Breaking News

Rich Man's Disease: అరటి పండ్లు తిన్నారంటే ఇలా..!

Published on Mon, 04/28/2025 - 16:47

ఇదేం వ్యాధి ఆ పేరేంటీ.. అనుకోకుండి. కేవలం ధనవంతులకే వచ్చే వ్యాధా..? అంటే..ఔననే అంటున్నారు నిపుణులు. ధనవంతులు, వారి జీవనశైలి, అలవాట్ల కారణంగా వస్తుంది కాబట్టి దీన్ని Rich Man's Disease(ధనవంతుల వ్యాధి) అని అంటారు. ఇంతకీ ఏంటా వ్యాధి..? ఎలా నయమవుతుంది అంటే..

బాగా డబ్బున్న వ్యక్తులు(Rich Man's )తీసుకునే మాంసం, పానీయాలు, ప్రత్యేక కూరగాయాలు తదితరాల కారణంగా వచ్చే వ్యాధి కావడంతో Rich Man's Disease(ధనవంతుల వ్యాధి) అని పిలుస్తారు. ఆర్థరైటిస్ మరో రూపామైన గౌట్‌ వ్యాధిని ఇలా పిలుస్తారట. కీళ్లల్లో తరుచుగా బొటనవేలు దిగువన తీవ్రమైన నొప్పి, వాపు, ఎరుపులతో ఇబ్బంది పెడుతుంటుంది. ఆ ప్రదేశం అంతా చాలా సున్నితంగా ఉండి కొంచెం తాకిన నొప్పితో విలవిలలాడినట్లుగా ఉంటుంది. ఇది ఒకరమైన ఆర్థరైటిస్‌గా చెబుతుంటారు నిపుణులు. 

ఎందువల్ల వస్తుందంటే..
గౌట్ శరీరంలో యూరిక్ ఆమ్లం పేరుకుపోవడం వల్ల వస్తుంది. ఇది కీళ్లలో సూది లాంటి స్ఫటికాలు ఏర్పడటానికి దారితీస్తుంది. 

యూరిక్ యాసిడ్ పెరుగుదల గౌట్‌కు ఎలా కారణం అంటే..
కొన్ని ఆహారాలు, పానీయాలలో కనిపించే ప్యూరిన్‌లు అనే రసాయనాలను విచ్ఛిన్నం కావడంతో యూరిక్‌ యాసిడ్‌ ఉత్ఫన్నమవుతుంది. అదీగాక శరీరం కూడా సహజంగా యూరిక్ యాసిడ్‌ను తయారు చేస్తుంది. ఫలితంగా శరీరంలో అదనపు యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం మొదలై గౌట్‌కు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. 

మూత్రపిండాలు సాధారణంగా రక్తం నుంచి యూరిక్‌ యాసిడ్‌ను ఫిల్టర్ చేసి, మూత్ర విసర్జన రూపంలో బయటకి పంపించేస్తుంది. అయితే శరీరం అధిక మొత్తంలో యూరిక్‌ యాసిడ్‌ని ఉత్పత్తి చేస్తే.. మూత్రపిండాలను దాన్ని బయటకు పంపించలేకపోతాయి. ఫలితంగా ఆ యూరిక్ యాసిడ్ స్ఫటికాల రూపంలో కీళ్లల్లో ఏర్పడతాయి. ఆ పదునైన స్ఫటికాలు కారణంగా నొప్పి, వాపు ఇతర సమస్యలు ఉత్ఫన్నమై గౌట్‌ వ్యాధి వస్తుంది. 

గౌట్ సంకేతాలు, లక్షణాలు..

  • గౌట్ అటాక్స్ చాలా బాధాకరంగా ఉంటుంది

  • తీవ్రమైన, భరించలేని నొప్పి

  • రంగు మారడం లేదా ఎరుపుదనం

  • కీళ్ల దృఢత్వం

  • వాపు 

  • తేలికపాటి స్పర్శకు కూడా తట్టుకోలేని సున్నితత్వం

  • వెచ్చదనం, లేదా కీలు మండుతున్నట్లుగా అనిపించడం

ఏ ఆహారాలు గౌట్‌కు కారణం అంటే..
ప్యూరిన్‌లతో నిండిన ఆహారాన్ని తినడం లేదా త్రాగడం వల్ల గౌట్‌కు దారితీసే అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 

  • చక్కెర పానీయాలు, డెజర్ట్‌లు.

  • కార్న్ సిరప్ ఇది అన్ని ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తుల్లోనూ ఉంటుంది

  • ఆల్కహాలిక్ పానీయాలలో ప్యూరిన్‌ ఎక్కువగా ఉంటుంది

  • హెర్రింగ్, స్కాలోప్స్, మస్సెల్స్, కాడ్ ఫిష్, ట్యూనా, ట్రౌట్, హాడాక్ వంటి సముద్రపు చేపల్లో

  • రెడ్‌మీట్‌

నివారణ..
ఆహారంలో మార్పులను సూచిస్తారు వైద్యులు. తక్కువ ప్యూరిన్ ఆహారాన్ని అనుసరించడం ద్వారా సమస్య తగ్గుతుంది. నిపుణులు పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లను తినాలని సిఫార్సు చేస్తారు. ఇది మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్‌ను విసర్జించడానికి సహాయపడుతుంది. అలాగే, అరటిపండ్లు విటమిన్ సి పవర్‌హౌస్‌. ఇది రక్తంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్‌ కూడా. 

అలాగే, అరటిపండ్లతో పాటు నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు, కివి స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, చెర్రీస్, ఆపిల్స్, పైనాపిల్స్ వంటి వాటిల్లో విటమిన్‌ సీ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి  గౌట్‌ వ్యాధిని అదుపులో ఉంచుతాయని చెబుతున్నారు వైద్యులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించాలి. 

(చదవండి: 'గ్రానీ' అభిరుచులే ట్రెండ్‌ అంటున్న యువత..! నిపుణులు ఏమంటున్నారంటే..)

 

#

Tags : 1

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)