Breaking News

ఫోర్బ్స్‌ జాబితాలో నలుగురు భారతీయులకు చోటు!

Published on Wed, 12/06/2023 - 10:04

ప్రతి ఏడాది అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ప్రపంచంలోని వంద మంది శక్తిమంతమైన మహిళల జాబితాను విడుదల చేస్తుంది. ఈసారి ఆ జాబితాలో నలుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి చోటు దక్కించుకుని 32వ స్థానంలో నిలిచారు. ఇక ఆమె తోపాటు మరో ముగ్గురు భారతీయ మహిళల్లో..హెచ్‌సీఎల్‌ కార్పోరేషన్‌ సీఈవో రోష్నీ నాదర్‌ మల్హోత్రా(60వ స్థానం), స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ సోమ మొండల్‌(70వ స్థానం), బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా(76వ స్థానం)లో ఉన్నారు. 

ఇక సీతారామన్‌ 2019లో భారతదేశ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. ఆమె  కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు. అంతేగాక రాజకీయాల్లోకి రావడానికి ముందు సీతారామన్ యూకే ఆధారిత అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్‌లోనూ, BBC వరల్డ్ సర్వీస్‌లోనూ విభిన్న రోల్‌లో సేవలందించడమే గాక జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా పనిచేశారని ఫోర్బ్స్‌ పేర్కొంది. అలాగే హెచ్‌సీఎల్‌ కార్పోరేషన్‌ సీఈవో మల్లోహత్రా ప్రముఖ పారిశ్రామికవేత్త శివ్ నాడార్ కుమార్తె.

ఆమె హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్‌గా, కంపెనీకి సంబంధించిన అన్ని వ్యూహాత్మక నిర్ణయాలకు చాకచక్యంగా తీసుకుంటుందని వెల్లడించింది ఫోర్బ్స్‌. ఆమె తర్వాత స్థానంలో నిలిచిన మోండల్ సెయిల్‌కి మొదటి మహిళా చైర్‌పర్సన్ మాత్రమే గాక నాయకురాలిగా బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదిలోనే మూడు రెట్లు లాభలు అందుకున్నారు. ఆమె ఉక్కు తయారీ రంగంలో అనూహ్యంగా ఆర్థిక వృద్ధిని గడించి ఉక్కులాంటి మహిళ అని నిరూపించుకుందని ఫోర్బ్స్‌ పేర్కొంది. కాగా, ఫోర్బ్స్‌ ప్రకారం ఇది నాలుగు కీలక కొలమానాల ఆధారంగా ఈ  ర్యాంకులను నిర్ణయిస్తుంది. వాటిలో.. డబ్బు, మీడియా, ప్రభావం, ప్రభావ రంగాలు తదితరాలను పరిగణలోనికి తీసుకుంటుంది. 

(చదవండి: వరీ ప్రేరణ దేవస్థలి? ఏకంగా యుద్ధ నౌకకే అధికారిణిగా..!)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)