Breaking News

తల వెంట్రుకలను లాగేసుకుంటోంది..!

Published on Thu, 11/28/2024 - 10:45

మా అమ్మాయి వయసు 18 సంవత్సరాలు. బీటెక్‌ చదువుతోంది. ఈ మధ్య తల వెంట్రుకలను గట్టిగా పట్టి ఒక్కొక్కటీ లాగేసుకుంటోంది. మాట్లాడుతూనో.. చదువుకుంటూనో... ఇలా వెంట్రుకలు లాగేస్తోంది. దీనివల్ల తలలో చాలా భాగం బట్టతలలా మారి చూడటానికి అసహ్యంగా కనిపిస్తోంది. గట్టిగా మందలిస్తే, అప్పుడు మానేస్తుంది కానీ మళ్లీ మామూలే! మాకు విసుగొచ్చి ఒక దెబ్బ వేస్తే ఏడుస్తోంది. తాను కావాలని అలా చేయడం లేదనీ, తనకు తెలియకుండానే అలా లాగేస్తున్నానని చెబుతోంది. కాలేజీకి వెళ్లే అమ్మాయి ఇలా చేస్తుంటే నలుగురూ ఏమనుకుంటారో అని భయంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే తనకసలు పెళ్లవుతుందో లేదోనని ఆందోళనగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– రాజేశ్వరి, ఆదిలాబాద్‌

మీరు చెప్పిన వివరాలను బట్టి  మీ అమ్మాయి ట్రైకోటిల్లో మేనియా అనే మానసిక రుగ్మతతో బాఢపడుతున్నట్లు అర్థమవుతోంది. అయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇది యువతలో వచ్చే ఒక అరుదైన మానసిక రుగ్మత. తలవెంట్రుకలే కాకుండా, కొందరు కనుబొమలు, కంటిరెప్పల వెంట్రుకలను కూడా ఇలాగే లాగేసుకుంటూ ఉంటారు. 

కొన్ని సందర్భాలలో అయితే ఇలా లాగేసిన వెంట్రుకలను మింగడం కూడా జరుగుతుంది. కొందరు పిల్లల్లో సడన్‌గా వచ్చే కడుపునొప్పికి కారణం ఈ వెంట్రుకలన్నీ కడుపులో అడ్డుపడడమే! ఆందోళన, టెన్షన్‌కు లోనయిన వారిలోనూ, బుద్ధిమాంద్యమున్న వారిలోనూ ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కంపల్సివ్‌ పుల్లింగ్‌ అంటే వెంట్రుకలు లాగేయడం అన్నది మళ్లీ మళ్లీ చేయాలనే ఒక మానసిక వైపరీత్యం వల్ల కూడా ఇలా జరుగుతుంది. 

దీనిని ఎంత అదుపు చేసుకుందామనుకున్నా వారికి సాధ్యం కాదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆధునిక మానసిక వైద్యశాస్త్రంలో అద్భుతమైన ఔషధాలతోపాటు కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ అనే ప్రత్యేక మానసిక చికిత్స కూడా ఉంది. చాలామందికి ఇది మానసిక సమస్య అని తెలియక చర్యవ్యాధి డాక్టర్లను సంప్రదిస్తుంటారు. మీరు ఆలస్యం చేయకుండా మీకు దగ్గరలోని మానసిక వైద్యుని సంప్రదిస్తే మీ అమ్మాయిని ఈ సమస్య నుంచి బయటకు తీసుకురావచ్చు.
డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com)

(చదవండి: శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?)

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు