Breaking News

పంచ్‌ కొడితే..పతకాలే..

Published on Mon, 05/26/2025 - 10:06

బాక్సింగ్‌.. ఈ పేరు వినగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి! బాక్సర్లు విసిరే పవర్‌ పంచ్‌లు కళ్లముందు కదలాడతాయి. అలాంటి ఎందరో బాక్సర్లను తయారు చేస్తోంది హైదరాబాద్‌లోని గోల్కొండ బాక్సింగ్‌ అసోసియేషన్‌. గత ఐదు దశాబ్దాలుగా ఎందరో జాతీయ స్థాయి బాక్సర్లను తయారు చేసింది. తొమ్మిది సార్లు సర్వీసెస్‌ ఛాంపియన్, ఐదు సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన దివంగత ఘణీచాంద్‌ గోల్కొండ బాక్సింగ్‌ క్లబ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ క్లబ్‌ను ఏజాజ్‌ అహ్మద్‌ నిర్వహిస్తున్నాడు. ఈయన సమక్షంలో పలువురు చిన్నారు, ఔత్సాహికులు బాక్సింగ్‌ నేర్చుకుంటూ వివిధ వయసుల్లోని గ్రూప్‌లలో పాల్గొని జాతీయ స్థాయి పతకాలు సాధిస్తున్నారు.  

హైదరాబాద్‌ నగరంలో బాక్సింగ్‌ క్రీడకు రాను రాను క్రేజ్‌ పెరుగుతోంది. కాగా బాక్సింగ్‌లో స్వయంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చాపియన్‌గా నిలిచిన ఏజాజ్‌ రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. నిత్యం ఆయన వద్ద ఎనిమిది సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలలోపు బాలబాలికలు శిక్షణ పొందుతున్నారు. అత్యుత్తమ స్థాయి బాక్సింగ్‌ పరికరాలతో ఇప్పటి వరకూ ఏజాజ్‌ పలువురు రాష్ట్రస్థాయి ఛాంపియన్‌లను తీర్చిదిద్దారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అండర్‌–19, అండర్‌–15, అండర్‌–12 విభాగాల బాక్సింగ్‌ పోటీల్లో సత్తాచాటారు. కఠోర శ్రమతో పాటు, మంచి శారీరక ధృడత్వం బాక్సింగ్‌కు కోటలు లాంటివి. నియంత్రిత ఆహారం, క్రమశిక్షణతో మెలిగేవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రత్యర్థి కదలికలు గమనిస్తూ.. ప్రత్యర్థి వేసే పంచ్‌లు ఏవైపు నుంచి వస్తాయో గమనించి మరుక్షణమే పిడుగులాంటి పంచ్‌తో కూల్చగలిగిన వారే బాక్సింగ్‌లో ముందుకు సాగుతారు. కాగా శిక్షణ సమయంలో బాక్సింగ్‌ నిబంధనలను పాటించడం తప్పనిసరి. తూత్‌ సేవర్, హెల్మట్‌తోపాటు అనుమతించిన డ్రెస్‌ కోడ్, నిబంధనలకు లోబడి వాడే గ్లౌజ్‌ తప్పనిసరి. 

ఎందరో ఛాంపియన్‌లు.. 
వరుసగా తొమ్మిదేళ్లు సర్వీసెస్‌ చాంపియన్‌ బాక్సింగ్‌గా నిలిచిన ఘణీచాంద్‌ను ఇక్కడి బాక్సర్లు తమ ఐడియల్‌గా భావిస్తారు. బలమైన పంచ్‌లు విసరడం, కనుసన్నలతోనే ప్రత్యర్థి కదలికలను గమనించడం వంటటి అంశాలపై శిక్షణ అనంతరం జరిగే కౌన్సిలింగ్‌ కార్యక్రమంలో బాక్సర్లకు వివరిస్తారు. అంతేకాక వయసు కేటగిరిలో బరువు ఎంత ఉండాలి అనే విషయంపై కూడా నిరి్థష్ట అవగాహన కల్పిస్తారు. 

వర్థమాన బాక్సర్‌ నిఖత్‌జరీన్‌ను అమ్మాయిలు తమ ఐడియల్‌గా భావిస్తున్నారని కోచ్‌ ఏజాజ్‌ అంటున్నారు. బాలికలను మరింత ప్రోత్సహించేందుకు నిఖత్‌జరీన్‌తో పాటు రాష్ట్రస్థాయి మహిళా బాక్సర్లను తమ బాక్సింగ్‌ క్లబ్‌కు రప్పించామని చెబుతున్నారు. తమ వద్ద శిక్షణ పొందిన నేహా, రమ్య, రుబీనా, అహ్మదీ తదితరులు అండర్‌–15 బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రస్థాయి బాక్సర్లుగా ఎదిగారని తెలిపారు. 

అండర్‌–19 విభాగంలో గత నెల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌ రన్నరప్‌గా నిలిచారు. జూనియర్‌ విభాగంలో పలువురు క్రీడాకారులు గోల్కొండ బాక్సింగ్‌ క్లబ్‌ నుంచి జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు.   

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు