Breaking News

ప్రపంచం మెచ్చిన మన ప్రాంతీయ స్వీట్స్‌ ఇవే..!

Published on Tue, 06/17/2025 - 12:10

భారతదేశం అనేక శతాబ్దాలుగా విభిన్న వంటకాలకు పేరొందింది. మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన మిఠాయిలకు కూడా మనం కేరాఫ్‌గా ఉన్నాం. ప్రపంచీకరణ నేపధ్యంలో ఇప్పుడు ఆయా వంటకాలకు అంతర్జాతీయ గుర్తింపు సైతం లభిస్తోంది. దాంతో వీటికి నకిలీలు పుట్టుకురాకుండా పలు స్వీట్స్‌కు  జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జిఐ)  ట్యాగ్‌ ఇచ్చారు. ఈ ట్యాగ్‌  ప్రత్యేక ప్రాంతానికి చెందిన, అక్కడి పద్ధతుల్లో తయారయ్యే సంప్రదాయ మిఠాయిలను పరిరక్షించడంతో పాటు గ్లోబల్‌ స్థాయిలో మరింత గుర్తింపును ఈ ట్యాగ్‌ తెచ్చిపెడుతుంది. 

మన తిరుపతి లడ్డూ గొప్పతనం తెలిసిందే. అవి కాకుండా  ప్రస్తుతం అలాంటి గుర్తింపు పొందిన గ్లోబల్‌ స్వీట్స్‌.. వాటి మూలాల గురించి తెలుసుకోవాలంటే... దార్వాడ్‌ పేడ, కర్ణాటక రాష్ట్రపు సంప్రదాయ స్వీట్‌. చిక్కటి పాలతో దీని తయారీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఎర్రనిరంగులో ఉండే ఉత్తరప్రదేశ్‌ బనారస్‌ లాల్‌ పేడకు ఆ రంగు రావడానికి కారణం వండే శైలి అట. వారణాసి మూలాలు కలిగిన ఈ స్వీట్‌ పాలపిండి, పప్పులు, సీడ్స్‌ మేలు కలయిక. 

ఇక మనకూ బాగా పరిచయమైన బెంగాల్‌ రసగుల్లా కూడా జిఐ ట్యాగ్‌ అందుకుంది. చక్కెర పాకంలో ముంచిన సున్నితంగా నోట్లో  వేసుకుంటే కరిగిపోయే ఈ స్వీట్‌. పశ్చిమ బెంగాల్‌కి చెందింది. అలాగే ఒడిశాకు చెందిన మరో రకం రసగుల్లాకి కూడా జిఐ ట్యాగ్‌ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాను ప్రపంచ పటంలో నిలబెట్టిన  ‘‘పేపర్‌ స్వీట్‌’’ ఇప్పుడు అంతర్జాతీయంగా ఆకర్షిస్తోంది. 

ఈ ఆత్రేయపురం పూత రేకులు కూడా జిఐ ట్యాగ్‌ను పొందాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంకు చెందిన బందరు లడ్డు.. కూడా ఈ గుర్తింపును అందుకుంది. కొబ్బరిపాలు, గుడ్లు తదితరాలను మేళశించి చేసే గోవన్‌ బెబింకా అనే గోవా స్వీట్‌ 16 పొరలతో తీయటి అనుభూతులు పంచుతూ ప్రపంచవ్యాప్త గుర్తింపునూ జిఐ ట్యాగ్‌ను దక్కించుకుంది. 

గోధుమ పిండి, నెయ్యి, బెల్లంతో తయారయ్యే తమిళనాడుకు చెందిన తిరునల్వేలి హల్వాకు కూడా జిఐ గుర్తింపు ఉంది. ఇక కేరళకు వెళ్లే పర్యాటకులు తప్పకుండా రుచి చూసేది, తమతో పాటు వెంట తెచ్చుకునే కోజికోడ్‌ హల్వా గురించి మనలో చాలా మందికి తెలిసిందే. ఇప్పుడు అది ప్రపంచానికి కూడా తెలిసింది. 

గుమ్మడి గింజలతో తయారయ్యే పేత ఆగ్రా ప్రాంతపు వంటకంగా ప్రపంచ ప్రాచుర్యం పొందింది. తాజ్‌మహల్‌ని సందర్శించేవారు చవులూరించే పేతను కూడా రుచిచూడందే వదలరు. బీహార్‌కు చెందిన సిలావో కాజా... ఇలా డజనకు పైగా జిఐ ట్యాగ్‌ పొందిన భారతీయ మిఠాయిలు ఉన్నాయి. వీటిని రుచి చూడడం అంటే కేవలం మరో వెరైటీ వంటకాన్ని తినడం మాత్రమే కాదు ఆయా ప్రాంతపు సంప్రదాయాల్ని అవగాహన చేసుకోవడం కూడా.

(చదవండి: ఒత్తిడిని చిత్తు చేసి...ఆల్‌ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)