Breaking News

చీకట్లో.. చిరుదీపం..

Published on Wed, 09/10/2025 - 12:51

వివిధ సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల ద్వారా రోష్నీ అనేకమంది బాధితులకు చేరువయ్యింది. 1997లో నలుగురితో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 70 మంది సుశిక్షితులైన వాలంటీర్లతో నిత్యం కౌన్సెలింగ్‌ ఇస్తూ అనేక మందికి అందగా నిలుస్తోంది. 

వీధినాటకాలు, కరపత్రాలు, ప్లకార్డుల ప్రదర్శనలతో 28 ఏళ్లుగా వేలాది మందికి అండగా..  ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిన వారి కోసం సైకాలజిస్టులు, సైక్రియాట్రిస్టులతో మానసిక చికిత్స, ఉచితంగా మందులు అందిస్తోంది. ప్రతి శుక్రవారం రామకృష్ణ మఠంలో సెషన్స్‌ నిర్వహిస్తోంది. 040–6620 2000, 040–6620 2001 రోష్నీ కౌన్సెలింగ్‌ సెంటర్‌ టోల్‌ఫ్రీ.

పురుషులే ఎక్కువ.. 
నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో 2023 ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో పురుషులే అధికంగా ఉన్నారు. ప్రతి 40 సెకన్లకు ఒకరు చొప్పున ఏటా 8 లక్షల మంది, ఒక్క భారత్‌లోనే మూడు నిమిషాలకు ఒకరు చొప్పున యేడాదికి 1.71 లక్షల మంది, రోజుకు 512 మంది ఆత్మహత్యలు చేసికుంటున్నారు. ఏపీ, తెలంగాణలో ప్రతి రోజు 6 నుంచి 8 ఆత్మహత్యలు రికార్డవుతున్నాయి.  

గుర్తించాలి.. ఆలోచన తుంచాలి.. 
ఎవరితో కలవకుండా దూరంగా ఉండటం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, బతకాలని లేదని అంటుండటం వంటి లక్షణాలను గుర్తించాలి. వారితో మనసువిప్పి మాట్లాడి.. కారణాలు గుర్తించాలి. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాలి. 
– ఆనంద దివాకర్‌ (సీనియర్‌ కౌన్సెలర్‌) 

చావు పరిష్కారం కాదు.. 
చిన్న సమస్యలకు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసికుని విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. చావు శాశ్వత పరిష్కారం కాదు. మనలో బాధను ఇతరులతో పంచుకుంటే పరిష్కారం దొరుకుతుంది. కుటుంబంలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద ఉంటుందని గుర్తించాలి. 
– విద్యారెడ్డి (కౌన్సెలర్‌)  

(చదవండి: ఆ ఒక్క క్షణం..! క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు)

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)