Breaking News

ఒకప్పుడు ఇది మాఫియా డెన్‌.. కానీ ఇప్పుడిది?

Published on Sun, 06/23/2024 - 04:26

ఒకప్పుడు ఇది మాఫియా డెన్‌. ఇప్పుడు థీమ్‌ పార్క్‌. దీని పేరు ‘హేసియెండా నేపోలెస్‌’. అంటే నేపుల్స్‌ ఎస్టేట్‌ అని అర్థం. కొలంబియన్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ పాబ్లో ఎస్కోబార్‌ స్థావరమిది. దాదాపు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్‌లో నివాస భవనాలు, ఒక ఈతకొలను, నాలుగు చెరువులతో పాటు ఖాళీ స్థలంలో దట్టంగా పెరిగిన వృక్షసముదాయం చిట్టడవిని తలపిస్తుంది. 

ఇక్కడ రకరకాల జంతువులు కనిపిస్తాయి. ఎస్కోబార్‌ నీటి ఏనుగుల వంటి భారీ జంతువులను ఇక్కడకు తెచ్చి పెంచుకునేవాడు. ఈ ఎస్టేట్‌లో ఒక జూ, శిల్పశాల వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. పోలీసుల దాడిలో ఎస్కోబార్‌ 1993లో మరణించాడు. ఈ ఎస్టేట్‌ కోసం అతడి కుటుంబం దావా వేసినా, కోర్టులో ఓడిపోయింది.

దాంతో ఇది 2006లో కొలంబియా ప్రభుత్వానికి స్వాధీనమైంది. కొలంబియా ప్రభుత్వం దీనిని ఒక థీమ్‌పార్కుగా తీర్చిదిద్ది, కొత్తగా ప్రవేశద్వారాన్ని నిర్మించింది. ప్రవేశద్వారానికి పైన విమానాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిపింది. ఈ విమానంలోనే ఎస్కోబార్‌ మాదకద్రవ్యాలను రవాణా చేసేవాడు. దేశ దేశాల్లో తిరిగిన తర్వాత ఇదే విమానంలో నేరుగా తన ఎస్టేట్‌కు చేరుకునేవాడు.

కొలంబియా ప్రభుత్వం ఇక్కడ జురాసిక్‌ పార్క్‌ తరహాలో 2014 నాటికి పూర్తిస్థాయి ఆఫ్రికన్‌ థీమ్‌పార్కు నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఇప్పుడిది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యాటకులు ఈ థీమ్‌పార్కులో ఒక రోజు బస చేయడానికి 15 డాలర్లు (రూ.1,215) చెల్లించాల్సి ఉంటుంది. ఈ థీమ్‌పార్కులో ఎస్కోబార్‌ మ్యూజియం, పట్టుబడతాననే భయంతో అతడు తగులబెట్టిన కార్లు, కొకెయిన్‌ గోదాముల శిథిలాలు ఆనాటి మాఫియా సామ్రాజ్యానికి ఆనవాళ్లుగా నిలిచి ఉన్నాయి.

ఇవి చదవండి: అదీ గ్లాస్‌ బ్రిడ్జ్‌..! ఎక్కారంటే ప్రాణం గుప్పిట్లోనే!!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)