Breaking News

జిబ్లీ ట్రెండ్‌.. చిక్కులు తెలుసుకోండి!

Published on Thu, 04/03/2025 - 17:49

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘జీబ్లీ తరం’ కొనసాగుతుందా..? ఎప్పటికప్పుడు కృత్రిమ మేధ వేదికగా పుట్టుకొస్తున్న కృత్రిమ ఆవిష్కరణలే ఈ తరం ట్రెండ్‌గా మారుతున్నాయా..? రానున్న రోజుల్లో ప్రతీదీ ఆర్టీఫిషియల్‌  ఇంటెలిజెన్స్‌పైనే ఆధారపడి పనిచేస్తుందా..? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. విషయానికొస్తే.. గతంలో ఒక పోట్రేట్‌(ముఖ చిత్రం) వేయించు కోవాలంటే ఒక మంచి ఆరి్టస్టు దగ్గరికో, ఈ మధ్య కాలంలోనైతే ఆన్‌లైన్‌లోనే ఆర్టిస్టులకు ఆర్డర్‌ ఇస్తే వారే అందమైన చిత్రాన్ని వేసి ఇంటికి పంపించేవారు. అయితే కొన్ని రోజుల నుంచి జీబ్లీ ఏఐ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఓపెన్‌ ఏ1 సంస్థ తన చాట్‌ జీపీటీ–40 మోడల్‌లో ఈ కొత్త ఇమేజ్‌ జనరేషన్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ ట్రెండ్‌ మరింత వేగంగా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ తమ ఫొటోలను ఈ వేదికగా సబ్మిట్‌ చేసి క్షణాల్లో వారి జీబ్లీ ఫొటోలను పొంది.. సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తున్నారు.    – సాక్షి, సిటీబ్యూరో

పేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎక్స్‌ వంటి సోషల్‌ మీడియా యాప్స్‌ వినియోగం పెరిగిన తర్వాత.. వ్యక్తిగత ఫొటోలను వివిధ సందర్భాలను మిత్రులు, తెలిసినవారికి పంచుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిన విషయం విధితమే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా అందంగా, వినూత్నంగా తమ ఫొటోలను చూసుకోవాలన్న కుతూహలం పెరిగింది. గతంలోనైతే నగరంలోని ట్యాంక్‌ బండ్‌ పైనో, అలా శిల్పారామంలోనో పోట్రేట్‌ వేసే కళాకారులు ఉండేవారు.. వారి వద్ద లైవ్‌గా వేయించుకునేవారు. కానీ ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పుణ్యమా అని.. వినూత్న, కళాత్మక యానిమేటెడ్‌ ఫొటోలు క్షణాల్లో వచ్చేస్తున్నాయ్‌.. ఇంకేముంది.. వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోవడం, షేర్లు, పోస్టులు చేయడం చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సామాన్యులు మొదలు సెలబ్రెటీల వరకు మినహాయింపు లేకుండా వాడేస్తున్నారు. ఐతే ఇందులోనూ చిక్కులు లేకపోలేదు. ఈ ట్రెండ్‌లో ప్రైవసీ, కాపీరైట్‌ సమస్యలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

కాపీరైట్స్‌ మాత్రం జపాన్‌కు చెందిన  స్టూడియో జీబ్లీ.. 
ప్రస్తుతం వైరల్‌గా మారిని జీబ్లీ ఫొటోలు.. చాట్‌జీపీటీలో సరికొత్త ఇమేజ్‌ జనరేషన్‌ ఫీచర్‌. కానీ ఈ ఫొటోలు జపాన్‌లో ప్రసిద్ధి పొందిన స్టూడియో జీబ్లీకి చెందిన యానిమేషన్‌ శైలిలోకి మారుస్తున్నాయి. ఈ ట్రెండ్‌తో కొన్ని ప్రైవసీ, కాపీరైట్‌ సమస్యలు తలెత్తే అవకాశముంది. వినియోగదారులు తమ వ్యక్తిగత ఫొటోలను యాప్‌ సాధనాలకు అప్లోడ్‌ చేస్తున్నప్పుడు ఆ డేటా నిల్వ చేస్తారు. విభిన్న విధాలుగా ఉపయోగించవచ్చనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 

ప్రధానంగా స్టూడియో జీబ్లీ ప్రత్యేక శైలిని అనుకరించడంతో ఆ సంస్థ కాపీరైట్‌ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా అనే చర్చ కూడా కొనసాగుతుంది. మిలియన్ల కొద్దీ మంది ఈ సాంకేతికతను ఒకేసారి వినియోగిస్తున్న నేపథ్యంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సందర్భమే గతంలోనూ జరిగింది. ‘హ్యాపీ బర్త్‌ డే టూ యూ’ అంటూ ప్రతీఒక్కరి బర్త్‌ డే రోజు వాడుకునే ఈ పాట వార్నర్‌/చాపెల్‌ అనే మ్యూజిక్‌ పబ్లిషర్‌ది. అప్పట్లో ఇది కూడా వైరల్‌ కావడంతో దీనిపై కూడా కాపీరైట్‌ కేసు కూడా ఫైల్‌ చేశారు యాజమాన్యం. కానీ అనంతరం అధికారికంగా పబ్లిక్‌ డోమైన్‌లోకి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.

ఇది అనైతికం..: హయావో  మియాజాకి 
తమ సాంకేతికత శైలిని పోలిన కళాత్మక ఫొటోలను సృష్టించడం అనైతిక చర్యగా గతంలో స్టూడియో జీబ్లీ సహ వ్యవస్థాపకుడు హయావో మియాజాకి తెలిపారు. 2016లోనే ఏఐ ద్వారా సృష్టించబడిన చిత్రాలను జీవితానికే అవమానంగా ఆయన అభివరి్ణస్తూ ఈ కళపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి ఆధునిక సాంకేతికత వలన పెయింటింగ్, డ్రాయింగ్, పోట్రేట్‌ పెయింటింగ్‌ వంటి కళలపైన జీవనం సాగిస్తున్న కళాకారులకు కష్ట–నష్టాలను తెచ్చిపెడుతుంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)