజీ, తెల్లవంకాయ, వైట్‌ మష్రూమ్స్‌ అనేవి ఆరోగ్యానికి ఎప్పుడూ మేలు చేసేవే.

  • మేలు చేసే తెల్లటి ఆహారాలివి..
    ఉల్లి, వెల్లుల్లి: తెల్లటివే అయినా తమ ఘాటుదనంతో క్యాన్సర్‌ను అవి తరిమి కొడతాయి. వాటిల్లోని అలిసిన్‌ అనే పోషకం (ఫైటో కెమికల్‌) అనేక రకాల క్యాన్సర్లను నివారించడమే కాదు... రక్తంలోని హానికరమైన కొలెస్ట్రాల్‌ మోతాదులను తగ్గిస్తుంది. పొట్ట, పెద్దపేగు మలద్వార క్యాన్సర్లతో పాటు అనేక రకాల క్యాన్సర్లతో పాటు గుండెజబ్బులను వెల్లుల్లి, ఉల్లి నివారిస్తాయి.

  • కాలీఫ్లవర్‌ / వైట్‌ క్యాబేజీ: వీటిల్లో సమృద్ధిగా ఉండే ఐసోథయనేట్స్, ఐసోఫేవోన్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్స్‌ అనేక రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. మెదడుకు చురుకుదనాన్నీ ఇస్తాయి.

  • తెల్లముల్లంగి: ఈ దుంప ఎరుపుతో పాటు తెల్లరంగులోనూ లభ్యమవుతుంది. దీన్ని చాలా శక్తిమంతమైన డీ–టాక్సిఫైయర్‌గా చెబుతారు. అంటే దేహంలో పేరుకున్న విషాలను బయటికి పంపి, కాలేయానికి చాలా మేలు చేస్తుందది. కామెర్లు వచ్చిన వాళ్లలో నాశమయ్యే ఎర్రరక్తకణాలను కాపాడటం ద్వారా కణాలన్నింటికీ పోషకాలూ, ఆక్సిజన్‌ సాఫీగా అందేలా తోడ్పడుతుంది. సాధారణంగా డయాబెటిస్‌ ఉన్నవారు తీసుకోకూడదని చెప్పే దుంపకూరల్లో ముల్లంగికి మినహాయింపు ఉంటుంది. దానిలో ఉండే ఫైబర్‌ కారణంగా అది దేహంలోకి చక్కెర చాలా మెల్లగా విడుదలయ్యేలా చేయడం ద్వారా రక్తంలోని చక్కెర మోతాదులను అదుపులో ఉంచుతుంది. ముల్లంగిలోనూ క్యాన్సర్‌ను ఎదుర్కొనే యాంటీ–క్యాన్సరస్‌ గుణాలున్నాయి. వీటిలోని యాంటీఫంగల్‌ ్రపోటీన్‌ ‘ఆర్‌ఎస్‌ఏఎఫ్‌పీ2’ ఫంగల్‌ వ్యాధులను నివారిస్తుంది.

  • అలాగే తెల్లవంకాయ, తెల్ల మష్రూమ్స్‌ వ్యాధినిరోధక శక్తిని మరింత బలోపేతం చేస్తాయి. వాటిల్లోని బీటా–గ్లూకాన్స్‌ అని పిలిచే పాలీసాకరైడ్స్‌ తెల్లరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. తద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.  ఇక వాటిల్లో ఉండే ఎపిగల్లాకాటెచిన్‌ గ్యాలేట్‌ (ఈజీసీజీ) అనే పోషకం క్యాన్సర్‌తో పాటు ఎన్నెన్నో వ్యాధుల నుంచి కాపాడుతుంది.

    ఇవి చదవండి: మోకాలి నొప్పికి.. మెయిడ్‌ పేరు!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)