Breaking News

''అంత తొందరేంటో''? వరద నీటిలోనే పెళ్లి చేసుకున్న ప్రేమికులు

Published on Wed, 08/02/2023 - 15:58

డోక్సరీ తుఫాను కారణంగా ఫిలిప్పీన్స్‌ను వరదలు ముంచెత్తినా, ఆ వరద నీటిలోనే ఓ జంట వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే, గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఫిలిప్పీన్స్‌ అంతటా వరదలు మంచెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలు ఇళ్ల నుంచి కూడా బయటికి రావడం లేదు. ఇలాంటి సమయంలో వరదలను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రేమికులు వివాహం చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.

మేయి, పాలో పాడిల్లాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాయి. దీంతో పెళ్లిని గ్రాండ్‌గా చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తుఫాను కారణంగా వరదలు పోటెత్తడంతో ఏం చేయాలో తెలియక పెళ్లిని వాయిదా వేసుకుందామనుకున్నారు.

అయితే ఏది ఏమైనా అనుకున్న సమయానికే పెళ్లి జరగాలని వధువు పట్టుబట్టడంతో వరద నీటిలోనే వైభవంగా వీరికి పెళ్లి జరిపించారు. దాదాపు అడుగు మేర నీటిలో వధువు నడుచుకొని వస్తుంటే బంధువులు స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఏది ఏమైనా పెళ్లిని పోస్ట్‌పోన్‌ చేసుకోకపోవడం గ్రేట్‌ అని కొందరు ప్రశంసిస్తుంటే, అంత తొందరేముంది? కొన్ని రోజులు ఆగొచ్చుగా అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)