Breaking News

చేనేత పట్టుచీరలో ‘బహి -ఖాతా’తో నిర్మలా సీతారామన్‌ రికార్డు

Published on Tue, 07/23/2024 - 11:53

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికిగాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వరుసగా ఏడవ బడ్జెట్‌ను సమ​ర్పిస్తున్నారు. తద్వారా  మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించారు. గతంలో 68 ఏళ్ల క్రితం  సీడీ దేశ్‌ముఖ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. అంతేకాదు గత ఏడాది లాగానే బ్రీఫ్ కేసుకు బదులుగా టాబ్లెట్‌తోనే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

మరో విశేషం ఏమిటంటే పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మంగళవారం తొలి బడ్జెట్‌ను సమర్పించేందుకు సీతారామన్ ఈసారి కూడా చేనేత చీరనే ఎంచుకున్నారు.  తనకోసం ప్రత్యేకంగా రూపొందించిన అధికారం, శక్తికి ప్రతీకతోపాటు, భారతీయ హస్తకళాకారులపట్ల గౌరవంతో  కాంట్రాస్టింగ్ పర్పుల్, పింక్ కలర్ బ్లౌజ్‌తో కూడిన తెల్లని గీతల హ్యాండ్లూమ్ చీరను ఎంచుకోవడం విశేషం.. ముఖ్యంగా సామరస్యం, భారతీయ సంస్కృతిలో కొత్త ప్రారంబానికి, స్వచ్ఛతకు సూచికగా వైట్‌ ఎంచుకున్నట్టు సమాచారం. అలాగే ఈ చీరకు పర్పుల్ కలర్, చేనేత చీర లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది.  

పూర్తికాలపు తొలి మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్ జూలై 5, 2019న తొలి బడ్జెట్‌ను సమర్పించారు. ఆ తరువాత  కరోనా మహమ్మారి కాలంలో 2021లో నిర్మలా సీతారామన్ డిజిటల్  బడ్జెట్‌ను పరిచయం చేశారు.  'మేడ్ ఇన్ ఇండియా'టాబ్లెట్‌ని ఉపయోగించి, పేపర్‌లెస్ ఫార్మాట్‌లో బడ్జెట్‌ను సమర్పించారు. ఇక 2024-25 బ్రీఫ్‌కేస్‌కు బదులుగా రెడ్ క్లాత్ ఫోల్డర్‌ను ఉపయోగించారు. 

బడ్జెట్ సమర్పణకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో   ఆమె  భేటీ అయ్యారు. మంత్రి వర్గం ఆమోదం తరువాత రాష్ట్రపతిని కలవడానికి ముందు, నిర్మలా సీతారామన్ తన కార్యాలయం వెలుపల తన అధికారుల బృందంతో సంప్రదాయ ‘బ్రీఫ్‌కేస్’ ఫోటోకు పోజులిచ్చారు.  ఈసారి  బడ్జెట్‌కు  బహి-ఖాతా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. 

	బడ్జెట్‌ 2024-25 వరుసగా మూడోసారి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)