Breaking News

కథాకళి: పేపర్‌ బాయ్‌

Published on Sun, 11/30/2025 - 07:40

నేను ఇంజినీరింగ్‌ సెకండియర్‌ చదువుతూ సంపాదనకి రోజూ ఉదయం ఆరులోగా వంద ఇళ్ళల్లో దినపత్రికలని సరఫరా చేయసాగాను. అందుకు రెండు గంటల పైనే పడుతుంది. ఆ అదనపు ఆదాయం నా బస్‌ పాస్‌కి సరిపోతుంది. సమయం అంటే డబ్బు అని ఎందుకు అంటారో అలా నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. తక్కువ సమయం తక్కువ డబ్బు, ఎక్కువ సమయం ఎక్కువ డబ్బు. నా బీట్‌లో అపార్ట్‌మెంట్స్‌ తక్కువ. సొంత ఇళ్ళ వాళ్ళు ఎక్కువ. అపార్ట్‌మెంట్‌ సబ్‌స్క్రైబర్స్‌లోని సౌకర్యం, ఎక్కువ దినపత్రికలని తక్కువ సమయంలో డెలివరీ చేయొచ్చు. ఇండిపెండెంట్‌ ఇళ్ళల్లో ఇవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.నేను పేపర్లని వేసే ఓ ఇండిపెండెంట్‌ ఇంటి యజమానిని నెల నెలా కలిస్తే పేపర్‌ బిల్‌ని కేష్‌గా చెల్లిస్తూంటాడు. నా కస్టమర్స్‌ అందరిలోకి ఆయనే ఎక్కువ వయసు గలవాడు. 

ఆయన మిగిలినవారి కన్నా ప్రేమగా ఉంటాడు. నెల నెలా డబ్బు కలెక్ట్‌ చేసుకోడానికి వెళ్ళినప్పుడు నా గురించి అడిగి తెలుసుకునేవాడు. నా చదువు ఎలా సాగుతోందని అడిగేవాడు. ప్రతిసారి వాగ్‌బకరీ ఇన్‌ స్టంట్‌ కార్డమమ్‌ టీని ఇచ్చి కాని పంపేవాడు కాదు. నాలుగు నెలల క్రితం బిల్‌ కోసం వెళ్తే ఆయన కోరాడు.‘‘రేపటి నుంచి నువ్వు నాకో సహాయం చేయాలి.’’‘‘అలాగే, చెప్పండి.’’‘‘నువ్వు పేపర్‌ని కాంపౌండ్‌ గోడ మీంచి విసిరేసి వెళ్తున్నావు. అలా కాకుండా బెల్‌ కొట్టి నాకు ఇస్తూండు.’’‘‘అలాగే సర్‌. కాని నేను ఆ పేపర్‌ సరిగ్గా మీ తలుపుకి తగిలి దాని ముందు పడేలా చక్కగా విసురుతున్నాను. ఇంతదాకా ఎన్నడూ నేను మిస్‌ అవ్వలేదు. అయ్యానా సర్‌?’’ఆయన సన్నగా నవ్వి చెప్పాడు.

‘‘లేదు. నీ టాలెంట్‌ని గుర్తించాను. కాని నువ్వా పని చేయాలి. నేను అడిగేది నీ సమయాన్ని ఎక్కువ తీసుకోవడం అని నాకు తెలుసు. నీ సమయానికి నీకు నెలకి ఐదు వందలు అదనంగా చెల్లిస్తాను. సరేనా?’’‘‘అది చాలా పెద్ద మొత్తం సర్‌. నూట ఏభై చాలు.’’ఆయన నవ్వి చెప్పాడు.‘‘నీకు. నాకు కాదు. నిజానికి నాకు అది చాలా చిన్న మొత్తం. ఎందుకంటే...’’ఆయన చెప్పింది విన్నాక మర్నాటి నుంచి ఆయన ఇంటి ముందు సైకిల్‌ దిగి స్టాండ్‌ వేసి లోపలికి వెళ్ళి డోర్‌ బెల్‌ కొట్టి తలుపు తెరచిన ఆయనకి ‘గుడ్‌ మార్నింగ్‌’ చెప్పి పేపర్‌ ఇవ్వసాగాను.ఆయన ప్రతిసారి కృతజ్ఞతగా ‘థాంక్యూ. గాడ్‌ బ్లెస్‌ యు’ అంటారు. ‘బై సర్‌. టేక్‌ కేర్‌ సర్‌’ లాంటి మాటలు చెప్పి నేను సైకిల్‌ ఎక్కుతాను. 

