Breaking News

కాకమ్మ అందం

Published on Sun, 11/09/2025 - 05:25

అనగనగా ఒక అడవిలో చెరువు ఒడ్డున ఒక వేప చెట్టు మీద ఒక కోతమ్మ ఉండేది. ఆ చెట్టు మీదకు కొత్తగా  ఒక కాకమ్మ వచ్చి ముళ్లపుల్లలు, చెట్టుబెరడు, జంతువుల వెంట్రుకలు, గడ్డి మొక్కలు తీసుకొచ్చి అందమైన గూడు కట్టింది. కోతమ్మ, కాకమ్మతో స్నేహం చేసింది.ఒక రోజు కాకమ్మ గూటిలో రెండు గుడ్లు పెట్టింది. మరునాడు కాకమ్మ లేనప్పుడు ఒక కోకిలమ్మ నెమ్మదిగా కాకమ్మగూటిలో దూరి రెండు గుడ్లు పెట్టింది. కోతమ్మ అది గమనించింది. ‘అక్కా! నన్ను క్షమించు! నాకు గూడు కట్టుకోవటం రాదని నీకు తెలుసుకదా! అందుకే కాకమ్మ గూటిలో రెండు గుడ్లు పెట్టాను!’ అంది కోకిలమ్మ.

కోతమ్మ మాట్లాడలేదు. కాకమ్మ తిరిగి గూటికి వచ్చింది. దానికి మరో రెండు గుడ్లు కనిపించాయి. చుట్టూ చూసింది. ఏ పక్షీ కనిపించలేదు. తనగుడ్లతో పాటు వాటినీ పొదిగి పిల్లల్ని చేసింది.కోతమ్మకు కాకమ్మ పిల్లలు నల్లగా, అందవిహీనంగా కనిపించాయి. వాటిని ముట్టుకోటానికే అసహ్యం కలిగింది.చెట్టు కింద చెరువులో నీళ్లు తాగడానికి కొంగమ్మ, చిలకమ్మా, నెమలమ్మ వచ్చాయి.

అది చూసిన కాకమ్మ చెట్టు దిగి కిందికి వెళ్లి తన అందమైన బిడ్డలను చూడవలసిందిగా కోరింది. ‘నీ పిల్లలకి తెల్ల ఈకలు వచ్చాయా.. ఏంటీ!’ అంది కొంగ.
‘ఆకుపచ్చ ఈకలు వచ్చాయా.. ఏంటీ!’ అంది చిలుక.
‘పోనీ.. రంగు రంగుల ఈకలు వచ్చాయా.. ఏంటీ!’ అంది నెమలి.
అప్పుడు ‘నా పిల్లల అందం మీలా వర్ణించలేను. చూస్తే మీకే తెలుస్తుంది!’ అంది కాకమ్మ..
కొంగమ్మ, చిలకమ్మా , నెమలమ్మలు కాకమ్మ గూటికి వెళ్లి చూశాయి. 
పిల్లలు కాకమ్మలా నల్లగా కనిపించాయి.

కాకమ్మను బాధ పెట్టకుండా, పిల్లలు తన పోలికతో, బూడిదరంగు ఈకలతో ముద్దుగా ఉన్నాయని దీవించి వెళ్లాయి. అవి వెళ్లగానే ‘అక్కా! ఇంత అందమైన పిల్లలు ఏ ప„ì కైనా పుట్టాయా?’ కోతమ్మతో అంది కాకమ్మ.

‘నాకు తెలీదు! రేపు కొంగమ్మ, చిలుకమ్మ, నెమలమ్మ ఇంటికి వెళ్లి పిల్లల్ని చూసి రా.. పో!’ అంది.తెల్లారి కాకమ్మ మొదట కొంగమ్మ గూటికి వెళ్ళింది. గూటిలో రెండు పిల్లలు కనిపించాయి. మెరిసే తెల్లటి, గోధుమ రంగు ఈకలు, పొడవాటి కాళ్లు, పొడవాటి మెడ, కొనతేలిన ముక్కు, గుండ్రటి పెద్ద కళ్లతో ముచ్చటగా ఉన్నాయి.కాకమ్మ అక్కడి నుంచి చిలకమ్మ గూటికి వెళ్ళింది.చిలకమ్మ ఇద్దరి పిల్లలు కూడా ఆకు పచ్చటి ఈకలతో, ఎర్రటి ముక్కుతో, గుండ్రటి పెద్ద కళ్లతో ఆకర్షణగా కనిపించాయి.ఆ తర్వాత అక్కడ నుంచి నెమలి ఇంటికి పోయింది.

నెమలి పిల్లలు కూడా గోధుమ ఈకలు, చిన్న కాళ్లు, పదునైన ముక్కుతో, అందంగా కనిపించాయి.కాకి తిరిగి వేపచెట్టు దగ్గరికి వచ్చింది.కోతమ్మ ఆసక్తిగా కాకి కళ్లలోకి చూస్తూ.
‘చెల్లీ! కొంగమ్మ, చిలకమ్మ, నెమలమ్మ పిల్లలు ఎలా ఉన్నాయి’ అడిగింది. 
‘అక్కా! నా బిడ్డల అందం మాత్రం వాటికి లేదు!’ అంది కాకమ్మ.
ఇంతలో కోకిలమ్మ వచ్చి కొమ్మపై వాలింది. 
‘చెల్లీ! నా పిల్లల్ని చూసి పోదువురా!’ అంటూ కోకిలమ్మను గూటిలోకి ఆహ్వానించింది కాకమ్మ.

‘అక్కా! పిల్లలు ముద్దొస్తున్నారు!’ అంటూ కోకిలమ్మ గూటిలోని నాలుగు పిల్లల్ని ముద్దాడింది.  బిడ్డలు ఎలా ఉన్నా, తల్లికి అందంగానే కనిపిస్తారు. కానీ పరాయి బిడ్డల్ని కూడా తన బిడ్డలుగా పెంచే కాకమ్మ మనసు అందంగా కనిపించింది. కాకమ్మ పిల్లలు కూడా ఎంతో అందంగా, ముద్దుగా కనిపించాయి. వాటిని చేతిలోకి తీసుకుని ముద్దాడింది కోతమ్మ.

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)