Breaking News

Good Health: వెజ్‌ తినాలా? నాన్‌ వెజ్‌ తినాలా?

Published on Fri, 05/02/2025 - 11:30

ఓ మహిళ.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తితో.. జంతుబలి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మా ఇష్టం మాకు నచ్చింది మేం తింటాం.. అంటూ అవతలి వ్యక్తి సమాధానం ఇస్తున్నాడు. మాంసాహారం తింటాం అంటే కుదరదు.. ఎందుకు కుదరదో చెబుతాను వినండి.. అంటూ ఆమె శాకాహారం గొప్పతనం, మన సైక్లింగ్‌ ప్రకృతి నియమాలు ఇతర అంశాలను  వివరించారు. మీరు ప్యూర్‌ వెజిటేరియన్‌గా మారతారా? అని హామీ తీసుకుంది. ఇంత చెప్పిన తర్వాత ఆ మనిషిలో ఆలోచన మొదలైంది. ఇంతకీ ఎవరా మహిళ.. ఆమె చేస్తున్న ప్రచారం ఏమిటి..? 

ఆమె పేరే విజయలక్ష్మి.. మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్‌. ప్రవృత్తి.. పది మంది గుమిగూడి ఉండే చోట శాకాహారంతో ప్రయోజనాలను వివరిస్తూ శాకాహారమే తినాలంటూ ప్రచారం చేయడం. ఎంతలా వారికి అవగాహన కల్పిస్తున్నారంటే ఆమె మాటలు విన్న తర్వాత చాలా మంది ఇక మాంసాహారం జోలికి  వెళ్లకూడదని నిర్ణయం కూడా తీసుకుంటున్నారు.   – సికింద్రాబాద్‌ 

శాకాహారంలో అనుభూతిని ఆస్వాదిద్దామా..? అంటూ మొదలవుతుంది ఆమె ప్రచారం. యునైటెడ్‌ వెజిటేరియన్స్‌ ఫోరం పేరుతో సోషల్‌ మీడియా వేదికగా ఓ పేజీ క్రియేట్‌ చేశారు. తనలాంటి భావజాలం ఉన్న వ్యక్తుల్ని ఆ వేదికపైకి రమ్మని పిలుపునిచ్చారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు.. అలా 200లకు చేరింది ఆ సంఖ్య. వీలున్నప్పుడల్లా పదిమంది జనం ఉండే చోట ప్రత్యక్షమవుతారు. శాఖాహారంలోని గొప్పతనాన్ని.. అది తీసుకోవడం వల్ల శరీర అవయవాల మీద పనితీరును.. ఇతర అంశాల్ని చక్కగా వివరించి మాంసాహారానికి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ మాటలు విన్న ఎవరైనా క్చతంగా ఆకుకూరలు, కూరగాయలు గొప్పతనాన్ని ‘వంట’ పట్టించుకోవడం నిజం. 

పక్కా ప్రణాళికతో ప్రచారం.. 
యునైటెడ్‌ వెజిటేరియన్స్‌ ఫోరం వ్యవస్థాపకురాలైన ఎన్‌వీ విజయలక్ష్మి పనితీరు చాలా ఆసక్తికరం. స్వచ్ఛందంగా సేవలందించేందుకు సిద్ధమైన వలంటీర్లు ఎంతమంది అందుబాటులో ఉన్నారో తెలుసుకుంటారు. ఫలానా రోజు ఫలానా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ఓ చిన్న పోస్టులు పెడతారు. ఆ ఏరియాలో ఉండే వలంటీర్లు.. అందుబాటులో ఉండే వారంతా సుముఖత వ్యక్తం చేస్తే వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేస్తారు. తక్కువలో తక్కువ కనీసం 50 నుం 60 మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యేలా చూసుకుంటారు. అక్కడికి వచ్చిన వారంతా బృందాలుగా విడిపోయి నాలుగైదు ప్రదేశాలకు వెళ్లి తమ సంస్థ లక్ష్యాన్ని వివరిస్తారు.