నెలకి ఐదు వందల రూపాయలు అదనపు ఆదాయానికి మా ఇంట్లో అందరికన్నా మా అమ్మ ఎక్కువ ఆనందించింది. ఇంట్లో కుట్టు మెషిన్‌ తో బ్లౌజులు కుట్టడానికి ఒకో దానికి మా అమ్మ సంపాదించే మొత్తం అది. ఓరోజు తలుపు తట్టినా ఆయన తెరవకపోవడంతో పేపర్‌ని తలుపు ముందు పడేసి వెళ్ళిపోయాను. నా బీట్‌ ముగిశాక ఆయన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఆగి చూస్తే పేపర్‌ అక్కడే ఉంది. ఆయన కోరిక ప్రకారం నేను మధ్యాహ్నం పన్నెండున్నరకి మళ్ళీ వెళ్ళి చూస్తే ఆయన ఇంటి తలుపు ముందు దినపత్రిక నేను వేసిన చోటే కనిపించింది. ఆ తర్వాత ఆయన కోరింది చేశాను.పోలీసుల దగ్గరకి వెళ్ళి ఆయన ఇంటి డూప్లికేట్‌ తాళం చెవి ఎవరి దగ్గర ఉంటుందో చెప్పాను. 

ఆ వృద్ధుడు నాకు ఇచ్చిన తన మాజీ కొలీగ్‌ ఇంటి చిరునామా, ఫోన్‌  నెంబర్‌ గల కాగితాన్ని నేను ఎస్సైకి ఇచ్చాను. నేను చెప్పింది విని ఎస్సై ఓ కాన్‌ స్టబుల్‌ని ఆ పని చూడమన్నాడు. ఇద్దరం అక్కడికి చేరుకున్నాము.లోపల టీవీ ఆన్‌ లో ఉంది. దాని ముందు సోఫాలో కూర్చున్న ఆయన ఒరిగిపోయిన తీరు చూడగానే పోయాడని మాకు అర్థమైంది. ఆయన చేతిలోని రిమోట్‌ తీసే ప్రయత్నం చేసినా, రాకపోవడంతో కాన్‌ స్టబుల్‌ చెప్పాడు.‘‘రిగర్‌మార్టిస్‌. పోయి చాలా గంటలైంది.’’ఆయన మరణించాడని తెలిసి నేను బాధపడ్డాను. ఓ కస్టమర్‌ని కోల్పోయాననో, నెలకి ఐదు వందలు పోయాయనో కాదు. ఆయన పరిస్థితి గురించి తెలిశాక. ఆయన కొడుకు ఫోన్‌  నెంబర్‌కి ఫోన్‌  చేసి ఆ విచారకర వార్త చెప్పాను. అతను వచ్చేలోగా ఆయన మృతదేహాన్ని హాస్పిటల్‌లో భద్రపరిచే ఏర్పాటు ఆయన కొలీగ్‌ చేశాడు.

 ఆయన పోయిన పదమూడో రోజు నాకు ఆయన కొడుకు నుంచి ఫోన్‌  వచ్చింది. వెంటనే తనని కలవమని చెప్తే వెళ్ళాను. ఓ కవర్‌ ఇచ్చాడు. దానిమీద నా పేరుంది. దాన్ని చింపి చదివాను.డియర్‌ పేపర్‌ బాయ్, థాంక్స్‌. నువ్వు డోర్‌ బెల్‌ నొక్కినప్పుడు నేను తలుపు తెరవక పోవడానికి కారణం తెలిశాక ఇది నీకు అందుతుంది. నా భార్య ఆరు నెలల క్రితం పోయింది. మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. నాకు వీసా దొరక్క ఇండియాలో ఉండాల్సి వచ్చింది. నా సమయం ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. నా శవం కుళ్ళిన వాసన వచ్చాక కాక, నేను పైకి వెళ్ళానన్న వార్త మా అబ్బాయికి వెంటనే తెలియచేయడానికి నీతో ఆ ఏర్పాటు చేసుకున్నాను. నన్ను ముఖాముఖి కలిసేవారు, నాతో మాట్లాడేవారు ఎవరూ లేరు. డోర్‌ బెల్‌ మోగి తలుపు తెరవగానే నువ్వు చెప్పే గుడ్‌ మార్నింగ్‌ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. బాగా చదువుకో బై! గాడ్‌ బ్లెస్‌ యు.ఉత్తరానికి పెట్టిన జెమ్‌ క్లిప్‌కి నా పేర ఏభై వేల రూపాయలకి తారీఖు వేయని చెక్కు కూడా ఉంది.  
 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)