Breaking News

ప్రముఖ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంట్లో విషాదం, నెటిజనుల దిగ్భ్రాంతి

Published on Wed, 02/19/2025 - 12:32

ప్రముఖ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  'ఆజ్ మేరే హస్బెండ్ కే లంచ్ బాక్స్ మే క్యా హై' అంటూ పాపులర్‌ అయిన చటోరి రజనీ కుమారుడు రోడ్డు ప్రమాదంలో  ప్రాణాలు  కోల్పోయాడు. ఈ  విషాద వార్తను  రజని దంపతులు ఇన్‌స్టాలో  షేర్‌ చేశారు. దీంతో  ఆమె ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తమ 16 ఏళ్ల కుమారుడు తరణ్ జైన్  ఇకలేడని రజని జైన్, భర్త సంగీత్ జైన్  (ఫిబ్రవరి 18న) ఇన్‌స్టాలో ప్రకటించారు.  2008 ఆగస్టులో పుట్టిన  తరణ్‌ 11వ తరగతి చదువుతున్నాడు. ట్యూషన్ నుండి తిరిగి వస్తున్నపుడు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ వార్త ఆమె అనుచరులను షాక్‌కు గురిచేసింది. అయ్యో, ఎంత విషాదం, నమ్మలేక పోతున్నాం,  బీ  బ్రేవ్‌ అంటూ పలువురు వీరికి ధైర్యం చెబుతున్నారు.

ఇదీ చదవండి: దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!

రజని జైన్ సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్లలో ఒకరు. అనేక శాకాహార వంటకాలతో అభిమానులను  ఆమె ఖుషీ చేసేవారు.  రజని ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారంటే ఆమెకున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు.  భర్త , కొడుకు కోసం ఆమె రోజువారీ టిఫిన్ వంటకాల వీడియోలు 'ఆజ్ మేరే హస్బెండ్ కే లంచ్ బాక్స్ మే క్యా హై' అనే  ట్యాగ్‌లైన్‌తో  రెసిపీలను షేర్‌ చేస్తూ క్రమంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. సుషీ, వెజ్ రామెన్, సిజ్లర్స్  ఇలా  ప్రపంచవ్యాప్తంగా అనే  ప్రసిద్ధ వంటకాలను ఆమె పరిచయం చేశారు.  వీడియోలలో  భర్త ,కొడుకు తరచుగా కనిపించడంతో వారు కూడా  రజని  అభిమానులకు  బాగా పరిచయం. తరణ్ చివరిసారిగా ఈ నెల (ఫిబ్రవరి)5, న రజనీ రీల్‌లో కనిపించాడు.(మదర్స్‌ ప్రైడ్‌ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం)

ఆత్మహత్య ఊహాగానాలు, రజని  జైన్ స్పష్టత
తన మరణానికి కొన్ని గంటల ముందు, తరణ్ జైన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కష్టతరమైన చదువుల గురించి  పోస్ట్‌ను పంచుకోవడం అనుమానాలకు  తావిచ్చింది పంచుకున్నారు. "నేను 11వ తరగతి పాసవుతానా, లేదా చనిపోతానా" అని ఉంది. దీంతో తరణ్‌ది ఆత్మహత్య అనే   ఊహాగానాలు  మొదలయ్యాయి.   అయితే, తరణ్‌  చాలా మెరిట్‌స్టూడెంట్‌ అనీ, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని  రజనీ  వివరణ ఇచ్చారు.
 

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)