Breaking News

ఈ మూడు వంటకాలను ఎప్పుడైనా ట్రై చేశారా?

Published on Sun, 06/30/2024 - 04:58

ఇంట్లోనే సింపుల్‌గా ఇలాంటి వంటలను కమ్మగా, అద్భుతంగా చేయాలనుకుంటున్నారా! అయితే ఇలాట్రైం చేయండి..

స్వీట్‌ పొటాటో ఆమ్లెట్‌..
కావలసినవి:
చిలగడదుంప – 2 (మీడియం సైజ్, ఉడికించి పేస్ట్‌లా చేసుకోవచ్చు),
కొబ్బరి కోరు – 2 టేబుల్‌ స్పూన్లు,
టొమాటో సాస్‌ – 1 టేబుల్‌ స్పూన్,
చిల్లీ సాస్‌ – అర టేబుల్‌ స్పూన్,
చాట్‌ మసాలా – 1 టీ స్పూన్,
గుడ్లు – 6 ,
చీజ్‌ తురుము – 3 టేబుల్‌ స్పూన్లు,
ఉప్పు – తగినంత,
ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌ (చిన్నగా తరగాలి),
టొమాటో ముక్కలు – పావు టేబుల్‌ స్పూన్‌ (చిన్నగా తరగాలి),
పాలు – 1 టీ స్పూన్,
కారం – కొద్దిగా, నూనె – సరిపడా

తయారీ:
– ముందుగా ఒక బౌల్‌లో గుడ్లను పగలగొట్టి.. చీజ్‌ తురుము, పాలు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని క్రీమీగా అయ్యేంతవరకు హ్యాండ్‌బ్లెండర్‌తో బాగా బీట్‌ చేసి పెట్టుకోవాలి.
– ఈలోపు మరో స్టవ్‌ వెలిగించి.. కళాయిలో కొద్దిగా నూనె వేసి వేడికాగానే.. ఉల్లిపాయ ముక్కలనూ వేసి దొరగా వేయించాలి.
– తర్వాత టొమోటో ముక్కలను వేయాలి.
– అవీ వేగాక..  చిలగడదుంప గుజ్జు, టొమాటో సాస్, చిల్లీ సాస్, చాట్‌ మసాలా, చిటికెడు ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో బాగా కలిపి.. 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.
– అనంతరం గుడ్ల మిశ్రమంతో ఒక్కో ఆమ్లెట్‌ వేసుకుని.. అది ఉడికే క్రమంలో కొద్దికొద్దిగా చిలగడదుంప మిశ్రమాన్ని వేసుకుని.. గరిటెతో మొత్తం స్ప్రెడ్‌ చేసి.. ఆమ్లెట్‌ను ఇరువైపులా వేయించుకోవాలి. వాటిని ఫోల్డ్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.
– నచ్చిన విధంగా గార్నిష్‌ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి ఈ ఆమ్లెట్స్‌.

అలోవీరా హల్వా..
కావలసినవి:
అలోవీరా (కలబంద) ముక్కలు – అర కప్పు (పైనున్న గ్రీన్‌ కలర్‌ తొక్క తొలగించి.. జెల్‌ని ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి),
నెయ్యి, గోధుమ పిండి – 1 కప్పు చొప్పున,
పంచదార – అర కప్పు (పెంచుకోవచ్చు), చిక్కటి పాలు – 1 కప్పు,
జాజికాయ పొడి,
ఏలకుల పొడి – కొద్దికొద్దిగా
బాదం ముక్కలు – అర టేబుల్‌ స్పూన్‌ చొప్పున (నేతిలో వేయించి పక్కనపెట్టుకోవాలి,
అభిరుచిని బట్టి కిస్మిస్,
జీడిపప్పు ముక్కలు కూడా తీసుకోవచ్చు),
కుంకుమపువ్వు – కొద్దిగా

తయారీ:
– ముందుగా కళాయిలో అరకప్పు నెయ్యి వేసుకుని.. అందులో గోధుమ పిండి, కలబంద జ్యూస్‌ వేసి తిప్పుతూ ఉండాలి.
– దగ్గరపడుతున్న సమయంలో పంచదార, కొద్దిగా నెయ్యి వేసుకుని కలపాలి.
– అనంతరం పాలు పోసుకుని మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూండాలి.
– కాస్త దగ్గరపడిన తర్వాత జాజికాయ పొడి, ఏలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసుకుని మళ్లీ తిప్పుతూ ఉండాలి.
– పూర్తిగా దగ్గరపడిన తర్వాత సర్వ్‌ చేసుకునే ముందు.. బాదం ముక్కలు, లేదా కిస్మిస్, జీడిపప్పు ముక్కల్ని వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది ఈ హల్వా.

ఓట్స్‌ యాపిల్‌ షేక్‌..
కావలసినవి:
పాలు – 2 కప్పులు (కాచినవి, ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి)
ఓట్స్‌ – అర కప్పు (దోరగా వేయించి పెట్టుకోవాలి)
యాపిల్స్‌ – 3 (రెండింటిని తొక్క,
గింజలు తొలగించి.. ముక్కలుగా కట్‌ చేసుకుని.. పప్పుగుత్తి సాయంతో కచ్చాబిచ్చాగా గుజ్జులా చేసుకోవాలి. మిగిలిన యాపిల్‌ని నచ్చినవిధంగా కట్‌చేసి గార్నిష్‌కి పక్కన పెట్టుకోవాలి),
వేరుశనగలు – పావు కప్పు (దోరగావేయించి, తొక్క తీసి.. కొన్నింటిని పక్కనే ఉంచుకుని.. మిగిలినవి కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి), పంచదార – కొద్దిగా (అభిరుచిని బట్టి బెల్లం కూడా కలుపుకోవచ్చు),
హార్లిక్స్‌ పౌడర్,
దాల్చినచెక్క పొడి – కొద్దికొద్దిగా
జీడిపప్పు – 2 టేబుల్‌ స్పూన్లు (దోరగా వేయించుకోవాలి)

తయారీ:
– ముందుగా ఒక బౌల్‌లో పాలు, యాపిల్‌ గుజ్జు, మిక్సీ పట్టిన వేరుశనగ మిశ్రమం, పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి.
– అనంతరం ఓట్స్‌ పౌడర్‌ వేసుకుని.. మరోసారి కలిపి సర్వ్‌ చేసుకోవాలి.
– పైన హార్లిక్స్‌ పౌడర్, దాల్చినచెక్క పొడి, జీడిపప్పులు, యాపిల్‌ ముక్కలతో గార్నిష్‌ చేసుకుంటే బాగుంటుంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)