Breaking News

మనవడా... నువ్వు మారుతావు

Published on Wed, 07/16/2025 - 01:09

సిటీ నుంచి ఇంటికొచ్చిన మనవడు నానమ్మ గొలుసు కాజేశాడు. ఆ సంగతి నానమ్మ కనిపెట్టింది. మనవడంటే ఎంత ప్రేమో ఆమెకు. ఇంట్లో ఉండగా బాగా చదువుకుని టాపర్‌గా ఉన్న మనవడు సిటీకి వెళ్లి ఇలా అయ్యాడా అని బాధ పడింది. తర్వాత ఆమె చేసిన పని మనవడిలో మార్పు తెస్తుందో లేదో గాని టీనేజ్‌లో ఉన్న పిల్లల గురించి పెద్దలందరినీ ఆలోచనల్లో పడేసింది. కేరళలో జరిగిన ఈ తాజా ఘటన వివరాలు....

కేరళలోని అలెప్పి.
ఆ నానమ్మ రోజూ నిద్రపోయే ముందు తన ఒకటిన్నర సవర్ల గొలుసు దిండుకింద పెట్టుకుంటుంది. తెల్లవారి లేచిన తర్వాత మళ్లీ ధరిస్తుంది. కాని ఆ రోజు లేచి దిండు కింద చూస్తే గొలుసు లేదు. రెండు రోజుల క్రితం మనవడు వచ్చాడు. ఈ మధ్య వచ్చినప్పుడల్లా డబ్బు అడుగుతున్నాడు. ఈసారి గొలుసు తీసేశాడన్న మాట. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. మనవడిని ఈ చేతులతో పెంచింది. వాడు ఇంటర్‌ వరకూ నిన్న మొన్న ఇక్కడే చదివాడు. టాపర్‌. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేస్తానని బెంగళూరు వెళ్లినప్పటి నుంచి ఏమైందో ఏమిటో ఇలా తయారయ్యాడు. నగరం వాడిని మార్చేసిందా... లేదంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండటం... అజమాయిషీ లేకపోవడం... తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం... ఇవి వాణ్ణి ఇలా తయారు చేశాయా అని మధన పడింది.

పోలీస్‌ రిపోర్టు ఇస్తే కేసవడం, అరెస్టు చేయడం తాను భరించలేదు. అలాగే తనకున్న ఒక్కగానొక్క గొలుసును పోగొట్టుకోవాలని లేదు. అందుకే పోలీసులకు చాటుగా ఫోన్‌ చేసింది. ‘అయ్యా... నా మనవడు ఇంత పని చేశాడు. కేసు గీసు ఏం వద్దు. వాడి దగ్గరి నుంచి ఆ గొలుసు సంపాదించి ఇవ్వండి చాలు.... వాడిని తీసుకెళ్లి లోపల వేసి కొట్టడం, హింసించడం చేయవద్దు’ అని బతిమిలాడింది.

అలెప్పి పోలీసులు నానమ్మ హృదయాన్ని అర్థం చేసుకున్నారు. వెంటనే మనవడి ఫొటోను వాట్సప్‌ చేయమన్నారు. ఆమె చేసింది. పోలీసులు ఆ ఫోటోను ‘ఆల్‌ కేరళ గోల్డ్‌ మర్చంట్‌ అసోసియేషన్‌’ అలెప్పీ సెక్రటరీ అబి థామస్‌కు పంపారు. అబి థామస్‌ దానిని తమ వర్తకుల వాట్సప్‌ గ్రూప్‌లో పెట్టి ‘ఈ కుర్రాడు గొలుసు తీసుకొని వస్తే ఎవరూ కొనవద్దు’ అని మెసేజ్‌ చేశాడు.  అప్పటికే గొలుసుతో బయలుదేరిన మనవడు అలెప్పిలోని ఏ దుకాణానికి వెళ్లినా వర్తకులు ‘నువ్వు దొంగవి’ అనకుండా ‘మేం కొనం’ అని వెనక్కు పంపేయసాగారు.

మనవడు మొత్తం 25 షాపులు తిరిగాడు. ఎవరూ కొనలేదు. దాంతో మూడు రోజుల తర్వాత ఆ గొలుసును తిరిగి నానమ్మకు ఇచ్చేశాడు. ఆమె కోప్పడలేదు. కన్నీరు కార్చింది. మనవడికి బహుమతిగా 1000 రూపాయలు ఇచ్చింది. నువ్వు మారతావని ఆశిస్తున్నా... అంది. మనవడు మారతాడో లేదో కానీ ఇదో ఆలోచించాల్సిన విషయం. చదువు కోసం, కోర్సుల కోసం నగరాలకు పిల్లల్ని పంపాక వారితో నిత్యం కమ్యూనికేషన్‌లో తల్లిదండ్రులు ఉండాలి, ప్రేమను చూపాలి, సాధక బాధకాలు వినాలి... లేకుంటే వారు పెడత్రోవ తొక్కవచ్చు.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)