Breaking News

ఒళ్ళంతా పురుగులు పాకుతున్నాయంటుంది!

Published on Thu, 05/15/2025 - 10:22

మా అమ్మ గారికి 78 సంవత్సరాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అలాంటిది ఆమె ఒక 6–7 నెలల నుండి ఒళ్ళంతా చిన్న చిన్న పురుగులు పాకుతున్నాయని, దురదగా ఉందని వళ్లంతా గోక్కుంటోంది. స్కిన్‌ ఇన్ఫెక్షన్‌ అనుకుని చర్మం డాక్టర్‌ గారి దగ్గరికి తీస్కుని వెళ్ళాము. పరీక్ష చేసి ఎలాంటి ఇన్ఫెక్షన్‌ లేదని దురద తగ్గడానికి కొన్ని మందులు ఆయింట్మెంట్‌ ఇచ్చారు. అవి వాడిన తర్వాత కూడా ఆమెకు ఉపశమనం లేదు. పురుగులు చర్మంలోకి చొచ్చుకు పోతున్నాయని గొడవ చేస్తుంది. పుండ్లు పుట్టేలా చర్మాన్ని గోకుతుంది. ఒక చిన్న ఖాళీ డబ్బా తీస్కుని దాంట్లో పురుగులు వేశానని మమ్మల్ని కూడా చూడమని చెప్తుంది. ఆ డబ్బాలో ఆమె బట్టలవి చిన్న చిన్న దారపు పోగులు తప్ప ఏమి లేవు అంటే ఒప్పుకోదు. ఆవిడ బాధ తట్టుకోలేక ఇంకో స్కిన్‌ డాక్టర్‌ గారి దగ్గరికి తీసుకు వెళ్ళాము. ఆయన తల స్కాన్‌ చేసి ఒకసారి మానసిక వైద్యునికి చూపించమని చెప్పారు. ఆమె అన్ని రకాలుగా బాగుంది. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. జ్ఞాపక శక్తి బాగుంది. ఈ పురుగులు పాకుతున్నాయిని ఒక్క కంప్లెట్‌ తప్ప! ఆమెకు సైకియాట్రిస్ట్‌ ట్రీట్మెంట్‌ అవసరం అంటారా?

– పద్మావతి, బళ్ళారి

మీరు మీ అమ్మగారిలో చూస్తున్న లక్షణాలు క్లాసికల్‌గా ‘డెల్యూజనల్‌ పారా సైటోసిస్‌‘ లేదా ‘ఎక్బామ్‌ సిండ్రోమ్‌‘ అనే మానసిక సమస్య వచ్చిన వారిలో కనబడతాయి. ఇది ఒక అరుదైన మానసిక సమస్య. దీనిని ఎక్కువగా స్త్రీలలో చూస్తాము. మెదడు రసాయనాల్లో వచ్చే మార్పులు ఈ జబ్బు  రావడానికి ప్రధాన కారణం. రక్త హీనత, విటమిన్‌ లోపాలు, థైరాయిడ్‌ సమస్యలు లాంటివి ఉండే వారిలో కూడా జబ్బు వచ్చే ఆవకాశాలు ఎక్కువ. 

కొన్ని సార్లు పెద్దవయసులో వచ్చే ‘ఆల్జీమర్స్‌ డిమెన్షియా‘ ఈ లక్షణంతోనే ప్రారంభం అవ్వొచ్చు. అలాగే అత్యంత అరుదుగా మెదడులో కణుతులు లాంటివి ఉన్నా డెల్యూజన్‌లో పారా సైటోసిస్‌ లక్షణాలు కనపడే అవకాశముంది. 

తమ వంటిమీది లేదా చర్మం కింద పురుగులు పాకుతున్నాయనే సందేహం తప్ప ఇతర లక్షణాలు ఏమి కనపడవు. దురద తట్టుకోలేక కొంతమంది చర్మానికి క్రిమి సంహారక మందులు పూసుకొని ప్రాణం మీదికి కూడా తెచ్చుకుంటారు. 

యాంటీ సైకోటిక్‌ మందుల ద్వారా ఈ జబ్బు లక్షణాలని పూర్తిగా తగ్గించవచ్చు. మీరు దగ్గర్లోని మానసిక వైద్యుని వెంటనే కలిసి వాళ్ళు చెప్పిన ప్రకారం మందులు వాడితే త్వరగా ఆమె సమస్య తగ్గుతుంది. ఇది మానసిక జబ్బు లక్షణమే తప్ప శారీరక అనారోగ్యం ఏమాత్రం కాదనేది అందరూ గుర్తించాలి!  

(డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ sakshifamily3@gmail.com)
 

(చదవండి: Miss worl 2025: అతడు.. ఆమె... మిస్‌ వరల్డ్‌)

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)