Breaking News

డెనిమ్‌ న్యూ లుక్‌ డిజైన్‌..!

Published on Fri, 05/24/2024 - 11:31

ఫ్యాషన్‌ ప్రపంచంలో అప్‌ సైక్లింగ్‌ మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఉన్నదానిని సృజనాత్మకంగా మార్చడంలో కళాత్మక విలువతో ΄ాటు పర్యావరణ స్పృహ కూడా ఉంటుంది. ఎప్పుడూ కొత్తవాటి కోసం పరుగులు తీయకుండా ఉన్నవాటిని కొత్తగా, ఫ్యాషనబుల్‌గా ఎలా ప్రిపేర్‌ చేసుకోవాలో తెలియజెప్పడానికి  డిజైనర్లుపోటీ పడుతుంటారు. దీంట్లో భాగంగా డెనిమ్‌ అప్‌ సైక్లింగ్‌  ఎప్పుడూ  బెస్ట్‌ ఛాయిస్‌గా ఉంటుంది.

మనకున్న రకరకాల డిజైన్‌ వేర్‌లలో వివిధ రకాల ఫ్యాబ్రిక్‌తో రూపొందించినవి ఉంటాయి. వీటిలో డెనిమ్‌ జాకెట్స్, స్కర్ట్స్, ప్యాంట్స్‌ కూడా మోడర్న్‌ డ్రెస్సుల్లో భాగంగా చేరుతుంటాయి. జీన్స్‌ ప్యాంటులకు ఉపయోగించే నీలం రంగు గట్టి ఫ్యాబ్రిక్‌ను డెనిమ్‌ అంటారు. డెనిమ్‌ డ్రెస్సులైతే సంవత్సరాలుగా ఉపయోగించేవీ ఉంటాయి. కొన్నింటిని తీసిపడేయలేం, అలాగని వార్డ్‌ రోబ్స్‌లోనూ ఏళ్ల తరబడి ఉంచేయలేం. ఈ పరిస్థితులలో వాటికో కొత్త రూపు ఇవ్వడం చాలా మేలైన కళ. టాప్స్, కుర్తీస్, శారీస్‌.. ఇలా అనుకూలతను బట్టి అందమైన డిజైనర్‌ వేర్‌ని రూపొందించవచ్చు. లేదంటే విడిగా కొత్త ఫ్యాబ్రిక్‌తో సరికొత్త డిజైన్‌నీ క్రియేట్‌ చేయవచ్చు.

అప్‌ సైకిల్‌ డెనిమ్‌ శారీ వర్ణిక సాంగోయి ముంబై ఫ్యాషన్‌ డిజైనర్‌. డెనిమ్‌తో ఎన్నో అప్‌సైకిల్‌ డిజైన్స్‌ చేసిన డిజైనర్‌. మోడర్న్‌ డ్రెస్సులే కాదు శారీస్‌ను కూడా డెనిమ్‌ టచ్‌తో,ప్యాచ్‌ వర్క్‌తో వివిధ రకాల మెటీరియల్‌ను ఉపయోగిస్తూ తయారు చేసింది. డెనిమ్‌ దర్జి పేరుతో స్టూడియో కూడా రన్‌ చేస్తుంది.

– నెట్‌ ఫ్యాబ్రిక్, డెనిమ్‌ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన చీర ఇది. చీర బార్డర్‌పైన ఘుంగ్రూ వర్క్‌ డిజైన్‌ చేశారు. 
– పోల్కా డాట్స్‌ప్యాచ్‌ వర్క్‌తో రూపొందించిన శారీ
– లినెన్‌ శారీకి జియోమెట్రిక్‌ స్టైల్‌లో కట్‌ చేసిన డెనిమ్‌ క్లాతతో ప్యాచ్‌ వర్క్‌ చేశారు. 
– స్కర్ట్‌ శారీని డెనిమ్‌ను ఉపయోగిస్తూ చేసిన మ్యాజిక్‌ స్టైల్‌ డ్రెస్‌ ఇది. 
– డెనిమ్‌ క్రాప్‌టాప్‌
– కాటన్‌ ఫ్యాబ్రిక్‌ – డెనిమ్‌ జాకెట్‌ని ఉపయోగిస్తూ రూపొందించిన కుర్తా
– లేస్‌తో లాంగ్‌ స్లీవ్స్‌ రూపొందించిన డెనిమ్‌ జాకెట్‌
– డెనిమ్‌ ప్యాచ్‌వర్క్‌తో మోడర్న్‌ టాప్‌
– డెనిమ్‌ ప్యాంట్‌ బెల్‌ స్టైల్‌కి క్రోచెట్‌ డిజైన్‌ను అదనంగా జత చేస్తే వచ్చే స్టైల్‌.

ఇవి చదవండి: పవర్‌ఫుల్‌ ప్రఫుల్‌..!

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)