ఆత్మవిశ్వాసమే అసలు బలం

Published on Sun, 03/08/2026 - 06:06

అమ్మాయిలకు నేనిచ్చే సలహా– వీలైనంత త్వరగా ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించాలి. సంపాదించడం, దానిని ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మీరు ప్రపంచాన్ని చూసే కోణం మారుతుంది. దేనికైనా మీరు సిద్ధంగా లేరనుకుంటూ ఎక్కువకాలం వేచి చూడవద్దు. చాలా అవకాశాలు మీరు పూర్తిగా సిద్ధం కానప్పుడే వస్తాయి. పొరపాటు అయిందేమోనని మథనపడకండి. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకోండి. కెరీర్‌ అనేది దశాబ్దాల కృషి. రాత్రికి రాత్రే జరిగిపోదు. ఈ ప్రయాణం మీది. మీరే సృష్టించుకోండి. అది వేరెవరి మాదిరో ఉండాల్సిన పనిలేదు.

తొలినాళ్లలో నాతో నేనే ఎక్కువగా పోరాడాల్సి వచ్చింది, బయటివాళ్లతో కాదు. నా మీద నాకు నమ్మకం రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆర్థిక రంగం– మన పనితీరును అంకెల్లో కళ్లెదుట నిలపాల్సిన రంగం. ఈ రంగంలో మన చుట్టూ ఉండేవారు మామూలు వ్యక్తులు కాదు, చక్కని ట్రాక్‌ రికార్డు, స్పష్టమైన అభిప్రాయాలు ఉండే తెలివైనవారే! నా కెరీర్‌ తొలినాళ్లలో నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేనే అనుమానించాల్సి వచ్చేది. ఈ ప్రయాణంలో నాపై నేను నమ్మకాన్ని పెంచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. 

రాను రాను నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఆత్మవిశ్వాసం పుట్టుకతో వచ్చే వ్యక్తిత్వ లక్షణం కాదు. అది మన చర్యల ద్వారా మనం నిర్మించుకునే కోట. నిర్ణయాలు తీసుకోవడం, ఫలితాలను స్వీకరించడం, అంతకంతకూ మెరుగుపడటం– ఇదో నిరంతర ప్రక్రియ. అదే మనపై మనకు నమ్మకాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసమే అసలు బలం. అది ఎవరికి వారే సాధించుకోవాలి.

అదే నా జీవితంలో మలుపు
ఏదో ఒకే ఒక్క కారణంతో నా జీవితం నాటకీయంగా మారిపోయిందా అంటే లేదనే చెబుతాను. ఇన్వెస్ట్‌మెంట్ల మాదిరే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతూ వచ్చింది. ఇదంతా నా అనుభవం, చేసిన తప్పులు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలతో కాలం గడుస్తున్న కొద్ది సాధించిన పురోగతి. వృత్తిపరంగా నేను ఎదుగుతున్న కొద్ది నేనెందులో రాణిస్తానో, ఎందులో రాణించనో నాకు స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. ముందు మనం అంతర్గతంగా మారాలి. నాయకత్వం అంటే ఇలాగే ఉండాలని భావించి, అందులో ఇమడటానికి ప్రయత్నించడం మానేయాలి. మన బలాబలాలు తెలుసుకుని, దానికి తగ్గట్లు ముందుకెళ్లాలి. ఈ క్రమంలో నాయకత్వమే మన చేతుల్లోకి వస్తుంది. పురోగతి స్పష్టతనిస్తుంది. స్పష్టతతో ఆత్మవిశ్వాసం సాధ్యమవుతుంది. 

వైఫల్యాలు... గుణపాఠాలు
నా జీవితంలో ఇదొక్కటే అతిపెద్ద వైఫల్యమని చెప్పలేను. చిన్న చిన్న వైఫల్యాలు కూడా ఉన్నాయి. నేను ఊహించినట్లుగా రాణించని ఫండ్స్‌ ఉన్నాయి. మార్కెట్‌ కదలికలను సరిగా అంచనా వేయలేని సందర్భాలూ ఉన్నాయి. ఆర్థికరంగంలో ఫలితాలు స్పష్టంగా కనబడతాయి. అంకెలు అబద్ధాలు చెప్పవు. వైఫల్యాలే మానసిక దృఢత్వాన్ని నేర్పిస్తాయి. ప్రతి వైఫల్యానికీ కుంగిపోతూ ఉంటే మార్కెట్‌లో దీర్ఘకాలిక కెరీర్‌ను నిర్మించుకోవడం సాధ్యం కాదు. ఒక త్రైమాసికంలో మంచి ఫలితాలు రాకుంటే అది వ్యక్తి తప్పిదం కాదు. చేయాల్సింది ఒక్కటే, వేగంగా నేర్చుకోవడం– మరింత వేగంగా దానికి తగ్గట్లు మారడం, దృఢంగా నిలవటం, అంతే!

మదర్స్‌కు చెప్పేదేమంటే...
వృత్తిని, కుటుంబాన్ని చూసుకోవటంలో ఎంపికలు, ప్రా«ధాన్యాలే ఉంటాయి తప్ప కచ్చితమైన బ్యాలెన్స్‌ అంటూ ఏమీ ఉండదు. ఒక్కోసారి కుటుంబానికి,  ఒక్కోసారి పనికి ఎక్కువ అంకితం కావాల్సి వస్తుంది. ప్రతిరోజూ రెంటికీ న్యాయం చేయాలని చూస్తే అనవసరమైన అపరాధభావాన్ని మోయాల్సి ఉంటుంది. పిల్లలకేమీ పర్ఫెక్షన్‌ అవసరం లేదు. స్థిరత్వం, ప్రేమ, తమ ఆశయాలను తాము గౌరవించుకునే రోల్‌మోడల్‌ ఉంటే చాలు. ‘మా అమ్మ చేస్తన్నదాంట్లో అర్థం ఉంది’ అని భావించిన నాడు వాళ్లూ స్వతంత్రంగా, దృఢంగా, ఇతరులకు ఆదర్శంగా నిలబడతారు. అపరాధభావం వద్దు, చేస్తున్న పనిపై ఫోకస్‌ పెట్టండి. వీటిని పాటిస్తే మంచిది...

» ఇన్వెస్ట్‌మెంట్లను వీలైనంత త్వరగా మొదలుపెట్టండి. అది ఎంత చిన్నమొత్తమైనా సరే, దాన్ని కొనసాగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 
» మీకు రావాల్సినవి అడిగి మరీ సాధించుకోండి. అవి వేరెవరూ మీకోసం చెయ్యరు.
» ఏదైనా సాధించాలనుకున్నప్పుడు సమర్థతను పెంచుకోండి. అదే చిరకాలం మిమ్మల్ని ముందు నిలబెడుతుంది.
» మీ మానసిక, శారీరక ఆరోగ్యాలను నిరంతరం కాపాడుకోండి. అవి చాలా ఖరీదైనవి.
» ఆర్థికంగానైనా, జీవితంలోనైనా దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి.

-రమణమూర్తి మంథా

#

Tags : 1

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)