Breaking News

ఆ ఉద్యోగం వదిలేయడానికి.. ఏకంగా 74 లక్షల మూల్యం..!

Published on Fri, 07/17/2026 - 17:09

కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. మరికొన్నింటికి ఏకంగా లక్షలు ఖర్చవుతాయి. అయినా కూడ వెనకగుడు వేయకుండా ముందుకు సాగాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. ఇక్కడ చోటు చేసుకుంది అలాంటి ఘటనే. 

అసలేం జరిగిందంటే.. సశాస్త్ర సీమా బాల్ (SSB) మాజీ అసిస్టెంట్ కమాండెంట్ అమిత్ సోని సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవడానికి దాదాపు 74 లక్షలు ఎలా వదిలించుకోవాల్సి వచ్చిందో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. తాను ఐఐఎం అహ్మదాబాద్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్ (PGPX) చేయడం కోసం తన ప్రభుత్వ పదవికిఇ రాజీనామా చేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదా పునరాలోచన లేకుండా తనపై ఉన్న నమ్మకంతో తీసుకున్న నిర్ణయానికి భారీ మూల్యం చెల్లించక తప్పలేదన్నారు. 

ఆ నిర్ణయం ఫలితంగా ఆర్థికంగా ఎంత ఖర్చు అయ్యిందో వివరించారు. PGPX ప్రోగ్రామ్ ఫీజు రూ. 37.10 లక్షలు కాగా, అంతర్జాతీయ ఇమ్మర్షన్‌కు రూ. 4.5 లక్షలు ఖర్చయ్యాయని అన్నారు. అతను తన ఒక ఏడాది జీవన వ్యయాలు సుమారు రూ. 2.5 లక్షలుగా అంచనా వేశాడు. 

అలాగే రూ. 9.80 లక్షల రాజీనామా బాండ్‌లు, అలాగే ఏడాది జీతం, ఉద్యోగ ప్రయోజనాల రూపంలో సుమారు 20 లక్షలు కలిపి దగ్గర దగ్గర రూ. 74 లక్షలు దాక వదులుకోవాల్సి వచ్చిందన్నారు. ఆర్థిక పరంగా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యినా..తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు అమిత్‌. 

ఆయన తన నిర్ణయాన్ని డబ్బుతో కొలవకూడదని అనుకుంటున్నాని, ఎందుకంటే..వ్యక్తిగత ఎదుగుదల, కొత్త అవకాశాలు  కోసం సౌకర్యవంతమైన జీవితం వదులుకుంటున్నప్పడు ఆ మాత్రం ఖర్చు ఉంటుందని అన్నారు. అంతేగాదు ఆయన ఈ మార్పుని  "యూనిఫాం నుంచి బోర్డురూమ్‌కు" మారడంగా అభివర్ణించారు. ఇది వృత్తి జీవితంలో ఒక కొత్త అధ్యయానికి నాందిగా పేర్కొంటూ తన పోస్ట్‌ని ముగించారు. 

ఇది నెటిజన్ల మనసును అమితంగా ఆకర్షించింది. కొందరు అతడి ధైర్యాన్ని, నిబద్ధతను ప్రశంసించగా, మరికొందరు ఉన్నత విద్య కోసం స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవడం ఒక విలువైన పెట్టుబడా కాదా అని ప్రశ్నిస్తూ పోస్టలు పెట్టారు.

(చదవండి: గర్భంలో పడినప్పుడే..ఆయుర్ధాయం ఖరారు..!: పరిశోధనలో షాకింగ్‌ విషయాలు)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)