కీర్తనను చంపింది నిజమే.. శిక్ష వేయండి.. ఎన్ కౌంటర్ చేయొద్దు
Breaking News
రేంజ్ మారినా.. మారిపోని ఫ్రెండే ఇతడు..!
Published on Sun, 04/12/2026 - 12:03
స్నేహానికి ఉన్న శక్తి మరొకటి లేదు. ట్రెండ్ మారినా..స్టేటస్ మారినా..ఫ్రెండ్ మారడు అనేందుకు ఈ వ్యక్తే నిదర్శనం. ఎంత పెద్ద హోదాలో చక్కటి లైఫ్ లీడ్ చేస్తున్నా.. కేవలం తన స్నేహితుడి కోసం నిస్వార్థంగా చేస్తున్న అతడి సాయం చూస్తే..కళ్లల్లో నీళ్లు తిరుగతాయ్..!. ఇంతకీ అతడేం చేశాడంటే..
గురుగ్రామ్‌లో ఒక విలాసవంతమైన కారు డిక్కీలో బేకరీ ఉత్పత్తులు అమ్ముతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. ఇంతకీ అందులో అంత ఆసక్తికరమైనది ఏం ఉందంటే.. హర్ష్ చౌహన్ అనే అకౌంట్ నుంచి షేర్ అయిన ఆ వీడియోలో ఆ వ్యక్తి తన ఖరీదైన కారు డిక్కీని తెరిచి, అమ్మకానికి ఉంచిన బేకరీ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ కనిపిస్తాడు.
నీద్గగర రూ. 37 లక్షల ఖరీదు చేసే కారు ఉంది మరి ఇదేంటన్ యూజర్ చౌహన్ అడగ్గా..తాను జర్మనీలో మెడికల్ రీసెర్చ్ సైంటిస్టునని బాంబు పేలుస్తాడు. ఇదంతా కేవలం తన స్నేహితుడికి మద్దతు ఇచ్చేందుకని కూల్‌గా చెబుతాడు. వైరల్ అవుతున్న వీడియోలోని కథ నిజమేనా కాదా అని పలువురు మీడియా ఔత్సాహికులు ఆరా తీయగా..అతడు జర్మనీ నుంచి తిరిగి వచ్చిన రీసెర్చ్ సైంటిస్ట్ అవధేష్ అని తేలింది. అతడితో మాట్లాడగా..తాను జర్మనీలో మూడేళ్లుగా మెడికల్ రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్నాని, ప్రస్తుతం ఉద్యోగానికి బ్రేక్ తీసుకున్నట్లు అవధేష్ పేర్కొన్నాడు.
ఆ నేపథ్యంలోనే తన కారుని తాత్కాలిక చట్కారా ఆన్ వీల్స్' అనే స్టాల్‌గా ఉపయోగించి బేకర్ ఉత్పత్తులు అమ్ముతూ.. స్నేహితుడికి ఫుడ్ వ్యాపారంలో సాయం చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇక్కడ భారత్‌లో తన స్నేహితుడు పూర్తి స్థాయిలో స్థిరపడ్డాక..తాను తిరిగి జర్మనీకి వెళ్లిపోతానని చెబుతుండటం విశేషం. అందుకు సుమారు ఐదు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపాడు.
ఎంత పెద్ద హోదాలో ఉన్నా..మారిపోని ఫ్రెండ్ ఇతడే అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. స్నేహం కోసం కొందరు ఎంత దూరమైన వెళ్తారు. అలాంటి వ్యక్తులను పొందడం అనేది కొన్ని కోట్ల కన్నా విలువైన సంపద అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు అతడి నిస్వార్థ సేవకు మాటల్లేవ్ బ్రో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
(చదవండి: ఫేస్ పౌడర్' వెనుక ఇంత స్టోరీ ఉందా..!)
Tags : 1