Breaking News

అందర్నీ సంతోషంగా ఉంచాలంటే... నేను వెళ్లి ఐస్‌ క్రీమ్‌ అమ్ముకోవాలి!

Published on Fri, 11/15/2024 - 07:52

నటాషా స్టాంకోవిక్, హార్దిక్‌ పాండ్యా ఈ ఏడాది జూలై 18న విడిపోయారు. అప్పట్నుంచి నటాషాకు ప్రశ్నలు మొదలయ్యాయి. ‘‘ఏమ్మాయ్, ముచ్చటైన జంట కదా మీది? ఎందుకు విడిపోయారు?’’‘‘భర్త ఏమైనా అంటే సర్దుకు΄ోవాలి కానీ, పెట్టే బేడా సర్దుకుని బయటికి వచ్చేయటమేనా?’’‘‘ఇప్పుడేమిటి? మీ దేశం వెళ్లిపోతావా? ఇక్కడే ఉండిపోతావా?’’. ‘‘కొడుకు పెద్దవాడౌతున్నాడు. వాడి భవిష్యత్తు ఆలోచించకుండా విడాకులకు నువ్వు కూడా ఎందుకు తొందరపడ్డావ్‌?’’. ‘‘అతనే విడాకులు కావాలని అడిగినా కూడా, కాళ్లా వేళ్లా పడి అతడితోనే ఉండిపోవాలి కానీ, పంతానికి పోతే ఇలా?’’

ఇవీ ఆ ప్రశ్నలు! 
హార్దిక్‌కి మాత్రం సహజంగానే ఎలాంటి ప్రశ్నలూ లేవు. ఎప్పటిలాగే అతడు మిడిల్‌–ఆర్డర్‌లో రైట్‌ హ్యాండ్‌తో బ్యాటింగ్, ఫాస్ట్‌–మీడియంలో రైట్‌ ఆర్మ్‌తో బౌలింగ్‌ చేసుకుంటూ, తన ఆట తను ఆడుకుంటున్నాడు. నాలుగేళ్ల క్రితం 2020 మే 31న నటాషా, హార్ధిక్‌ల పెళ్లి జరిగింది. అదే ఏడాది జూలై 30న వాళ్లకు కొడుకు (అగస్త్య) పుట్టాడు. అప్పటికి ఎంతకాలంగా వాళ్లు డేటింగ్‌లో ఉన్నారో ఎవరికీ తెలియదు. అసలు వాళ్ల లవ్‌ స్టోరీనే పెద్ద రహస్యం. పెళ్లి కాగానే నటాషా కెరీర్‌కు బ్రేక్‌ పడింది. నటాషా చక్కటి డాన్సర్, మంచి నటి, పాపులర్‌ మోడల్‌. 

నటనలో తన కెరీర్‌ను మలుచుకోవటం కోసం 2012లో ఇరవై ఏళ్ల వయసులో సెర్బియా నుండి ఇండియా వచ్చారావిడ. ‘సత్యాగ్రహ’ ఆమె తొలి సినిమా.  ఫిలిప్స్, క్యాడ్‌బరీ, టెట్లీ, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఉత్పత్తులకు మోడలింగ్‌ కూడా చేశారు. అయితే పెళ్లి తర్వాత ఆమె డాన్స్, యాక్టింగ్, మోడలింగ్‌ అన్నీ మూలన పడ్డాయి. తిరిగి నాలుగేళ్ల తర్వాత మాత్రమే గత నెలలో ‘తేరే కర్కే’ అనే 
మ్యూజిక్‌ వీడియో విడుదలతో ఆమె తన కెరీర్‌ను ప్రారంభించగలిగారు.

ఈ పునరాగమనం సందర్భంగా ‘బాంబే టైమ్స్‌’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో (ఆ ఇంటర్వ్యూ ఎక్కువగా ఆమె విడాకుల మీదే సాగింది) ఆమె ఎంతో దృఢంగా మాట్లాడారు. తను తిరిగి సెర్బియా వెళ్లేది లేదని,  ముంబైలోనే ఉండిపోతానని, విడాకులు తీసుకున్నప్పటికీ ఆగస్త్య కోసం హార్దిక్, తను తరచు కలుసుకుంటూనే ఉంటామని చెప్పారు. చివరిగా ఒక ప్రశ్న దగ్గర ఆమె కొన్ని క్షణాలు మౌనం వహించారు. 

‘‘మీరు విడాకులు తీసుకున్నందుకు మీ వైపు గానీ, హార్దిక్‌ వైపు గానీ ఎవరూ సంతోషంగా లేరనే మాట వినిపిస్తోంది?’’ అని అడిగినప్పుడు.. ఆ కొన్ని క్షణాల మౌనం తర్వాత ఆమె నవ్వుతూ ... ‘‘అందర్నీ సంతోషంగా ఉంచాలంటే నేను వెళ్లి ఐస్‌క్రీమ్‌ బండిని నడుపుకోవాలి..’’ అన్నారు. ఆమె నవ్వుతూనే ఆ మాట అన్నా, ‘విడిపోవటం ఎవరికి మాత్రం సంతోషకరమైన విషయం..’ అని తన మనసులో అనుకునే ఉంటారు.      

(చదవండి:  సునీతా విలియమ్స్‌: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..  )                     
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)