Breaking News

గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ఫెస్టా జునినా

Published on Sun, 06/07/2026 - 00:05

బ్రెజిల్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడి రంగుల ప్రపంచం కార్నివాల్‌ మాత్రమే. కానీ బ్రెజిల్‌ ప్రజలకు అత్యంత ముఖ్యమైనది ‘ఫెస్టా జునినా’ అనే సాంప్రదాయ పండుగ. జూన్‌ నెలంతా (కొన్ని సందర్భాల్లో జూలైలో) ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ అక్కడి ప్రజల జీవన విధానానికి, ముఖ్యంగా గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతుంది. ప్రాంతాలను బట్టి ఈ పండుగను ‘సావో జోయావో’ అని, ‘ఫెస్టా దో మిల్హో’ అని, ‘మొక్కజొన్న పండుగ’ అని కూడా పిలుస్తుంటారు.

బ్రెజిల్‌ ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఈ ఫెస్టా జునినా పండుగకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఐరోపాలో వేసవి కాలం ప్రారంభాన్ని పురస్కరించుకుని జరుపుకునే పురాతన పద్ధతుల నుంచి ఇది పుట్టింది. క్యాథలిక్‌ సంప్రదాయం ప్రకారం సెయింట్స్‌ను స్మరించుకుంటూ, కొత్త పంటల సీజన్ ను ఆహ్వానిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. పోర్చుగీస్‌ వలసదారుల ద్వారా బ్రెజిల్‌కు పరిచయమైన ఈ సంస్కృతి, కాలక్రమేణా బ్రెజిల్‌ దేశీయ ప్రాంతీయ పద్ధతులు, ఆచారాలను సంతరించుకుని ఒక విశిష్టమైన పండుగగా మారిపోయింది.

ఈ పండుగ వేడుకలను పాతకాలపు గ్రామీణ పద్ధతిలో, గుడారాలు వేసి నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ప్రజల వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బ్రెజీలియన్‌ జానపద, గ్రామీణ సంగీత మూలాలకు నీరాజనాలు అర్పిస్తూ పురుషులు, మహిళలు పల్లెటూరి రైతుల్లా దుస్తులు ధరిస్తారు. పెద్ద గడ్డి టోపీలు, ముఖంపై టాటూలు, పళ్ళు ఊడిపోయినట్లుగా రంగులు వేసుకోవడం, మహిళలు విభిన్నమైన జడలు వేసుకోవడం వంటివి ఈ పండుగలో ప్రత్యేకంగా నిలుస్తాయి.

బ్రెజిల్‌ సాంస్కృతిక వైవిధ్యాన్ని, ఆతిథ్యాన్ని చూడాలనుకునే వారికి ఈ ఫెస్టా జునినా వేడుకలు ఒక మంచి వేదిక. నగరాల హడావుడి, ఆధునిక కార్నివాల్‌ మాత్రమే కాదు, బ్రెజీలియన్‌ మూలవాసుల గ్రామీణ సంస్కృతికి, ఆతిథ్యానికి ఈ ఫెస్టా జునినా ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.

సంప్రదాయ నృత్యాలు
నోరూరించే వంటకాలు
చల్లని శీతాకాలపు వాతావరణంలో జరిగే ఈ వేడుకల్లో చలిమంటలు, సంప్రదాయ నృత్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. 18వ శతాబ్దపు యూరప్‌ సంస్కృతి నుంచి వచ్చిన క్వాడ్రిల్హా అనే సంప్రదాయ సామూహిక నృత్యం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో యువతీ యువకులు వధూవరుల్లా నటిస్తూ ఈ ప్రదర్శనకు కేంద్ర బిందువుగా నిలుస్తారు. ఈ పండుగలో వడ్డించే వంటకాలు నోరూరిస్తాయి. ముఖ్యంగా క్వెంటావో అనే పానీయాన్ని (సాంప్రదాయ మద్యం) ఇక్కడి ప్రజలు పండుగరోజుల్లో తప్పని సరిగా స్వీకరిస్తారు. ఇది చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే మొక్కజొన్నతో తయారు చేసే వంటకాలు, స్వీట్లు విరివిగా తింటారు.  

  • రమా జంబుల  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)