Breaking News

ఆలూ బుఖారాతో బోలెడన్ని లాభాలు..!

Published on Tue, 07/02/2024 - 14:30

వర్షాకాలంలో వ్యాధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆహార విషయానికొస్తే తగిన జాగ్రత్తలు ఎంతో ముఖ్యం. ఈ సీజన్‌లో ఆలూ బుఖారాతో కొన్ని ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అవేంటో చూద్దాం.

ఆలూ బుఖారాలో విటమిన్ సి ప్రోటీన్ పుష్కలంగా దొరుకుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతూ, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఈ పండు శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్లను కలిగి ఉండటంతోపాటు ఈ వ్యాధులను కూడా నివారిస్తుంది.

ఆలూ బుఖారాతో ప్రయోజనాలు..

  • ఆలూ బుఖారా జీర్ణవ్యవస్థ సమస్యలను తొలగించడంతోపాటు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. అలాగే కడుపు నొప్పి సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు.

  • ఈ పండు తీపిగా ఉన్నప్పటికీ, మధుమేహ రోగులకు ప్రయోజనాన్నిస్తుంది. ఇది పీచు పదర్థంగా ఉంటూ, రక్తంలో అవసరమైనంత చక్కెర స్థాయినిస్తుంది. షుగర్ పేషెంట్లు కూడా ఆలూ బుఖారాను తక్కువ మోతాదులో తీసుకోవచ్చు.

  • ఎముకలు దృఢంగా మారడంలో ఆలూ బుకారా ఎంతో ఉపయోగకరం. ఎముకలు దెబ్బతినకుండా, ఎముకల వ్యాధి వంటి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి కాపాడుతుంది.

  • అధిక రక్తపోటు నుంచి రక్షించడంతోపాటు, దీన్ని తినడంతో బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులను కూడా అరికడుతుంది.

  • విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో ఆలూ బుఖారా ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచడంలో ఎంతో తోడ్పడుతుంది. దీనిని తీసుకోవడంతో ఫిట్‌నెస్ కూడా మెరుగుపడుతుంది.

(చదవండి: 6,7 తేదీల్లో హుబ్లీలో పనస మేళా..)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)