Breaking News

మల్టీ కలర్‌ చీరలో నీతా అంబానీ స్పెషల్‌ అండ్‌ సింపుల్‌ లుక్‌

Published on Fri, 09/13/2024 - 13:42

రిలయన్స్‌  పౌండేషన్‌ అధ్యక్షురాలు నీతా అంబానీ ఏ చీర కట్టినా, ఏనగ పెట్టినా అద్భుతమే. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫ్యాషన్‌, డిజైనర్‌ దుస్తులు అందర్నీ ఆకర్షిస్తుంటాయి. చేనేత, ,పట్టుచీరలు, డైమండ్‌ నగలు, ముత్యాల హారాలతో తనదైన ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్‌ ఐకాన్‌లా నిలుస్తుంటారామె. ఇటీవల అంబానీ కుటుంబం గణేష్ చతుర్థిని ఉత్సాహంగా నిర్వహించింది. ఈ సందర్బంగా నీతా అంబానీ 'బంధేజ్' చీరలో ప్రత్యేకంగా  కనిపించారు.

డిజైనర్ జిగ్యా పటేల్ డిజైన్‌ చేసిన వంకాయ రంగు, గులాబీ రంగుల మల్టీకలర్ బంధేజ్ చీరలో  నీతా అంబానీ అందంగా కనిపించారు. ఇక  ఆమె వేసుకున్న గుజరాతీ ఎంబ్రాయిడరీతో ఎరుపు రంగు బ్లౌజ్ ప్రత్యేకత ఏంటంటే స్లీవ్‌లపై గణపతి బప్పా డిజైన్ ఉండటం.  ఇంకా ఎనిమిది వరుసల ముత్యాల హారం, డైమండ్ చెవిపోగులు, ముత్యాలు పొదిగిన గాజులు, చేతి రింగ్‌, ఇంకా సింపుల్‌గా పువ్వులతో ముడితో ఎత్నిక్ లుక్‌తో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశారు. ఇటీవల ఎన్‌ఎంఈసీసీలో జరిగిన ఈవెంట్‌లో నీతా అంబానీ పట్టు 'పటోలా' చీరలో మెరిసారు.  స్టైలిష్ రెడ్-హ్యూడ్ సిల్క్ పటోలాకు ‍మ్యాచింగ్‌గా‌ రాధా-కృష్ణ-ప్రేరేపిత గ్రాఫిక్ డిజైన్ వర్క్‌ బ్లౌజ్ ధరించిన సంగతి తెలిసిందే.

కాగా  రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ  చిన్న కుమారుడు అనంత్‌ , రాధిక  పెళ్లి తరువాత వచ్చిన తొలి వినాయక చవితి కావడంతో అంబానీ కుటుంబం ఈ గణేష్ చతుర్థి వేడుకలనుఘనంగా నిర్వహించారు. బాలీవుడ్‌ తారలు, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై గణపతి బప్పా ఆశీస్సులు తీసుకున్నారు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)