మారేందుకు మీరు సిద్ధమా..? 
సోషల్‌ మీడియా వేదికగా యునైటెడ్‌ వెజిటేరియన్స్‌ ఫోరంలో చేరాలని ఉందా? అయితే అదే పేరుతో ఉన్న ఫేస్‌బుక్, ఇస్ట్రాగామ్‌ పేజీల ద్వారా గానీ.. సభ్యులుగా చేరిపోవచ్చు. ఆ మీదట వలంటీర్లుగా సేవలు అందించవచ్చు. ఆ మీదట శాకాహారం గొప్పతనాన్ని తెలుసుకొని మీరు శాకాహార ప్రియులుగా మారిపోవచ్చు. 

పాఠశాలలే టార్గెట్‌గా..  శాకాహారం వినియోగించాలనే ప్రచారాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలను టార్గెట్‌ చేసుకుని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చదువుకునే వయసు నుంచే జంతువధ చేయకూడన్న లక్ష్యాన్ని విద్యార్థుల్లో ఇనుమడింపజేయడం ద్వారా ఎక్కువ ఫలితాలు రాబట్టవచ్చన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సదస్సులు, సమావేశాలు నిర్వహించడం, పవర్‌పాయింగ్‌ ప్రెజెంటేషన్లు ఇవ్వడం, కరపత్రాలు, స్టిక్కర్ల ద్వారా వీలున్న అన్ని మార్గాల్లో ప్రచారాలు కొనసాగించి శాకాహార భోజన ప్రియులను రూపొందిస్తున్నాం. పాఠశాలల్లో యునైటెడ్‌ వెజిటేరియన్స్‌ ఫోరం కమిటీలు ఏర్పాటు చేయడం, పోటీలు నిర్వహిస్తూ వారికి బహుమతులు, జ్ఞాపికలు అందజేసి ప్రోత్సహిస్తున్నాం. – ఎన్‌వీ విజయలక్ష్మి,  వ్యవస్థాపకురాలు 

దేశమంతా ఒకే వేదికగా.. 
యునైటెడ్‌ వెజిటేరియన్‌ ఫోరం అనేది ఒక తెలంగాణకు మాత్రమే కాకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరింపజేసి.. వీలైనంత ఎక్కువ మంది జనాభాను శాకాహారం వైపు తిప్పటిమే తమ ధ్యేయమని చెబుతున్నారు విజయలక్షి్మ. ఆ దిశగా విస్తృతంగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెప్పారామే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉండే తమ వాళ్ళ ద్వారా అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను ఫోకస్‌ చేస్తున్నారు ఈ వెజిటేరియన్‌ విజయక్ష్మి

ఆరోగ్య సూత్రాలు వివరిస్తూ
ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించడానికి శాకాహారం పాత్ర ఏంటో యునైటెడ్‌ వెజిటేరియన్స్‌ ఫోరం ప్రతినిధులు వివరిస్తారు. ఎదుటివారు మాంసాహార ప్రియులైన వారు అడిగే ప్రశ్నలకి శాకాహార పూరితమైన సమాధానాలు ఇచ్చి వెజిటేరియన్స్‌గా మారాలంటూ రిక్వెస్ట్‌ చేస్తారు. ఒక నెల రోజులు టైం తీసుకోండి.. పప్పు దినుసుల మీద దృష్టి పెట్టండి ఆకుకూరల్లో బలమైన పోషకాల కోసం మీరే తెలుసుకోండి.. మీరు తీసుకునే మాంసాహారాన్ని మేము చెప్పే శాకాహారాన్ని బేరీజు వేసుకోండి అంటూ జనం మెదడుల్లోకి శాఖాహార గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చేయడమేంటి చాలామందిని మార్చి చూపించారు కూడా..  


 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)