Breaking News

Valentine's Day 2023: వాలైంటెన్స్‌ విషెస్‌ ఇలా ఎమోషనల్‌గా ఎప్పుడైనా చెప్పారా?

Published on Mon, 02/13/2023 - 18:18

ప్రేమ సత్యం.. ప్రేమ నిత్యయవ్వనం..ప్రేమ వినూత్నం..ప్రేమ మధురం..ప్రేమను ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. తడారిపోయిన మనసుల్లో పచ్చని ఆశలు చిగురింపజేసేది ప్రేమ. శిలలాంటి మనిషికి జీవం పోసేది ప్రేమ. కులమతాలను, దేశ సరిహద్దులను చెరిపేసేది ప్రేమ...ధనిక, పేద తారతమ్యాన్ని చెరిపేస్తుంది..బంధాలను వేరుచేసినా..బాంధవ్యాలను దగ్గరికి చేరుస్తుంది. ప్రేమైక జీవనం తనువులు వేరైనా..మనసులు ఒకటని చాటిచెప్తుంది. ప్రేమలో విజయం సాధించి, ఆదర్శంగా నిలిచిన వారి మధురానుభూతులు, జ్ఞాపకాలను నెమరేసుకునే రోజు. ‘ప్రేమికుల దినోత్సవం’. మరి ప్రేమికులు వాలెంటైన్స్‌ డేను జరుపుకోండిలా.. మీ ప్రేమను మరింత పదిలంగా ఉంచుకోండిలా..!

మంటలోని మౌనం ప్రేమ.. మరుజన్మకు ప్రాణం ప్రేమ... హ్యాపీ వాలెంటైన్ డే 2023
నువ్వు ప్రేమించే వాళ్లు ఎంత మందైనా దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్లు దొరకడం నీ అదృష్టం ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
నిన్ను చూడాలని తపించే కనులకు ఎలా చెప్పను .. హ్యాపీ వాలెంటైన్ డే 2023
నువ్వు నాలోనే ఉన్నావని ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
ఉదయించే సూర్యడు ఈ ప్రపంచానికి వెలుగునిస్తే..నీరాక నా జీవితంలోకి వెలుగు నింపింది హ్యాపీ వాలెంటైన్ డే
ఓటమినైనా ఓడదు ప్రేమ చితిలోనైనా కాలదు ప్రేమ .. హ్యాపీ వాలెంటైన్ డే 2023
జీవితమంతా... నీ ప్రేమలో కరిగిపోతాను నీ జీవితంలో ముత్యాన్నై వెలిగిపోయేలా చేస్తావుకదూ...హ్యాపీ వాలెంటైన్ డే 2023
ఎదలో ప్రేమ ఉంటే నిన్ను మరువగలను నీ ప్రేమ నా హృదయమైతే ఎలా మరిచిపోను .. హ్యాపీ వాలెంటైన్ డే 2023
పరిస్థితుల్ని బట్టి మారిపోయేది ప్రేమ కాదు పరిస్థితుల్ని అర్థం చేసుకునేది అసలైన ప్రేమ.. హ్యాపీ వాలెంటైన్ డే 2023
నువ్వు ప్రేమించే వాళ్లు ఎంత మందైనా దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్లు దొరకడం నీ అదృష్టం.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

నువ్వులేని ఈ క్షణము ఓ యుగంలా ఉంది.. యుగమంతా ఎదురుచూస్తా నీతో గడిపే ఆ క్షణం కోసం
పరిస్థితుల్ని బట్టి మారిపోయేది ప్రేమ కాదు పరిస్థితుల్ని అర్థం చేసుకునేది అసలైన ప్రేమ
ఎదలో ప్రేమ ఉంటే నిన్ను మరువగలను నీ ప్రేమ నా హృదయమైతే ఎలా మరిచిపోను
మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ
జీవితమంతా... నీ ప్రేమలో కరిగిపోతాను నీ జీవితంలో ముత్యాన్నై వెలిగిపోయేలా చేస్తావుకదూ...
నేను లేకుండా నువ్వు ఉండగలవేమో. నువ్వు లేకుండా క్షణం కూడా నేను ఉండలేను. ఎందుకంటే నువ్వే నా ప్రాణం అయిపోయావు కాబట్టి.
నిన్ను కలిసే వరకు ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియదు.. హ్యాపీ వాలెంటైన్ డే 2023
నా జీవితంలో ప్రేమ మరియు సంతోషం తెచ్చినందుకు ధన్యవాదాలు. ఐ లవ్ యు

