Breaking News

జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్‌తో..

Published on Tue, 02/18/2025 - 13:30

అవమానాలు చీత్కారాల కారణంగా కొందరూ బరువు తగ్గి స్లిమ్‌గా మారిన స్ఫూర్తిదాయకమైన కథలను చూశాం. అలా కాకుండా కలవారపాటుకు గురిచేసిన అనారోగ్య సమస్య ఆరోగ్యంపై బాధ్యతగా వ్యవహరించేలా చేసి బరువు తగ్గేందుకు కారణమైంది. ఆ స్ప్రుహే ఆ మహిళను 133 కిలోల నుంచి కనివిని ఎరుగని రీతిలో బరువు తగ్గేందుకు ప్రేరేపించింది. అలా ఆమె ఒక్క ఏడాదికే దాదాపు 40 కిలోల మేరు బరువు కోల్పోయి..గుర్తుపట్టలేనంతగా నాజుగ్గా మారిపోయింది. తనలాంటి బాధపడుతున్న వ్యక్తుల్లో స్ఫూర్తిని నింపేలా తన వెయిట్‌ లాస్‌ జర్నీ, డైట్‌ సీక్రెట్‌ల గురించి నెట్టింట షేర్‌ చేసుకుంది. అవేంటంటే..

టొరంటోలో నివసించే గురిష్క్‌ కౌర్‌ అనే బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఫిబ్రవరి 2024లో 133 కిలోలు మేర అధిక బరువు ఉండేది. అసాదారణమైన వెయిట్‌లాస్‌ జర్నీతో ఏకంగా 40 కిలోల మేర బరువు కోల్పోయి అందర్నీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. ఈ ఏడాది జనవరి కల్లా 86.5 కిలోలకు చేరుకున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించింది. 

తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి వెల్లడించి ఇతరులు కూడా బరువు తగ్గేలా ప్రోత్సహిస్తోంది. ఆమె ఫిమేల్ ప్యాటర్న్‌గా పిలిచే ఆండ్రోజెనిక్ అలోపేసియా బారిన పడటంతో ఆరోగ్యం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. ఆ డెసిషన్‌ ఆమెను బరువు తగ్గే దిశగా నడిపించింది. 

బరువుగా ఉన్నప్పుడూ..తాను ఎలా ఒత్తిడి, బలహీనమైన ఆత్మవిశ్వాసంతో బాధపడిందో కూడా వెల్లడించింది. కేవలం శారీరకంగా స్లిమ్‌గా మారడమే కాకుండా స్ట్రాంగ్‌గా తయారవ్వాలని నిర్ణయించుకున్నానని అందువల్లే ఇంతలా బరువు తగ్గినట్లు తెలిపారు కౌర్‌. అలాగే తన డైట్‌ సీక్రెట్‌ ఏంటో కూడా బయటపెట్టింది. 

బరువు తగ్గేలా చేసిన డైట్‌ ట్రిక్‌..

  • ముందుగా పోషకాహారంపై సరైన అవగాహన ఉండాలి. 

  • లీన్ ప్రోటీన్ - గుడ్లు, చికెన్, తెల్ల చేప, టోఫు, టెంపే వంటి వాటిని తీసుకునేందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. 

  • నట్స్‌, గుమ్మడి, పుచ్చకాయ, అవిశె గింజలు, సలాడ్లు, వేయించిన కూరగాయలు తినండి

  • చిలగడదుంపలు, రై బ్రెడ్, మల్టీగ్రెయిన్ రైస్ తీసుకోవాలి

  • దీంతోపాటు ముఖ్యంగా 80/20 రూల్‌ని పాటించాలి

  • 80/20 రూల్‌ అంటే..?: 80 శాతం ఆరోగ్యకరమైనది, 20 శాతం నచ్చిన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తూ బ్యాలెన్స్‌ చేసుకోవాలి డైట్‌ని. 

డైట్‌ మంత్ర: ఆకలి నియంత్రణలో ఉండేలా డైట్‌ ప్లాన్‌ ఉండాలి. ప్రధానంగా సమతుల్యమైన ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చేలా ఫుడ్‌ తీసుకుంటే ఎవ్వరైనా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గగలుగుతారని చెబుతున్నారు గురిష్క్ కౌర్‌. 

అన్ని కిలోలు ఉన్న ఆమె అంతలా బరువు తగ్గగలిగిందంటే..ఓ మోస్తారు అటు ఇటుగా ఉన్న మనందంరం మరింత సులభంగా బరువు తగ్గిపోగలం అనడంలో సందేహమే లేదు కదూ..!.

 

(చదవండి: నోరూరించే పాప్‌కార్న్‌ డ్రెస్‌లో నటి ఎమ్మా స్టోన్‌..!)

 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)