Breaking News

ట్రెండ్‌సెట్టర్‌

Published on Sun, 02/09/2025 - 05:51

‘నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను, ట్రెండ్‌ సెట్‌ చేస్తాను’ అనే డైలాగ్‌ లాగే, ప్రయోగాత్మక డిజైన్స్‌తో పాపులర్‌ అయి, ఫ్యాషన్‌ ప్రపంచంలో ఒక ట్రెండ్‌సెట్టర్‌ స్టయిలిస్ట్‌గా మారిన శ్రుతి మంజరి గురించి కొన్ని విషయాలు..

ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు తిరుగుతూ, కొత్తగా ట్రై చేస్తుంటేనే మనలోని ఓల్డ్‌ వర్షన్‌ అంతా పోయి, అప్‌డేట్‌ అవుతాం. అచ్చం అలాగే ఫ్యాషన్‌లోనూ, కొత్తగా ట్రై చేస్తుంటూనే అప్‌డేట్‌ అవుతుంటాం. – శ్రుతి మంజరి.

చెన్నైలో పుట్టిపెరిగిన శ్రుతికి చిన్నప్పటినుంచే ఫ్యాషన్‌ పట్ల మక్కువ ఎక్కువ. కాలేజీ రోజుల్లో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్‌ మనీ మొత్తం ఫ్యాషన్‌ మ్యాగజైన్స్‌కే ఖర్చు చేసేది. తర్వాత ప్రముఖ డిజైనర్ల దగ్గర ఇంటర్న్‌గా చేరి, ఫ్యాషన్‌పై మరింత ప్రావీణ్యం సాధించింది. ఆ సమయంలోనే రకరకాల డ్రెస్సింగ్‌ స్టయిల్స్‌ను గమనించింది. డిజైనింగ్‌పై దృష్టిపెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే, తనకున్న ఫ్యాషన్‌ స్పృహ, సృజనే క్వాలిఫికేషన్‌గా, ఒక బొటిక్‌ ప్రారంభించింది. కొత్త కొత్త డిజైన్స్‌ రూపొందించి, తనకంటూ ఒక సిగ్నేచర్‌ స్టయిల్‌ను క్రియేట్‌ చేసుకుంది.

ఫ్యాషన్‌ ఇండస్ట్రీలో సంపాదించిన అనుభవంతో స్టయిలింగ్‌ చేయటం కూడా స్టార్ట్‌ చేసింది. అదే ఆమెకు సినీ తారల లుక్స్, స్టయిల్‌ను తీర్చిదిద్దే చాన్స్‌నిచ్చింది. అలా శ్రుతి తొలిసారి ‘బ్యాడ్‌ గర్ల్‌’ అనే తమిళ చిత్రంతో కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అండ్‌ స్టయిలిస్ట్‌గా పనిచేసింది. అందులోని ఆమె పనితీరు ఆమెకు మరెన్నో సినిమాల్లోనూ స్టయిలింగ్‌ చేసే అవకాశాన్నిచ్చింది. అలా శ్రుతి తమిళ చిత్ర పరిశ్రమలో ఒక బిజీ స్టయిలిస్ట్‌గా మారింది. ‘భూమ్‌’, ‘మోడర్న్‌ లవ్‌ చెన్నై’, ‘రఘు తాత’, ‘సొర్గవాసల్‌’ వంటి ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా పనిచేసింది. కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మీ, సానియా అయ్యప్పన్, కళ్యాణి ప్రియదర్శిని, ప్రియాంకా మోహన్, గౌరి జి.క్రిష్ణన్‌ వంటి స్టార్స్‌కి కొంతకాలం స్టయిలిస్ట్‌గా పనిచేసింది.

Videos

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు