వంట... వనరులు

Published on Wed, 03/18/2026 - 01:17

‘గ్యాస్‌ మామ రావే...జాబిల్లి రావే’ అని పిల్లలు పాడుకుంటున్నారట! ఈ సరదా సరదా పాటల సంగతి ఎలా ఉన్నా, ఎల్‌పీజీ గ్యాస్‌ అనే మాట బాంబులా భయపెడుతూనే ఉంది. గ్యాస్‌ సంక్షోభం వచ్చినప్పుడల్లా... ‘అయ్యో!’ అనుకోవడం కాకుండా...కాస్త ముందు చూపుతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఏర్పాటు చేసుకుంటే సమస్యే ఉండదు కదా! ‘స్మార్ట్‌ ప్లానింగ్‌ ఉంటే శాశ్వత పరిష్కారం మన సొంతం’ అని నిరూపించింది ప్రభాత్‌ స్కూల్‌...

మహారాష్ట్ర అకోలాలోని ‘ప్రభాత్‌ డే అండ్‌ బోర్డింగ్‌ స్కూల్‌’లో వ్యవసాయ వ్యర్థాలతో పనిచేసే ‘ఫ్లేమ్‌ లెస్‌ సిస్టమ్‌’ను ఉపయోగించి రోజుకు పదిహేను వందల మంది విద్యార్థులకు వంటవార్పు చేస్తున్నారు. స్మార్ట్‌ ప్లానింగ్‌ శాశ్వత  పరిష్కారాలకు ఎలా ఉపయోగపడుతుందో ‘ప్రభాత్‌ స్కూల్‌’ నిరూపించింది.

మంట లేకుండా వంట
ప్రభాత్‌ స్కూల్‌ కిచెన్‌లో ‘మంట లేకుండా వంట’ అనేది నిన్నా మొన్నటి కాన్సెప్ట్‌ కాదు. దశాబ్ద కాలం క్రితమే వచ్చిన దీర్ఘకాలిక ఆలోచన. సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నం. ఆ దూరదృష్టి ఊరకే పోలేదు. ఎంతోమంది కి స్ఫూర్తి ఇస్తోంది.

స్కూల్‌ వంటగదిలో సంప్రదాయ వంటగ్యాస్‌కు బదులు థర్మిక్‌ ఫ్లూయిడ్‌ హీటింగ్‌ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు. సరళంగా చె΄్పాలంటే ఆయిల్‌ పైపుల ద్వారా వేడి సర్క్యులేట్‌ అవుతుంది.. మంట లేకుండా స్థిరమైన వేడి వంట పాత్రలకు చేరుతుంది. వ్యవసాయ వ్యర్థాల నుండి తయారైన బయోమాస్‌– ఆధారిత ఇంధన గుళికలు(ఫ్యూయెల్‌ పిల్లెట్స్‌) ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. 

పెద్ద వంట గదిలోకి అడుగు పెట్టేవారికి గ్యాస్‌ స్టవ్‌ల నుండి వచ్చే వేడి ఎంత ఉంటుందో తెలుసు. ముఖ్యంగా వేసవిలో ఆ వేడి మరింత తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ మంట రహిత వంట గదిలో అధిక వేడితో ఇబ్బంది పడడం అనేది ఉండదు.

బయోగ్యాస్‌ బాటలో...
వంటగది వ్యర్థాలు... ఆవు పేడతో తయారయ్యే ఇంధన అద్భుతం... బయోగ్యాస్‌. తాజా ఎల్‌పీజీ సంక్షోభం నేపథ్యంలో బయోగ్యాస్‌ మళ్లీ తెర మీదికి వచ్చింది. బయోగ్యాస్‌ అనేది మీథేన్, కార్బన్‌ డయాక్సైడ్‌ల మిశ్రమం. ఆక్సిజన్‌ లేని వాతావరణంలో  సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు ఉత్పత్తి అవుతుంది. బయోగ్యాస్‌ను వంట కోసమే కాకుండా లైట్లు, జనరేటర్‌లకు కూడా ఉపయోగించవచ్చు. గృహ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి తమకు అనుకూలమైన బయోగ్యాస్‌ ప్లాంట్‌లను నిర్మించుకోవచ్చు. వాటిలో కొన్ని... 

