Breaking News

పెళ్లి కూతురు చేతులను మరింత ఆకర్షణీయంగా మార్చే బ్రేస్‌లెట్‌ రింగ్‌!

Published on Fri, 01/27/2023 - 16:28

పెళ్లి కూతురు అలంకరణలో రకరకాల మోడల్స్‌లో ఉన్న బ్రేస్‌లెట్‌ రింగ్స్‌ మెహెందీ చేతులను మరింత ఆకర్షణీయంగా మార్చేస్తాయి. ఇక గెట్‌ టు గెదర్‌ వంటి వెస్ట్రన్‌ వేడుకల్లో స్టైలిష్‌ డ్రెస్‌లకు మరింత స్టైలిష్‌ లుక్‌నిస్తున్నాయి ఈ బ్రేస్‌లెట్‌ రింగ్స్‌.

అమ్మాయిల అలంకరణలో ప్రతిదీ ప్రత్యేకతను నింపుతుంది. అందమైన దుస్తులే కాదు ఆభరణాలూ అంతే ఘనంగా ఉండాలనుకుంటారు. ఏ వేడుక అయినా మెడలో హారాలు, కాళ్లకు పట్టీలు, చేతులకు గాజులు మ్యాచింగ్‌గా  ఎంపిక చేసుకుంటుంటారు. బంగారు, వెండి లేదా ఫ్యాన్సీ ఆభరణాలను సందర్భానుసారం ఉపయోగిస్తుంటారు.

వీటిలో బ్రేస్‌లెట్‌ రింగ్స్‌ ఇప్పుడు కీలకంగా మారాయి. ముంజేతిని చుట్టేసే బ్రేస్‌లెట్‌... దాని నుంచి వేలి ఉంగరానికి జత చేస్తూ ఉన్నట్టుగా ఉండే ఈ మోడల్స్‌ చేతులను మరింతగా హైలైట్‌ చేస్తున్నాయి. 

పూసలు వరసలు... ఇవి సంప్రదాయ దుస్తుల మీదకు బాగా నప్పుతున్నాయి. అంటే, సంప్రదాయ వేడుకల సమయాల్లో వీటిని అలంకరించుకోవచ్చు. బ్లాక్‌బీడ్స్‌ వరసతో ఈ అల్లికను గమనించవచ్చు. 

రత్నాల రాశులు... నవరత్నాలు, డైమండ్స్‌ పొదిగిన బ్రేస్‌లెట్‌ రింగ్స్‌ పెద్ద పెద్ద వేడుకల్లో మరింత గ్రాండ్‌గా వెలిగిపోతున్నాయి. 
బంగారు హంగు... బంగారు తీగెలతో రూపుకట్టిన ఈ ఆభరణం. ఇటు సంప్రదాయ, అటు స్టైలిష్‌ వేర్‌లా కూడా పార్టీకి తగిన హంగును తీసుకువస్తుంది. 
వెండి జిలుగులు... వెండి జిలుగుకు పెద్ద పెద్ద స్టోన్స్‌ జత కలిసిన బ్రేస్‌లెట్‌ రింగ్స్‌ మోడర్న్‌ ఔట్‌ఫిట్స్‌కు స్టైలిష్‌ లుక్‌ని ఇస్తున్నాయి. ఇవి ఏ కాలమైనా యూత్‌ని మెప్పిస్తూనే ఉన్నాయి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)