Breaking News

'గ్రానీస్ పర్స్ సిండ్రోమ్': ప్రతి పేరెంట్‌కి అవగాహన ఉండాలి!

Published on Thu, 12/05/2024 - 17:20

ఎన్నో రకాల వ్యాధుల గురించి విని ఉన్నాం. కానీ ఇలాంటి సిండ్రోమ్‌ గురించి మాత్రం విని ఉండుండరు. ప్రతి తల్లిదండ్రులు ఈ సిండ్రోమ్‌ గురించి తప్పక తెలుసుకోవాలని చెబుతోంది పీడియాట్రిక్‌ వైద్యురాలు. పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేసే దీనిపై అవగాహన ఉండాలని అన్నారు. లేదంటే పిల్లల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏంటీ సిండ్రోమ్‌ అంటే..

చిన్నారులకు నడక, మాటలు వచ్చాయంటే.. వారిని ఓ కంటకనిపెడుతూనే ఉండాలి. ఏ క్షణంలో ఏం పనిచేస్తారో చెప్పాలేం. సైలెంట్‌గా ఉన్నారంటే దేన్నో పాడుచేయడం లేదా ప్రమాదం కొని తెచ్చుకునే పనులేవో చేస్తున్నారని అర్థం. ఇలాంటి పిల్లలను కనిపెట్టుకుని ఉండటం, తల్లిదండ్రులకు, పెద్దలకు ఓ సవాలుగా ఉంటుంది. ఇలా కనిపెట్టుకుని ఉండలేక తల్లిదండ్రులు అమ్మమ్మలు లేదా నానమ్మల ఇంటికి పంపించేస్తారు.

అక్కడ వాళ్లు అప్పటి వరకు ఇల్లంతా సందడి లేకుండా ఉంటుంది. ఈ చిచ్చర పిడుగుల రాకతో ఎక్కడ లేని సందడి వచ్చేస్తుంది. అదీగాక నానమ్మ/అమ్మమ్మ తాతయ్యలు కూడా తామిద్దరమే అని ఇంట్లో పర్సులు, వాళ్లకు సంబంధించిన మందులు అందుబాటులోనే పెట్టుకుంటారు. వయసు రీత్యా వచ్చే మతిమరపు సమస్యతో ఆ వస్తువులను సమీపంలోనే ఉంచుకుంటారు. అయితే ఈ చిచ్చర పిడుగులు ఈ వస్తువులను తీసి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఇంటిల్లపాది ఇలా అయ్యిందేంటని బోరుమంటారు. 

ఇలా అమ్మమ్మలు లేదా నానమ్మల పర్సలు లేదా మందులతో వైద్య పరిస్థితిని కొని తెచ్చుకోవడాన్ని గ్రానీస్ పర్స్ సిండ్రోమ్‌గా పిలుస్తారని శిశు వైద్యులు చెబుతున్నారు. కొందరు పర్సులో ఉండే నాణేలను నోటిలో పెట్టుకోవడం, అలాగే పెద్దల మందులు వేసుకోవడం తదితరాలతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. ఒక్కోసారి అది సీరియస్‌ అయ్యి ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారులెందరో ఉన్నారని చెబుతున్నారు శిశు వైద్యులు. 

ముఖ్యంగా పెద్దలు వేసుకునే దీర్ఘకాలికి వ్యాధులకు సంబంధించిన మందులు కారణంగా అనారోగ్యం పాలై బాధపడుతున్న చిన్నారులు కూడా చాలామంది ఉన్నారని హెచ్చరిస్తున్నారు. అందువల్ల దయచేసి తాతయ్యలు అమ్మమల ఇంటికి పంపిచేటప్పడూ పెద్దవాళ్ల వస్తువులను తీయకూడదని చెప్పడం తోపాటు పెద్దలు కూడా తమ పర్సులు, మందులు డబ్బాలు వారికి అందుబాటులో ఉండకుండా జాగ్రత్త పడటం మంచిదని శిశు వైద్యురాలు టిక్‌టాక్‌ వీడియోలో పేర్కొంది. అంతేగాదు యూఎస్‌లో అనేక మంది చిన్నారులు గ్రానీస్ పర్స్ సిండ్రోమ్‌గా పిలిచే ఈ వైద్య పరిస్థితి బారిన పడి అనారోగ్యం లేదా గాయాల పాలైనట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ఆస్టియోపతిక్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యింది.

(చదవండి: భవిష్యత్తులో ఆరోగ్యం, దీర్ఘాయువు ఎలా ఉండనుంది?)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)