1. ఫిక్స్‌డ్‌ డోమ్‌ డైజెస్టర్‌: ఫిక్స్‌డ్‌ గ్యాస్‌ స్పేస్‌తో నిర్మించే అండర్‌గ్రౌండ్‌ చాంబర్‌. ∙మెయింటెనెన్స్‌కు తక్కువ శ్రమతో మెయింటెనెన్స్‌ ∙లీక్‌–ప్రూఫ్‌ కోసం నిపుణుల సలహాలు తీసుకోవాలి.
2. ఫ్లోటింగ్‌ డ్రమ్‌ డైజెస్టర్‌: గ్యాస్‌ వాల్యూమ్‌తో కదిలే ఫ్లోటింగ్‌ గ్యాస్‌ హోల్డర్‌ ∙పర్యవేక్షించడం సులభం, తక్కువ శ్రమ.
3. ఫ్లెక్సీ–బ్యాగ్‌/ ప్లాస్టిక్‌ డైజెస్టర్‌: పీవీసీ టార్పాలిన్‌తో తయారు చేస్తారు కాబట్టి కొత్తగా ప్రారంభించే వారికి, అద్దె ఇంటిలో నివసించేవారికి అనుకూలమైనది.

లైఫ్‌ స్పాన్‌: 1. íఫిక్స్‌డ్‌ డోమ్‌ డైజెస్టర్‌: 15–20 సంవత్సరాలు 2. ఫ్లోటింగ్‌ డ్రమ్‌ డైజెస్టర్‌: 8–10 సంవత్సరాలు...‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉ పాయాలు’ అన్నట్లు వంటగ్యాస్‌ ఎంత భయపెడితే మాత్రం ఏం? దాని నుంచి బయటపడడానికి, పర్యావరణ అనుకూల ఇంధన వనరులను అన్వేషించడానికి బోలెడు ఉ పాయాలు. మీదే ఆలస్యం!

ఆదా–ఆదాయం
గ్రామీణ ప్రాంతాలలోనే కాదు, సేంద్రియ వంటగది వ్యర్థాలు సులభంగా అందుబాటులో ఉండే పట్టణ ప్రాంతాలలో కూడా బయోగ్యాస్‌ ప్లాంట్‌ సమర్థంగా పనిచేస్తుంది
బయోగ్యాస్‌ ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు, ఆదాయం పొందవచ్చు. బయోగ్యాస్‌ ప్లాంట్‌ నుండి వచ్చే ‘లిక్విడ్‌ స్లర్రీ’ సేంద్రియ ఎరువుగా పనికొస్తుంది.
 ప్రస్తుతం దేశీయ బయోగ్యాస్‌ మార్కెట్‌ 20 శాతానికి పైగా వార్షిక వృద్ధితో దూసుకుపోతోంది
 కేంద్రప్రభుత్వం జాతీయ జీవశక్తి కార్యక్రమం కింద గృహ బయోగ్యాస్‌ ప్లాంట్‌లకు ఆర్థిక సహాయం అందిస్తోంది.

Videos

జగన్ నీకు చేసిన అన్యాయం ఏమిటి? షర్మిలపై కొండా రాఘవ రెడ్డి ఫైర్

విజయవాడ ఇఫ్తార్ విందులో YS జగన్

యూట్యూబ్ వైష్ణవి భర్త అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌

వక్ఫ్ భూముల జోలికొస్తే.. కూటమికి అంజాద్ బాషా వార్నింగ్

Ugadi: తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్షలు

జగన్ ను కలిసిన HYD జర్నలిస్ట్, కె వెంకట్రామి రెడ్డి

ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు

ఇరాన్ 40ఏళ్ల ప్లానింగ్ వృధా.. ఒక్క క్షణంలో ముంచేసిన అమెరికా-ఇజ్రాయిల్..

జగన్ పాలనే బాగుంది YS షర్మిల సభలో రైతుల రియాక్షన్

Photos

+5

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు.. కనుల పండువగా ప్రభోత్సవం (ఫొటోలు)

+5

సాక్షి స్పెషల్.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

ఇఫ్తార్‌ విందు.. ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

ఫేమస్ వినాయక దేవాలయంలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మాళవిక (ఫొటోలు)

+5

'ధురంధర్ 2' సినిమా.. HD ఫొటోలు

+5

సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్‌ (ఫొటోలు)

+5

అందంగా రాశీఖన్నా.. చీరలో క్యూట్ శ్రీలీల (ఫొటోలు)

+5

శ్రీశైలంలో ఉగాది జాతర..నల్లమలలో పాదయాత్రగా వెళ్తున్న కర్ణాటక భక్తులు (ఫోటోలు)

+5

నటి మంచు లక్ష‍్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)