ఛత్రపతి హిందీలో చేయకుండా ఉండాల్సింది
Breaking News
అమ్మమ్మ చేతి ఎంబ్రాయిడరీ..! 1947 నాటి..
Published on Fri, 03/27/2026 - 11:45
ఎంబ్రాయిడరీలో ఉండే కళా నైపుణ్యం వేరేలెవెల్. అందులోనూ మన అమ్మమ్మలు ఆ వయసులో వారి చేత్తో పొద్దిగా కుడితే..అది మనకు ఎంతో అపురూపమైన జ్ఞాపకం.అలాంటి ఆకర్షణీయమైన ఎంబ్రాయిడరీని పరిచయం చేసింది ఈ బామ్మ. సుమారు 90 ఏళ్లు పైనే ఉండే ఈ బామ్మ తన కళను శ్రద్ధగా దాచుకున్న విధం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియోని మనవడు నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది.
ఆ వీడియోలో మనవడు తన అమ్మమ్మ సూదీదారం పట్టుకుని కుట్టిన ఎంబ్రాయిడరీని తన మనవడికి చూపించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె స్వయంగా రూపొందించిన కళాఖండాన్ని మనవడు చూస్తున్నప్పడు ఆ బామ్మ కళ్లు ఆనందంతో మెరుస్తుండటం చూడొచ్చు వీడియోలో. దశాబ్దాల క్రితం ఆమె చేసిన అందమైన కళాఖండం అది. అవి ఆమెకు కళ పట్ల ఉన్న అంకితభావం, ఓర్పుకు నిదర్శనం. యంత్రాలతో నేటితరం చిటికెలో చేస్తే..అవి అమ్మమ్మ తన స్వహస్తాలతో కేవలం సూది, దారంతో చాలా శ్రద్ధతో చేసిన అద్భుత సృష్టి.
అవి ఆ అమ్మమ్మ గతం తాలుకా అమూల్యమైన జ్ఞాపకం కూడా. ఆ కళాఖండం సుమారు 1947 నాటి చారిత్రక ఘట్టం. వాటిని చూస్తే..ఇన్ని దశాబ్దాలు గడిచినా.. చెక్కుచెదరకుండా ఉన్న వాటిని చూస్తే ఆ కళ ఎంత విలువైనవనేది అనేది తెలుస్తోంది. ఇది తమ కుటుంబ చరిత్రలో భాగం, భావోద్వేగమైనది కూడా అని చెబుతున్నాడు ఆమె మనవడు.
ఈ వీడియో నెటిజన్లను ఆకర్షించడమే కాకుండా కుటుంబ వారసత్వ సంపద కళ మాత్రమే అనే విషయం నొక్కి చెప్పిందని అన్నారు. అంతేగాదు కళ ద్వారా నాటి జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయన్నారు. వేగవంతమైన ప్రపంచంలో కుటుంబం, సంప్రదాయం, వారసత్వం, జ్ఞాపకాల ప్రాముఖ్యతలను ఈ దృశ్యం హైలెట్ చేసిందంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: పంజాబీ వంటకాలకు ఫుడ్లవర్స్ ఫిదా..!)
Tags : 1