Breaking News

Father of Gynecology: ప్రయోగాల వెనుక దారుణ నిజాలు..!

Published on Tue, 02/25/2025 - 15:29

ప్రస్తుతం గైనకాలజీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. గానీ పూర్వం రోజుల్లో ఇవి లేక మహిళలు చాలా ఇబ్బందిపడేవారు. తమ సమస్యలను మరొకరితో చెప్పుకునేందుకు కూడా సిగ్గుపడేవారు. అలాంటి పరిస్థితుల్లో వారుపడే అంతర్గత గైనకాలజీ సమస్యలు చికిత్స లేనివిగా ఉండేవి. ఆ దిశగా ప్రయోగాలు చేసేవాళ్లు కూడా తక్కువే. అందులోనూ స్త్రీ శరీర ధర్మాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందుకు అనుగుణంగా చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటిపై ధైర్యంగా ప్రయోగాలు చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తి జేమ్స్ మారియన్ సిమ్స్‌. అతని వల్లే స్త్రీల ప్రసూతి సమస్యలకు నివారణోపాయాలు కనిపెట్టడానికి మార్గం సుగమమైంది. ఆ నేపథ్యంలో అతడు ఒడిగట్టిన దారుణలు తెలిస్తే వామ్మో అని విస్తుపోతారు. 

'గైనాకాలజీ' అనే అంశం వస్తే అతడికే ధన్యవాదాలు చెప్పుకొవాలి. అంతేగాదు అతడిని "ఆధునిక గైనకాలజీ పితామహుడు"గా అభివర్ణిస్తారు కూడా. అయితే ఈ గైనకాలజీ సమస్యలను నివారించే క్రమంలో అతడు చేసిన దారుణ ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. 

గైనకాలజీ నిపుణులు  జేమ్స్ మారియన్ సిమ్స్‌  1813లో అమెరికా సౌత్ కరోలినాలోని లాంకాస్టర్ కౌంటీలో జన్మించాడు. అతడు జెఫెర్సన్ మెడికల్ కాలేజీలో మూడు నెలల కోర్సు పూర్తి చేసుకుని ఒక వైద్యుడి వద్ద ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత సాధారణంగా కొన్నేళ్లు హౌస్‌ సర్జన్‌గా ప్రాక్టీస్‌ చేస్తారు. 

అయితే ఆ కాలంలో సంవత్సరాల తరబడి ప్రాక్టీస్‌ చేయకుండానే నేరుగా వైద్య వృత్తిని కొనసాగించేవారు. ఆ నేపథ్యంలోనే ఆయన వల్ల ఇద్దరు రోగులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత జేమ్స్  అలబామాలోని మోంట్‌గోమెరీకి మకాం మార్చాడు. అక్కడ జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో వైద్య మానవీయ శాస్త్రాల ప్రొఫెసర్ వెనెస్సా గాంబుల్ ఆధ్వర్యంలో డాక్టర్‌గా పనిచేసేవాడు. 

అక్కడ ఉండే ఎనిమిది మంది వ్యక్తుల ఆస్పత్రిలో రోగులకు చికిత్స అందించేవాడు. కొందరిని తన ఇంటికి తీసుకువెళ్లేవాడు. అక్కడ వారిపై ప్రయోగాలు చేసేవాడు. అయితే ఆరోజుల్లో మహిళల ప్రసూతికి సబంధించిన సమస్యలను పరిశీలించడానకి సరైన పరికరాలు ఉండేవి కాదు. దీంతో వారి సమస్యను అర్థం చేసుకునేందుకు ప్రత్యత్పత్తి అవయవాల్లోకి వేళ్లను చొప్పించి గానీ తెలుసుకోవడానికి వీలు ఉండేది కాదు. 

అలాగే వారికి చికిత్స చేసేందుకు అనువైన బెడ్‌ కూడా ఉండేది కాదు. అవమానీయ పద్ధతుల్లో మహిళలకు ట్రీట్‌మెంట్‌ చేయకతప్పని పరిస్థితి అంటూ జేమ్స్‌ తన ఆత్మకథకు సంబంధించిన పుస్తకంలో రాశారు. ఆ క్రమంలో కొందరి పేషెంట్ల పరిస్థితి రీత్యా తన వ్యక్తిగత కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ ఆ సమస్యకు పరిష్కారం కోసం​ ప్రయోగాలు చేసేవాడట. 

అందుకోసం అతడు నల్లజాతి పేషెంట్లనే వినయోగించానని ఆ పుస్తకంలో తెలిపాడు. అందరు అనుకున్నట్లు నల్లజాతీయల శరీరాలు మందంగా ఉంటాయి కాబట్టి బాధ తక్కువగా ఉంటుందనేది అపోహేనని పేర్కొన్నాడు. తాను వారిపై అనస్థీషియా ఇవ్వకుండానే ప్రయోగాలు చేసేవాడినని, ఎందుకంటే సమస్యను, స్త్రీ దేహ నిర్మాణాన్ని అర్థంచేసుకునేందుకు అలా చేయక తప్పేది కాదని పుస్తకంలో చెప్పుకొచ్చాడు. 

ఆ నేపథ్యంలో తన వద్దకు వచ్చిన ఒక రోగి కేసు గైనకాలజీ సమస్యను పరిష్కరించడానకి దారతీసిందని తెలిపాడు. ఒకామెకు ఫిస్టులా సమస్యతో బాధపడుతుంది. దీని కారణంగా ఆమెకు మూత్రం తెలియకుండానే వెళ్లిపోతుంది. అందుకు చికిత్స లేదని తెలిసి ఆమెపై పలు ప్రయోగాలు చేశానని, ఆ విధంగానే మహిళల ప్రసూతి సమస్యలకు నివారణ మార్గాలను కనిపెట్టగలిగానని తన తన ఆత్మకథ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్‌లో రాసుకొచ్చాడు. 

తాను చేసిన ప్రయోగాలు చాలామంది మహిళలను బాధపెట్టి ఉండొచ్చు గానీ, వాళ్లంతా ఎదుర్కొనే గైనకాలజీ సమస్యలను నివారించడానికి మార్గం సుగమమైందని ఆ పుస్తకంలో చెప్పుకొచ్చాడు. ఇక్కడ కేవలం నల్లజాతీయుల మహిళలపై ప్రయోగాలు చేయడం అనేది చూస్తే జేమ్స్‌కి ఉన్న జాత్యాహంకారం తేటతెల్లమవ్వగా, మరోవైపు ఆ నల్లజాతీయ మహిళలను యావత్తు స్త్రీల సమస్యలకు నివారించడంలో సహాయపడిన వారిగా కీర్తించవచ్చు కూడా కదూ..!. 

(చదవండి: మానసిక రుగ్మతలతో ఇంతమందా..? వెలుగులోకి 'మతి'పోయే విషయాలు)
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)