Breaking News

ఈ ఆపిల్ ఎక్కడైనా కాస్తుంది!

Published on Wed, 01/29/2025 - 01:47

హిమవత్పర్వత సానువులకే పరిమితమైన ఆపిల్‌ సాగును మైదానప్రాంతాలకు తీసుకొచ్చారు ఓ సామాన్య రైతు. ఉష్ణమండలప్రాంతాల్లోనూ సాగయ్యే హెచ్‌ఆర్‌ఎంఎన్‌–49 ఆపిల్‌ వంగడాన్ని రైతు శాస్త్రవేత్త హరిమాన్‌ శర్మ(Hariman Sharma) అభివృద్ధి చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలోని పనియాలా ఆయన స్వగ్రామం.  

మామిడితో పాటే ఆపిల్‌ సాగు(Apple Cultivation)... హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కశ్మీర్‌ రాష్ట్రాల్లోని కొండలపై మాత్రమే ఆపిల్‌ వాణిజ్య పంటగా సాగులో ఉంది. చల్లని వాతావరణం ఉన్న ఆ కొండప్రాంతాలు మాత్రమే ఆపిల్‌ సాగుకు అనుకూలంగా ఉంటాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోనూ కొండప్రాంతాల్లో మాత్రమే వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే, ఆ రాష్ట్ర రాజధాని సిమ్లా ఆపిల్‌ సాగులో దేశంలోనే పేరెన్నికగన్నది. కానీ ఆ రాష్ట్రంలోనూ కొండ లోయల్లో, మైదానప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికమే.

బిలాస్‌పూర్‌ జిల్లా సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక లోయ ప్రాంతం. అక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో రైతులు మామిడి తోటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. అలాంటి వేడి వాతావరణం ఉన్నప్రాంతంలో తన ఇంటి పెరట్లో ఒక ఆపిల్‌ మొక్క మొలకెత్తటాన్ని హరిమాన్‌ శర్మ గమనించారు. పనియాలా లాంటి వేడి వాతావరణంలో ఆపిల్‌ చెట్టు పెరగటం శర్మను ఆలోచనలో పడేసింది. ఆ మొక్కను అతి జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక ఏడాది గడిచాక ఆ ఆపిల్‌ చెట్టు నుంచి వచ్చిన కొమ్మలను తీసుకొని రేగు మొక్కతో అంటుకట్టారు. ఆప్రాంతంలో అంటు కట్టటానికి కూడా ఆపిల్‌ చెట్లు అందుబాటులో లేకపోవటమే దీనిక్కారణం. అతని ప్రయోగం విజయవంతమైంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పంట చేతికొచ్చింది! 

అంతేకాదు.. ఆపిల్‌ కాయలు సైజులోను, నాణ్యతలోనూ బావున్నాయి. సిమ్లా నుంచి ఆపిల్‌ విత్తనాలు తెచ్చి పెంచిన మొక్కలతో అంటుకట్టాడు. రెండేళ్ల తరువాత మంచి పంట చేతికొచ్చింది. తను సాగు చేస్తున్న మామిడి చెట్లతో పాటే ఆ ఆపిల్‌ చెట్లను పెంచాడు. ఆ విధంగా ఒక చిన్న ఆపిల్‌ తోటనే అతను సృష్టించాడు! 

సాధారణంగా ఆపిల్‌లో పూత రావలన్నా పిందెలు రావాలన్నా అతి చల్లని వాతావరణం అవసరం. కానీ హెచ్‌.ఆర్‌.ఎం.ఎన్‌.–99 రకం ఆపిల్‌ను సాధారణ వాతావరణంలోనూ ఉష్ణమండలప్రాంతాల్లోనూ సాగు చేయవచ్చని హరిమాన్‌ శర్మ చెబుతున్నారు. ఈ మొక్క మూడేళ్లు తిరిగేసరికి కాపుకొస్తుంది. జూన్‌లో కాయటం దీని మరో ప్రత్యేకత. ఆ కాలంలో ఇప్పుడున్న దేశీవాళీ ఆపిల్‌ కాయలు మార్కెట్లోకి రావు. దీంతో ఈ రకం ఆపిళ్లను సాగు చేసే రైతులు లాభపడుతున్నారు. హెచ్‌.ఆర్‌.ఎం.ఎన్‌.–99 వంగడంపై నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌.ఐ.ఎఫ్‌.) దృష్టి కేంద్రీకరించింది.

