Breaking News

బంగారం ఎక్కడైనా బంగారమే : అసలేంటీ క్యారెట్‌ కథ

Published on Sat, 01/04/2025 - 11:28

ప్రపంచంలో ఏ దేశంలోనైనా బంగారం(Gold) అత్యంత విలువైన లోహంగా గౌరవం అందుకుంటోంది. బంగారం స్వచ్ఛత గురించి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నిష్పత్తిని అనుసరిస్తుంటారు. స్వచ్ఛమైన బంగారం అంటే 24 క్యారట్‌ (Carot) ల బంగారం. ఆభరణం తయారు చేయాలంటే కొన్ని ఇతర లోహాల మిశ్రమాన్ని బంగారంలో కలుపుతారు. బంగారం మెత్తటి లోహం. కాబట్టి ఆభరణం ఆకారం గట్టిదనం కోసం ఇతర లోహాలను కలపాలి. అలా లోహపు మిశ్రమాల కలయిక తర్వాత ఆభరణం తయారు చేయడానికి ఉపయోగించే బంగారం స్వచ్ఛత 22 క్యారట్‌లు ఉంటుంది. 

క్యారట్‌ అనే పదం అయోమయానికి గురి చేస్తుంది. బంగారం స్వచ్ఛత విషయంలో ఉపయోగించే క్యారట్‌ అనే పదం ఇంగ్లిష్‌ అక్షరం ‘కె’తో సూచిస్తారు. మరో క్యారట్‌ రాళ్ల (వజ్రంతో సహా అన్ని రకాల రాళ్లు) బరువును సూచించే పదం. ఈ క్యారట్‌ను ‘సి’తో అనే అక్షరంతో సూచిస్తారు. ఒక క్యారట్‌ అంటే 200 మిల్లీగ్రాములు. 

బంగారం ధర పెరగడం వల్ల ఆభరణాల తయారీలో 22 క్యారట్‌లకు బదులు 18, 14, 9 క్యారట్‌ స్వచ్ఛతతో ఆభరణాలు చేస్తున్నారు. క్యారట్‌ స్వచ్ఛత తగ్గేకొద్దీ గట్టిదనం పెరుగుతుంది. 

వజ్రాలు  పొదిగే ఆభరణాలకు సాధారణంగా 18 క్యారట్‌ బంగారం ఉపయోగిస్తారు. ఇప్పుడు 9 క్యారట్‌ బంగారంతో కూడా వజ్రాల ఆభరణాలు చేస్తున్నారు. 

తక్కువ క్యారట్‌ బంగారు ఆభరణాలను కొంటే తిరిగి అమ్మేటప్పుడు ఆ బంగారానికి విలువ రాదనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి మనం కొన్న ఆభరణంలో ఎంత నిష్పత్తి బంగారం ఉందో కరిగించినప్పుడు ఆ మేరకు బంగారమే తిరిగి వస్తుంది. బీఐఎస్‌ హాల్‌మార్క్‌ వేసిన 18 క్యారట్‌ బంగారాన్ని కరిగిస్తే 75 శాతం బంగారం వస్తుంది. అంతకంటే క్యారట్‌ తగ్గితే ఆ మేరకే బంగారం వస్తుంది. అంతే తప్ప తిరిగి ఏమీ రాదనేది అ΄ోహ మాత్రమే. సర్టిఫికేట్‌లో ఆభరణంలో ఉన్న బంగారం స్వచ్ఛతతో  పాటు క్యారట్‌ వివరం తాలూకు పర్సెంటేజ్‌ కూడా ఉంటుంది. 
– విశేషిణి రెడ్డి, 
జీఐఏ జెమ్మాలజిస్ట్‌ 

ఇదీ చదవండి: Sankranti 2025 : పర్ఫెక్ట్‌ కొలతలతో, ఈజీగా అరిసెలు, కజ్జికాయలు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)