Breaking News

ఈ అందాల భామలు నేషనల్‌ కాదు ఇంటర్నేషనల్‌..!

Published on Fri, 06/27/2025 - 09:45

బాలీవుడ్‌ని సినిమాల గురించి మాత్రమే కాదు, నవతరం బ్యూటీలు చేస్తున్న బోల్డ్‌ ఫ్యాషన్‌ ప్రోగ్రెస్‌ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ యువ నటీమణులు తమ సినిమా పాత్రలతోనే కాదు ఫ్యాషన్‌లో ఇంటర్నేషల్‌ స్టైల్‌ను కూడా నిర్దేశిస్తున్నారు .ప్రపంచంలోని కొన్ని అగ్రశ్రేణి లగ్జరీ బ్రాండ్‌లతో జత కట్టి, ప్రపంచ ఫ్యాషన్‌ రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నారు. 

ఖుషీ కపూర్‌
ఖుషీ కపూర్‌ బాలీవుడ్‌ ఫ్యాషన్‌లో మరో వర్ధమాన తార. ఆమె ఫ్యాషన్‌లో చేసే ప్రయోగాలు విరివిగా మనకు కనిపిస్తుంటాయి. ఆమె తాజా ఎంపిక డియోర్‌ బార్బీకోర్‌ పింక్‌ కలర్‌ స్కర్ట్‌ సూట్‌. డ్రెస్సింగ్‌ సాధారణంగా ఉన్నప్పటికీ ఆమె దానిని సిగ్నేచర్‌ డియోర్‌ వైట్‌ పెర్ల్‌ నెక్లెస్, బ్లాక్‌ పెండెంట్, మినీ హ్యాండ్‌బ్యాగ్‌తో హైలైట్‌ చేసింది.

అనన్య పాండే
మిడి స్టైలింగ్‌పై అనన్య పాండే ఆలోచన ప్రపంచ ఫ్యాషన్‌ సెన్సిబిలిటీలపై ఆమెకున్న పట్టును ప్రదర్శిస్తుంది. లగ్జరీ బ్రాండ్‌ చానెల్‌ మ్యూజ్‌ స్కర్ట్, జాకెట్‌ రెండూ ఆమెను హై–ఫ్యాషన్‌తో ఆకట్టుకునేలా మార్చాయి. మెరిసే, స్ట్రాపీ హీల్స్‌తో లుక్‌ను పూర్తి చేసింది.  

మానుషి చిల్లర్‌
మాజీ మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌ సోషల్‌ మీడియాలో యంగ్‌ వరల్డ్‌కి ఫ్యాషన్‌ ఐకాన్‌గా చెప్పవచ్చు. ఆమె ఇంటర్నేషనల్‌ బ్యూటీ కాంటెస్ట్‌ అనుభవం తన డ్రెస్సింగ్‌ స్టైల్‌లోనూ ప్రతిబింబిస్తుంది. మిడి స్టైలింగ్‌తో అద్భుతమైన లుక్‌లో ఆకట్టుకుంటుంది. స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ పెప్లం టాప్‌కి తెల్లటి మినీ స్కర్ట్‌తో జత చేసింది. ΄ాయింటెడ్‌ హీల్స్, స్టేట్‌మెంట్‌ బ్యాగ్‌తో లుక్‌ను పూర్తి చేస్తూ, లగ్జరీ బ్రాండ్‌ లూయిస్‌ విట్టన్‌ను తల నుండి కాలి వరకు స్టైల్‌ చేసింది.

జాన్వీ కపూర్‌
జాన్వీ డ్రెస్సింగ్‌ స్టైల్‌ నిరంతరం చర్చనీయాంశంగా ఉంటోంది. ఆమె ఇటీవలి మియు మియు లుక్‌ చూస్తే మన స్కూల్‌ రోజులు గుర్తుకు వస్తాయి. జాన్వీ ఇటీవల కాన్స్‌లో పాల్గొనడానికి సోదరి రియా కపూర్‌  స్లీవ్‌లెస్‌ మ్యాచింగ్‌ వైట్‌ నిట్‌ టాప్‌తో జత చేసిన తెల్లని నిట్‌ మినీ స్కర్ట్‌తో స్టైలింగ్‌ చేసింది. 

బ్లూ కలర్‌ చెక్స్‌ షర్ట్‌తో లుక్‌ను లేయర్‌గా అలంకరించి, దానిపైన లాంగ్‌ స్లీవ్స్‌తో ఉన్న బ్రౌన్‌ కలర్‌ చెక్స్‌ జాకెట్‌తో మ్యాచ్‌ చేసింది. ఇది రిలాక్స్‌ వైబ్‌ను సృష్టిస్తుంది. తమ డ్రెస్సింగ్‌ స్టైల్‌తోనే కాన్ఫిడెన్స్‌ను చూపుతున్న ఈ తారలు నవతరానికి ఇంటర్నేషనల్‌ ఐకాన్స్‌గా మారుతున్నారు.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)