Breaking News

ఆనందాల దేశం... ఫిన్లాండ్‌కు ఫ్రీగా వెళ్లే ఛాన్స్‌!

Published on Tue, 03/24/2026 - 03:36

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా 2026లో కూడా ఫిన్లాండ్‌ నిలిచింది. వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా అగ్రస్థానంలో కొనసాగింది. ఈ జాబితాలో ఐస్‌ల్యాండ్‌ 2వ స్థానం, డెన్మార్క్‌ 3వ స్థానం, కోస్టారికా 4వ స్థానం, స్వీడన్‌ 5వ స్థానంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో  ‘చిల్‌ లైక్‌ ఏ ఫిన్‌ ఛాలెంజ్‌’పై ప్రపంచవ్యాప్తంగా 
ఆసక్తి నెలకొంది.

వరుసగా తొమ్మిది సంవత్సరాలుగా ఫిన్‌ల్యాండ్‌ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలవడానికి కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే...
→ ఈ దేశంలో అనుబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
→ బలమైన సామాజిక భద్రత ఉంటుంది’. తరతరాలుగా ప్రకృతితో గాఢమైన అనుబంధం ఉంది.  
→ విలాసాల కంటే పర్యావరణ పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తారు.
→ సంపద విషయంలో ‘ఇంకా కావాలి’ అనే అత్యాశ కాకుండా ‘ఇది చాలు’ అనుకునే సంతృప్తి ఈ దేశ ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది.
→ అవినీతి కేసులు తక్కువ కావడంతో సామాజిక ఆందోళనకు తావు ఉండదు.  
→ ప్రభుత్వ అధికారులపై అధిక విశ్వాసం. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ. 
→ ఆడంబరమైన జీవితం కంటే చిన్న, చిన్న రోజువారీ ఆనందాలలోనే సంతోషాన్ని వెదుక్కుంటారు.

చిల్‌ లైక్‌ ఏ ఫిన్‌ ఛాలెంజ్‌
మంచుతో కప్పబడిన ప్రకృతి దృశ్యాలు, శాంటా క్లాజ్‌ గ్రామం, ఉత్తర ధృవపు కాంతిని వీక్షించగలిగే సుందర సరస్సులు యాత్రికులకు అనేకరకాల అనుభవాలను అందిస్తాయి. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్‌ అధికారిక పర్యాటక వేదిక అయిన ‘విజిట్‌ ఫిన్లాండ్‌’ ప్రత్యేకమైన ఏడు రోజుల ‘చిల్‌ లైక్‌ ఏ ఫిన్‌ ఛాలెంజ్‌’ ద్వారా అక్కడి జీననశైలిని ప్రత్యక్షంగా చూడడానికి ప్రజలను ఆహ్వానిస్తోంది.ఈ కార్యక్రమంలో భాగంగా, ఎంపిక చేసిన కొందరు అంతర్జాతీయ పర్యాటకులను ఫిన్నిష్‌ లేక్‌ల్యాండ్‌లో ఒక వారం గడపడానికి ఆహ్వానిస్తారు. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. మెరిసే సరస్సులు, పచ్చదనాల దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు అంతులేని ఆనందాన్ని ఇస్తాయి.

వేసవి స్వర్గం
తమ ప్రచారంలో భాగంగా ఫిన్‌ల్యాండ్‌లో వేసవి కాలాన్ని పరిచయం చేసే ఒక వీడియోను విడుదల చేసింది అక్కడి  పర్యాటకశాఖ. ‘ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండ్‌. మాకు నాలుగు రుతువులు ఉన్నాయి. మేము వాటన్నిటిని ప్రేమిస్తాం. మాకు అత్యంత ఇష్టమైనది వేసవి. వేసవి సెలవులను సంతోషంగా గడుపుతాము. వేసవి ప్రారంభమైన వెంటనే, సామాను సర్దుకొని సరస్సు ఒడ్డున ఉన్న క్యాబిన్‌ల దగ్గరకు వెళతాం. అక్కడే మా సంతోష ప్రపంచాన్ని వెదుక్కుంటాం. ఆలస్యంగా పడుకుంటాం. ఆలస్యంగా నిద్రలేస్తాం. బయటకు వెళ్లి హైకింగ్, బైకింగ్‌ చేస్తాం. స్నేహితులను కలుసుకుంటాం’ అంటూ వీడియో వినిపిస్తుంది.

సందడి మొదలైంది...
ఏడు రోజుల జూన్‌ ఛాలెంజ్‌ కోసం ప్రపంచ నలుమూలల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుదారులు తమ పార్టనర్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ లేదా టిక్‌టాక్‌లో ఒక వీడియోను రూ΄÷ందించాలి. అందులో వారు తమను తాము పరిచయం చేసుకోవాలి.

‘లేక్‌ల్యాండ్‌లో ఫిన్నిష్‌ వేసవి సెలవులు ఎలా ఉంటాయని మీరు ఊహిస్తున్నారు?’ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేసి, దాని లింక్‌ను తమ సోషల్‌ మీడియా పోస్ట్‌కు జత చేయాలి. దరఖాస్తు చేసుకునే వారి వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. భార్య, స్నేహితుడు, కుటుంబ సభ్యులు... తమకు నచ్చిన ఎవరితోనైనా కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేది... 29 మార్చి.

ఆ అవకాశం మీకే రావచ్చు!
మీ కోరికల జాబితాలో ‘ఫిన్లాండ్‌కు వెళ్లాలి’ అనేది కూడా ఉన్నట్లయితే మీరు ‘చిల్‌ లైక్‌ ఏ ఫిన్‌’ ఛాలెంజ్‌లో పాల్గొనడం మంచిది. ఏమో... ఆ ఛాన్స్‌ మీకే రావచ్చు! ఇది  విస్మరించలేని అద్భుత అవకాశం. పర్యాటక ప్రదేశాలను హడావిడిగా చుట్టి రావడం కాకుండా ప్రకృతితో గాఢమైన అనుభూతిని సొంతం చేసుకోవడానికి, ఆ దేశం ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశంగా స్థిరంగా నిలవడానికి కారణాలు ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ చాలెంజ్‌ను రూపకల్పన చేశారు. ఈ చాలెంజ్‌కు ఎంపిక అయిన వారిని ఖర్చులన్నీ వారే భరించి ఉచితంగా తీసుకు వెళతారు. ‘అంతమందిలో మనకేం వస్తుందిలే’ అనుకోవడం నిరాశ. ‘మాకు కూడా రావచ్చునేమో!’ అనుకోవడం ఆశ. సంతోష సౌధానికి పునాది ఆశే కదా! మీలో క్రియేటివిటీ ఉన్నట్లయితే దాన్ని ఉపయోగించుకోవడానికి ఇదే సరైన సమయం. దరఖాస్తు పూర్తి చేయడానికి ‘చిల్‌లైక్‌ఏఫిన్‌.కామ్‌’లోకి వెళ్లాలి. ‘మేము ఎలాంటి వ్యక్తుల కోసం ఎదురుచూస్తున్నామంటే’ అనే కాప్షన్‌తో ఈ సైట్‌లో కొన్ని వివరాలు ఇచ్చారు. 

ఉదాహరణకు కొన్ని...
→ ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి భయపడనివారు.
→ ఇక్కడి అనుభవాలను చిత్రీకరించి ఇతరులకు షేర్‌ చేసేవారు.
→ డ్రైవింగ్‌ తెలిసిన వారు. కనీసం ఒక్క డ్రైవింగ్‌ లైసెన్స్‌ అయినా ఉన్నవారు. 

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)