Breaking News

71 ఏళ్ల వయసులో సీఏ అయ్యాడు..!

Published on Thu, 07/10/2025 - 14:40

విద్యకు బ్రేక్‌ అనేది ఉండదు. చదవాలన్నా కోరిక బలంగా ఉంటే చాలు వయసు పెద్ద మేటర్‌ కాదని గతంలో చాలామంది ప్రూవ్‌ చేశారు. వాళ్లంతా ఏవో కారణాలతో చదువుకోలేకపోతే..ఆయా కోర్సులను పూర్తి చేసి తమ డ్రిమ్‌ని నిజం చేసుకున్నారు. ఈ తాతయ్య అలాకాదు ఏకంగా అత్యంత కఠినతరమైన సీఏని 71 ఏళ్ల వయసులో పూర్తి చేసి శెభాష్‌ అనిపించుకున్నాడు. అదికూడా మనవరాలి కారణంగా ఈ ఘనత సాధించాడు ఈ తాతయ్య. స్ఫూర్తిదాయకమైన అతడి స్టోరి ఏంటో చూద్దామా..!.

ఆయనే తారా చంద్‌ అగర్వాల్‌. ఆ తాతయ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్‌ జైపూర్ (SBBJ) మాజీ ఉద్యోగి. రిటైర్డ్‌ వయసులో అందరిలో రెస్ట్‌ తీసుకోకుండా, ప్రతిష్టాత్మకమైన సీఏ పరీక్షలు రాయాలనుకోవడం విశేషం. ఆ వయసులో ఏ పుణ్య క్షేత్రాలు, లేదా మనవరాళ్లు, మనవళ్లతో కాలక్షేపం చేస్తారు. కానీ ఈయన అలా కాదు. ఆ విశ్రాంతి సమయంలో తన డ్రీమ్‌ నెరవేర్చుకుని స్ఫూర్తిగా నిలిచాడు. 

నిజానికి ఆయన ఈ ఎగ్జామ్‌ రాయడానికి కారణం తన మనవరాలేనట. ఆమె సీఏ చదువు కోసం సహాయం చేసేవారట. ఆమెకు అకౌంట్స్‌పై ఉండే సందేహాలను తీరుస్తూ..తెలియకుండానే ఆ సబ్జెక్టుపై ఆసక్తి పెరిగిందట. అలా ఆ జిజ్ఞాస కాస్తా విద్యా వృత్తిగా మారి చివరకు సీఏ పరిక్షలకు ప్రిపేరవ్వాలనే సంకల్పానికి దారితీసింది. ఆ విధంగా ఆయన సీఏ అయ్యాడు. 

ఈ ఏడాది జులై6న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసిన చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫైనల్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో తారా చంద్‌  వజయవంతం గాపూర్తి చేసి..అందరిని ఆశ్చర్యపరిచాడు. పైగా యువతకు ఆదర్శంగా నిలిచారాయన. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ నిఖిలేష్ కటారియా స్ఫూర్తిదాయకమైన కథను లింక్డ్‌ఇన్‌లో పంచుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఈ ఏడాది సీఏలో మొత్తం 14,247 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఐసీఏఐ వెల్లడించింది. 

(చదవండి: డిటాక్స్‌..రిలాక్స్‌..! కాసేపు టెక్నాలజీకి బ్రేక్‌ ఇద్దామా..!)

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)