నో మెయిల్‌...  నో మొబైల్‌...

Published on Sat, 07/25/2026 - 05:39

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీప్రియుల్ని ‘ది ఒడిస్సీ’ సినిమా ఫీవర్‌ చుట్టేసింది. దేశీయ చిత్రాల కన్నా మిన్నగా ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు సినీపండితుల అంచనాలను మించిపోతున్నాయి. సినిమాలో కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేసిన ఆ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ భారతీయ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ టాప్‌ డైరెక్టర్‌ గురించిన కొన్ని ఆసక్తికర విశేషాలు...

క్రిస్టోఫర్‌ నోలన్‌ 1970 జూలై 30న ఇంగ్లాండ్‌లోని లండన్ లో జన్మించారు. ఏడేళ్ల వయసులో, తన తండ్రితో కలిసి తోటలో లఘు చిత్రాలు తీసేవారు. తన అద్భుతమైన, అత్యంత ఖరీదైన చిత్రాలకు క్రిస్టోఫర్‌ నోలన్‌ ప్రసిద్ధి చెందారు, కానీ 55 ఏళ్ల ఈ దర్శకుని వ్యక్తిగత జీవితం మాత్రం చాలా నిరాడంబరంగా ఉంటుంది. 

ఫ్యామిలీ బాండింగ్‌...
‘ది ఒడిస్సీ’ సినిమాలో భార్యాభర్త, తండ్రీ కొడుకు... వంటి కుటుంబ బంధాలను బలంగా చూపించిన క్రిస్టోఫర్‌ నిజ జీవితంలోనూ అంతే బలమైన సెంటిమెంట్స్‌ను అనుసరించడం కనిపిస్తుంది. ఆయన తన కాలేజీ స్వీట్‌హార్ట్‌ అయిన ఎమ్మా థామస్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంట లండన్ లోని యూనివర్సిటీ కాలేజ్‌లో తొలిసారి కలుసుకున్నారు, కలిసి సింకాపీ ఇంక్‌ అనే నిర్మాణసంస్థకు సహ వ్యవస్థాపకులుగా పనిచేశారు.

 ఆయన దర్శకత్వం వహించిన ప్రతి ఫీచర్‌ ఫిల్మ్‌కు ఎమ్మా థామస్‌ నిర్మాత. నోలన్‌ సోదరుడు జోనాథన్‌ సహ–రచయితగా పనిచేస్తుంటాడు. మెమెంటోకు స్ఫూర్తినిచ్చిన లఘు కథతోపాటు, ది ప్రెస్టీజ్, ది డార్క్‌నైట్, ది డార్క్‌నైట్‌ రైజెస్, ఇంటర్‌స్టెల్లార్‌ చిత్రాలకు సహ–రచయితగా పనిచేశాడు. అతని నలుగురు పిల్లలు ‘ది ఒడిస్సీ’ నిర్మాణ సమయంలో వివిధ ప్రాక్టికల్‌ క్రూ విభాగాలలో తెర వెనుక పనిచేశారు. ఆయన కుమార్తె ఫ్లోరా ఇంటర్‌స్టెల్లార్, ఓపెన్  హైమర్‌ చిత్రాల్లో కనిపిస్తుంది. ఆయన కుమారుల్లో ఆలివర్‌ ది ప్రెస్టీజ్‌ చిత్రంలో, అలాగే రోరీ ది డార్క్‌ నైట్‌ రైజెస్‌లో, మాగ్నస్‌: ఇన్సెప్షన్  చిత్రంలో నటించారు. 

నో మొబైల్‌...
టెక్నికల్‌గా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే దర్శకుల్లో ముందు వరుసలో ఉండే క్రిస్టొఫర్‌ నోలన్‌ నిజజీవితంలో కనీసం వ్యక్తిగతం గా ఈ మెయిల్‌ వాడకానికి కూడా ఇష్టపడరు. అంతేకాదు, స్మార్ట్‌ఫోన్  కూడా వినియోగించరంటే విశేషమే. ఇలా వ్యక్తిగతంగా డిజిటల్‌ వినియోగాలకు దూరంగా ఉండే ఆయన దినచర్య, పని అలవాట్లు ఒక విలక్షణమైన, పాతకాలపు జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. ఆయన తన స్క్రీన్ ప్లేలను ఫొటోకాపీ చేయకుండా ఉండేందుకు, ఒక నల్లనోట్‌బుక్‌లో పెన్నుతో రాసుకుంటారు. అంతేకాదు, తన ప్రధాన నటీనటులకు స్క్రిప్ట్‌లను స్వయంగా చేతితో అందించడానికి ఇష్టపడతారు. అలాగే ఆయన ఎక్కడికి వెళ్లినా ఒక ఫ్లాస్క్‌నిండా టీ కూడా ఉంటుంది. సింపుల్‌గా నోలన్‌ పక్కా ఫ్యామిలీ మ్యాన్‌!

– సత్యబాబు, సాక్షి, హైదరాబాద్‌


 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)