 దేశంలోని విభిన్న వ్యవసాయక వాతావరణ పరిస్థితులున్నప్రాంతాల్లో 2015–17 మధ్యకాలంలో ప్రయోగాత్మకంగా సాగు చేయించింది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలితప్రాంతాలకు చెందిన 1,190 మంది రైతులకు 10 వేల ఆపిల్‌ మొక్కలు ఇచ్చి సాగు చేయించారు. చాలా రాష్ట్రాల్లో సత్ఫలితాలు వచ్చాయని ఎన్‌.ఐ.ఎఫ్‌. ప్రకటించింది. 

పరిశోధనాలయాల్లో సాగులో ఉన్న రకాలతో పోల్చితే హెచ్‌.ఆర్‌.ఎం.ఎన్‌.–99 పండ్లు నాణ్యమైనవని తేలింది. కొన్ని రాష్ట్రాల్లో ఏడాది వయసున్న మొక్కలకే పూత వచ్చింది.

దక్షిణాదిన కర్నాటకలోని చిక్‌మగుళూరు, హర్యానా రైతులు హెచ్‌ఆర్‌ఎంఎన్‌–99 ఆపిల్‌ వంగడాన్ని సాగు చేసి ఏడాదికి రెండు పంటలు తీస్తున్నారు. అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ సాగవుతోంది. మంచి దిగుబడులు వస్తున్నాయి. కాయలు రుచిగా ఉండటంతో కొనేందుకు వినియోగదారులు మక్కువ చూపుతున్నారు. బిలాస్‌పూర్‌ జిల్లాలోని కొండ దిగువ జిల్లాల్లోనిప్రాంతాల్లోని వేలాది మంది సాధారణ రైతులకు హరిమాన్‌ శర్మ స్ఫూర్తి ప్రదాతగా మారారు.

అంతకు ముందు ఆప్రాంతంలోని రైతులు తాము ఆపిల్‌ను సాగు చేయటమనేది వారు కలనైనా ఊహించ లేదు. ఆయనను ఇప్పుడు బిస్లాపూర్‌ జిల్లాలో ‘ఆపిల్‌ మేన్‌’ అని ఆత్మీయంగా పిలుస్తున్నారు. ఈ ఆవిష్కరణ  ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డులను సంపాయించి పెట్టింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్‌.ఐ.ఎఫ్‌. జాతీయ పురస్కారాన్ని,‘ప్రేరణా శ్రోత్‌’ పురస్కారాన్ని పొందారు. హరిమాన్‌ శర్మ, పనియాల గ్రామం, బిలాస్‌పూర్‌ జిల్లా, హిమాచల్‌ ప్రదేశ్‌ – 174021. ఫోన్‌: 09418 867209, 09817 284251 , sharmaharimanfarm @gmail.com

‘తెలుగు రాష్ట్రాల్లో రైతులకు 15 వేల మొక్కలు అందించాం’
మైదానప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతల్లోనూ సాగు చేయదగిన ఆపిల్‌ వంగడాన్ని హారిమన్‌ శర్మ రూపొందించారు. ఆయన దగ్గరి నుంచి ఈ మొక్కల్ని పల్లెసృజన తరఫున తెప్పించి, తెలుగు రాష్ట్రాల్లో పలువురు రైతులకు గత ఐదేళ్లుగా నవంబర్‌–డిసెంబర్‌ నెలల్లో ఇస్తున్నాం. ఇప్పటికి సుమారు 15 వేల ఆపిల్‌ మొక్కల్ని రైతులకు అందించాం. ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి స్పీడ్‌ కొరియర్‌లో రైతుల ఊళ్లకే పంపుతున్నాం. ఖర్చులన్నీ కలిపి మొక్క ఖరీదు రూ. 220 అవుతోంది. చాలా చోట్ల ఈ ఆపిల్‌ చెట్లకు ఇప్పటికే పండ్లు కాస్తున్నాయి. 
sharmaharimanfarm @gmail.com

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)