నువ్వే నా సర్వస్వం అని చెప్పినా.. అది చిన్న మాటే అవుతుందేమో.. ఆల్ రెడీ నేను నువ్ అయిపోయాను.
రాత్రి పడుకునేముందు చివరి ఆలోచన.. ఉదయం లేచాక మెుదటి ఆలోచన నువ్వే.. ఐ లవ్ య్యూ.
జీవితంలో సంతోషంగా ఉండాలంటే.. ఆస్తులు అవసరం లేదు.. నువ్వు చాలు..
నాకు నువ్ ఎంత దూరంలో ఉన్నా.. నా మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటావ్..
నా ప్రేమకు అర్థం లేదు.. నీ తోడు లేకుంటే.., నా కనుచూపునకు ప్రపంచం నచ్చడం లేదు.. నువ్వు కనపడకుంటే.., నా జీవిత గమనానికి గమ్యం లేదు.. నీతో ఏడు అడుగులు వెయ్యకుంటే.., నా మనసుకు ఓదార్పు లేదు నీ స్వరం వినపడకుంటే.
ప్రతి ఉదయం సూర్యుడి రాకతో నీ కోసం చూస్తున్నా.. ప్రతి రాత్రి వెన్నెల వెలుగుల్లో నీ స్పర్శ కోసం తపిస్తున్నా.. అద్దంలాంటి నా మనసు నీకు ఇచ్చేసా.. వెన్నలాంటి నా హృదయం నీకే రాసిచ్చా.. నా ఒంటరి తనం దూరం చేసి.. నన్ను అల్లుకో..
నువ్ ఏడిస్తే చూడలేను.. నీకు కష్టం వస్తే తట్టుకోలేను.. అందుకే నీ నీడలా నీతోనే ఉంటాను నేను.

నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ ఉండరు నీ జ్ఞాపకం తప్ప! నువ్వు నా పక్కనుంటే నేనే ఉండను నువ్వు తప్ప!
నీవే నా అంతం… నీవే నా అంతరాత్మ.. నీవే నా పరమాత్మ… నీవే నా మరో జన్మాత్మ…!
భాషలు వేరయినా భావాలు ఒక్కటే మనసులు వేరయినా మమతానురాగాలు ఒక్కటే దారులు వేరయినా మన ప్రేమ ఒక్కటే ప్రియా .
మనల్ని నిజంగా ప్రేమించాలనుకునే వారికి, మనలోని లోపాలు కూడా అందంగానే కనిపిస్తాయి.
ప్రపంచంలో అత్యంత అందమైనది, ఊహలకు అందనిది ప్రేమ. అది వర్ణనాతీతమైనది.
ప్రేమను చెప్పడానికి నిమిషం చాలు, కానీ ఆ ప్రేమను చూపడానికి జీవితం సరిపోదు.

నా బలం నువ్వే, నా బలహీనతా నువ్వే, నా సంతోషం నువ్వే, నా తియ్యని బాధ నువ్వే.కాలాలు మారినా, నీపై నా ప్రేమ కలకాలం ఉంటుంది.
కలలో కూడా అనుకోలేదు నా అదృష్టం నీ రూపంలో వస్తుందని... నా జీవితంలోకి వచ్చినందుకు నీకు వేలవేల కృతజ్ఞతలు.
మరచిపోవటానికి నువ్వు నా గతం కాదు జ్ఞాపకం. ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం తిరిగి ప్రేమను ఆశించటం కాదు.
జీవితం ఒక ప్రయాణం … జీవనం ఒక ప్రమాణం అని ఎవరో అన్నారు నీతో జీవితం నాకు ప్రయాణం కావాలి నీ ప్రేమ నాకు ప్రమాణం కావాలి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)