Breaking News

షారుఖ్ ఖాన్ మెయింటెయిన్ చేస్తున్న ఫోన్‌లెన్నో ఊహించగలరా?

Published on Mon, 02/26/2024 - 12:34

‘బాలీవుడ్ బాద్‌షా’ షారుఖ్ ఖాన్‌ అంటే ఫ్యాన్స్‌కు పూనకాలే. బ్లాక్‌ బస్టర్‌మూవీలు ప్రపంచవ్యాప్తంగా  కోట్లాది మంది అభిమానులు, ఖరీదైన బంగ్గాలు, లగ్జరీ  కార్లు..అబ్బో.. ఇలా చెప్పుకుంటూపోతే ఈ లిస్ట్‌ పెద్దదే. 1980లలో తన కెరీర్‌ను ప్రారంభించింది మొదలు అత్యంత ప్రజాదరణతో వెండితెరను ఏలుతున్న స్టార్‌ హీరో. .

పఠాన్, జవాన్ , డంకీ మూవీలతో ఈ క్రేజ్‌ మరింత పెరిగింది. ఇటీవలి బ్లాక్‌ బస్టర్‌మూవీ జవాన్‌లో షారుఖ్ ఖాన్ పట్టుకున్న  ఫోను మొదలు తమ  అభిమాన హీరోకున్న ఫోన్లు ఎన్ని అనేది  చర్చకు దారితీసింది. 

షారుఖ్ ఖాన్ వద్ద 17 ఫోన్లు
షారుఖ్ ఖాన్ మెయింటెయిన్ చేస్తున్న ఫోన్‌ల సంఖ్యను మీరు ఊహించగలరా? అక్షరాల 17 ఫోన్లు అట.  షారూఖ్‌ కరీర్‌లో ప్రారంభంలో కీలక పాత్ర పోషించిన , వివేక్ వాస్వాని స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.  సిద్ధార్థ్ కన్నన్‌తో ఒక ఇంటర్వ్యూలో  కొన్ని విషయాలను  పంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో తప్ప మళ్లీ తనని కలవలేకపోయాయని వివేక్ తెలిపారు. ‘‘ఎస్‌ఆర్‌కే దగ్గర 17ఫోన్లు,  ఉన్నాయి. నా దగ్గర ఒకటే నంబరు ఉంది.. నేను ఫోన్‌  చేసినపుడు ఆయన  దొరకడు. ఆయన ఫోన్‌ చేసినపుడు నేను మిస్‌ అవుతా.. ఆయనకు బాధ్యతలు ఎక్కువ. నిత్యం ప్రయాణిస్తూనే ఉంటాడు.  వెండితెర సామ్రాజ్యాన్ని  ఏలుతున్న  అద్భుతమైన వ్యక్తి’’  అంటూ  గుర్తు చేసుకున్నారు. కాగా రియల్‌మీ, ఒప్పో లాంటి బ్రాండ్లకు షారుఖ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేశారు. 

అంతేకాదు బాలీవుడ్‌  హ్యాపియస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు షారుఖ్, గౌరీ ఖాన్‌ జంట . వీరి వివాహ బంధం మొదలై  మూడు దశాబ్దాలుదాటింది.  ఈ క్రమంలో తన భార్యకు రోజుకు 8-10 సార్లు ఫోన్ చేస్తాననీ, ఒక్కోసారి ఐదు నిమిషాలకోసారి ఫోన్ చేస్తానని  చెప్పడం వైరల్‌ అయింది. ఒక   ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె గుర్తొచ్చినప్పుడల్లా కాల్ చేస్తా, నా భార్యతోనే కదా మాట్లాడేదని అని ఫన్నీగా  చెప్పిన సంగతి  తెలిసిందే.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)